ఆంధ్ర ప్రదేశ్ లో వెనుకబడిన తరగతులు ఈ దేవాంగ లేదా దేవాంగి బి.సి.బి.గ్రూపు లోని కులం.

Devala Maharshi.jpg
దేవాల మహర్షి (వీరికి దేవాంగ పురాణం అనే గ్రంథం ఉందని, అందులో తాము దేవల మహర్షి సంతానమని చెబుతారు)

వృత్తి మార్చు

చేనేత దేవాంగుల కులవృత్తి. పూర్వం పత్తి మొక్కల స్థానంలో చెట్లు ఉండేవి. ఇప్పటికీ మనం అక్కడక్కడ దేవాలయాల్లో ఎర్రటి పత్తికాయలతో కనిపించే చెట్టును చూడొచ్చు. ఆ చెట్టు నుంచి పత్తి దిగుబడి బాగానే వచ్చేది. ఈ చెట్ల నుంచి సేకరించిన పత్తి ద్వారానే మన చేనేత కార్మికులు అప్పట్లో వస్త్రాలను తయారు చేసేవారు.

సామాజిక జీవితం మార్చు

తర్వాత దేశీయ పత్తిలో ఉన్నంత మన్నిక హైబ్రీడ్‌ పత్తిలో ఉండకపోయినా అనివార్యంగా మన వారు హైబ్రీడ్‌ను ఎంచుకోవాల్సి వచ్చింది. దేవాంగ కులానికి చెందిన కార్మికులవృత్తి దెబ్బతింది. టెండర్లు పిలిచే విధానానికి స్వస్తి పలికి వస్త్రాలను వీరి నుంచి కొనుగోలుచేస్తే వారి మనుగడ సాగుతుంది. గుడ్డ బ్యానర్ల స్థానంలో ఫెక్సీలు రావటంతో వీరు ఆదాయాన్ని నష్టపోతున్నారు. నేడు మారుమూల గ్రామాలలో సైతం ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.

సమస్యలు మార్చు

టెక్క్స్ టైల్‌ పార్కుల్లో ఏర్పాటుచేసే ఆటోమేటిక్‌ లూమ్స్, ఎయిర్‌ జెట్‌ లూమ్స్ వల్ల చేనేత కార్మికులు పెద్ద ఎత్తు న ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ఆయా పార్కుల్లో కార్మిక చట్టాలు వర్తించవు. పైగా చేనేత రిజర్వేషన్‌ చట్టం కూడా ఉల్లంఘనకు గురవుతోంది. 1985 చేనేత రిజర్వేషన్‌ చట్టం ప్రకారం చీర, ధోవతితోపాటు మరో పదకొండు రకాలు చేతి మగ్గాలపైనే ఉత్పత్తి కావాల్సిఉంది. ఆప్కోలో కూడా చేనేత వస్త్రాల పేర మిల్లు వస్త్రాల అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినవస్తున్నాయి. నూలు, రసాయనాలు, రంగులు వంటి ముడిసరుకు ప్రభుత్వం సరసమైన ధరకు చేసేత కార్మికునికి అందిం చాలంటారు చేనేత నాయకులు. హైదరాబాద్‌లో దేవాంగ కమ్యూ నిటీ హాలుకు స్థలం కేటాయించాలని, భవన నిర్మాణానికి కూడా తోడ్పడాలని కోరుతున్నారు.

పురాణం మార్చు

వీరికి దేవాంగ పురాణం అనే గ్రంథం ఉందని, అందులో తాము దేవల మహర్షి సంతానమని చెబుతారు. వీరిలో చాలామందికి జంధ్యాలు ఉంటాయి. వీరు వీరశైవ మతస్తులు. శ్రీ శైలం లో శివరాత్రి నాడు, దిగంబరంగా, దేవాంగులు శిఖరం ఎక్కి వస్త్రం కప్పుతారు. వీరిలో, చాలామందికి,శివునికి సంబందించిన పేర్లు మల్లేశ్వర , మల్లీశ్వరి, వీరభద్ర , భద్రకాళి , బసవ, శంకర, పార్వతి, పెట్టుకుంటారు. వీరభద్ర సంబరం జరుపుతారు. శ్రావణ పూర్ణిమ కు సహ పంక్తి భోజనాలు చేస్తారు. సహ పంక్త్రి (సామూహిక) భోజనాలకి పిలవక పోతే, వారిని కులం నుంచి వెలి వేసినట్లు గా అనుకుంటారు. కర్ణాటక లో పుట్తిన బసవేశ్వరుడు స్థాపించిన వీరశైవమతాన్ని వీరు అనుసరిస్తున్నారు.లింగధారణ (మెడలో లింగం ధరించటం) కూడా ఉంది. దేవాంగ సంక్షేమ సంఘాలు, హైదరాబాద్, విశాఖపట్నం, రాజమహేంద్రవరం ల వంటి నగరములలో ఉన్నాయి. వీరి కులదైవం చౌడేశ్వరి (చాముండేశ్వరి. శ్రావణ పూర్ణిమ రోజున వీరు జ్వాలా తోరణం పండుగ చేస్తారు. శ్రావణ పూర్ణిమ ను జంద్యాల పౌర్ణమి అంటారు. ఆరోజున, వీరు అందరూ పాత జంధ్యాలు విడిచి, కొత్త జంధ్యాలు వేసుకుంటారు. దేవాంగులు సొమ్ము జంగాలు పాలు అనే నానుడి ఉంది. దేవాంగులు ఎక్కువగా ఉండే గ్రామాలలో వీరభద్ర స్వామి గుడి , చాముండేశ్వరి గుడి తప్పకుండా ఉంటాయి. పెళ్ళికి ముందు వీరు వీరభద్ర పూజ చేస్తారు. ఆ పూజలో కత్తి, చాలా పెద్ద విభూతి పండు (వీరభద్రునికి ప్రతిరూపంగా) ఉంటాయి. కొందరు వీరభద్రుని సంబరం జరుపుతారు. శూలాల వాళ్ళువీరభద్రుని సంబరం లో శూలాలు ధరించి, నోటిలోను, ఒంటిమీద, ధరించి, "అశ్శరభ, శరభ" అంటూ నాట్యం చేస్తారు. కోనసీమ ప్రాంతంలో ప్రభలు తయారుచేసి, ప్రభల తీర్థం కి తీసుకు వెళతారు. ఆ సమయంలో, ఎవరి ప్రభ ఎక్కువ ఎత్తుగా ఉందో నిర్ణయిస్తారు.

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=దేవాంగ&oldid=3979995" నుండి వెలికితీశారు