దేవినేని వెంకట రమణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు

దేవినేని వెంకట రమణ (1960-1999) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీలో మరణించే వరకు ముఖ్య నాయకుడిగా కొనసాగాడు.[1]

శ్రీ.
దేవినేని వెంకట రమణ
గౌరవ మంత్రి
ప్రాథమిక పాఠశాల మంత్రి , ఆంధ్రప్రదేశ్
In office
1996–1999
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
In office
1994–1999
తరువాత వారుదేవినేని ఉమామహేశ్వరావు
నియోజకవర్గంనందిగామ శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1960-09-21) 1960 సెప్టెంబరు 21 (వయసు 63)
కంచికచర్ల, ఆంధ్రప్రదేశ్
మరణం1999
కాజీపేట , వరంగల్ జిల్లా
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామిదేవినేని ప్రణీత
సంతానంప్రజ్ఞ , స్నిగ్ధ

ప్రాథమిక జీవితం

మార్చు

దేవినేని వెంకట రమణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణా జిల్లా కంచికచర్ల గ్రామంలో సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు.

ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కంచికచర్లలో, తెనాలి లోని వి. ఎస్. ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్, విజయవాడ లోని ఎస్. ఆర్. ఆర్ &సి. వి. ఆర్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరంలో ఆపేయడం జరిగింది .

రాజకీయ జీవితం

మార్చు

వెంకట రమణ కుటుంబం తొలి నుంచి రాజకీయ కుటుంబం, తాత (తల్లి గారి తండ్రి ) చుండూరు వెంకన్న గారు కంచికచర్ల సొసైటీ అధ్యక్షుడిగా పనిచేయగా, పెదనాన్న కుమారులైన దేవినేని గాంధీ, దేవినేని నెహ్రూ, దేవినేని మురళిలు విజయవాడ రాజకీయాల్లో క్రియశీలకంగా వ్యవహరించారు .

వెంకట రమణ తొలి నుంచి రాజకీయాల మీద ఆసక్తితో విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించి తన సోదారులైన గాంధీ, నెహ్రూలు స్థాపించిన ఐక్య విద్యార్థి సంఘం (U.S.O) తరుపున మరో సోదరుడు మురళితో కలిసి విజయవాడ విద్యార్థి రాజకీయాల్లో కీలమైన నేతగా ఎదగడం జరిగింది. జనతాపార్టీ నేతగా ఉన్న సోదరుడు దేవినేని గాంధీ హత్యానంతారం నెహ్రూ, మురళీల సలహా మేరకు విజయవాడను వీడి కంచికచర్ల గ్రామంలో రైతుగా స్థిరపడటం జరిగింది.

1982 లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత నెహ్రూ, మురళి లతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరి కృష్ణా జిల్లాలో పార్టీ విస్తరణ బాధ్యతలు చేపట్టిన నెహ్రూకు సహాయకులుగా మురళి, రమణ క్షేత్రస్థాయిలో బాధ్యతలు నిర్వహించి పార్టీలోకి యువతను భారీ యెత్తున ఆకర్షించడం జరిగింది . 1983,1985, లలో అసెంబ్లీ ఎన్నికల్లో కంకిపాడు నుండి పోటీచేసిన నెహ్రూ గెలుపు కోసం మురళితో కలిసి కృషి చేయడం జరిగింది.

సోదరుడు మురళి రాజకీయ ప్రత్యర్థుల చేతిలో మృత్యువాత పడటంతో నెహ్రూకు ముఖ్య అనూచారుడిగా అన్నితానై వ్యవహరిస్తూ 1989 లో కంకిపాడు నుంచి గెలిపించడం జరిగింది. రమణ రాజకీయంగా కూడా ఎదుగుతూ తెలుగు దేశం పార్టీ యువ విభాగం తెలుగు యువతలో జిల్లా, రాష్ట్ర స్థాయిలలో కీలకమైన నాయకుడిగా వ్యవహరించడం జరిగింది.

1990 ల నుంచి రాజకీయంగా ఎడగడంలో భాగంగా నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్న తన సొంత నియోజకవర్గం నందిగామ మీద దృష్టి సారించి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేయడమే కాకుండా తనకంటూ నమ్మకమైన అనునయులను తయారు చేసుకొని నందిగామ నియోజకవర్గం మీద పట్టుసాధించడం జరిగింది . 1994 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ ఆశీస్సులతో నందిగామ టిక్కెట్ సాధించి తొలి ప్రయత్నం లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికవ్వడం జరిగింది.[2] 1995 లో జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా చంద్రబాబు పక్షాన నిలిచి 1996 లో చంద్రబాబు మంత్రి వర్గంలో ప్రాథమిక విద్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి[1] శాఖ పరంగా పలు సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది.

మంత్రిగా నందిగామ నియోజకవర్గాన్ని చాలా బాగా అభివృద్ధి చేయడం జరిగింది. కృష్ణా నది మీద వేదాద్రి వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి నియోజకవర్గ ప్రజానీకం దాహార్తిని తీర్చడమె కాకుండా ఆయకట్టు చివరి గ్రామాల్లో ఉన్న పొలాలకు కూడా సాగు నీరు ఇచ్చే ఏర్పాటు చేయడం ద్వారా నియోజకవర్గ రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయాడు . నందిగామ, చందర్లపాడు, కంచికచర్ల, వీరులపాడు మండలాల్లోని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అమర్చి ప్రజల్లో మంచి పేరు సాధించడమే కాకుండా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాగా తయారు చేయడం జరిగింది .ఈరోజుకి రమణ చేసిన నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రజలకు మాట్లాడుకుంటారు.

వ్యక్తిత్వం

మార్చు

రమణ బ్రతికున్నత కాలం రాజకీయాల్లో తాను ఎదగడమే కాకుండా ఏంతో మందిని పైకి తీసుకురావడం జరిగింది వారిలో నందిగామ మాజీ శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకర్ రావు ఒకరు, స్నేహశీలిగా చిన్న, పెద్ద తేడాలేకుండా అందరినీ ఒకేలా గౌరవిస్తూ ఉండేవారు . ఆయన తయారు చేసిన నందిగామ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇప్పటికీ పార్టీని విడకుండా బలంగా ఉంది . ఆరోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీకి చెందిన యువతలో మంచి ఆదరణ ఉండేది. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలుగా ఉన్న ధూళిపాళ్ళ నరేంద్ర, పయ్యావుల కేశవ్ లు అత్యంత ఆత్మీయులు.

వ్యక్తిగత జీవితం

మార్చు

విశాఖపట్నానికి చెందిన వ్యాపారవేత్త నార్ల మణి ప్రసాద్ కుమార్తె ప్రణీతను 1993 లో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది . వీరికి ప్రజ్ఞ, స్నిగ్ధ ఇద్దరూ కుమార్తెలు (కవలలు) . రమణ సోదరుడు దేవినేని ఉమామహేశ్వరావు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీలో కీలకమైన నేతగా ఉన్నారు.[3]

హైదరాబాద్ కాబినెట్ మీటింగ్ నుంచి గోదావరి రైలులో విజయవాడకు వస్తున్న సమయంలో వరంగల్ జిల్లా కాజీపేట దగ్గర జరిగిన రైలు ప్రమాదంలో మరణించడం జరిగింది.[4] భర్త మృతిని తట్టుకోలేని భార్య ప్రణీత సైతం గుండెపోటుతో మృతి చెందడం జరిగింది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Reddy, Ravi (2014-04-25). "Yet another chapter in tragic deaths". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-10-07.
  2. "Andhra Pradesh Assembly Election Results in 1994". Elections in India. Archived from the original on 2021-11-07. Retrieved 2021-10-07.
  3. Srinivas, Rajulapudi (2021-07-28). "Former A.P. minister Devineni Uma, TDP leaders booked for rioting". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-10-07.
  4. "ANDHRA PRADESH MINISTER DIES IN ACCIDENT". www.telegraphindia.com. Retrieved 2021-10-07.