దేవేందర్ సింగ్ బబ్లీ
దేవేందర్ సింగ్ బబ్లీ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో తోహనా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2021 డిసెంబర్ 21న మనోహర్ లాల్ ఖట్టర్ మంత్రివర్గంలో డెవలప్‌మెంట్ & పంచాయితీల శాఖ, ఆర్కియాలజీ & మ్యూజియంల శాఖ రాష్ట్ర మంత్రిగా (స్వతంత్ర బాధ్యత) పని చేశాడు.
జై ప్రకాష్ దలాల్ | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2021 డిసెంబర్ 21 - 2024 మార్చి 12 | |||
పదవీ కాలం 2019 – 2024 | |||
ముందు | సుభాష్ బరాలా | ||
---|---|---|---|
తరువాత | పరమ్‌బీర్ సింగ్ | ||
నియోజకవర్గం | తోహనా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | జననాయక్ జనతా పార్టీ, కాంగ్రెస్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుదేవేందర్ సింగ్ బబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి ద్వారా 2014 శాసనసభ ఎన్నికలలో తోహనా నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు. ఆయన ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరి 2019 ఎన్నికలలో కాంగ్రెస్ టిక్కెట్టు దక్కకపోవడంతో జననాయక్ జనతా పార్టీలో చేరి 2019 శాసనసభ ఎన్నికలలో నుండి జేజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సుభాష్ బరాలాపై 17,677 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికై,[1] బీజేపీ - జేజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 2021 డిసెంబర్ 21న మనోహర్ లాల్ ఖట్టర్ మంత్రివర్గంలో డెవలప్‌మెంట్ & పంచాయితీల శాఖ, ఆర్కియాలజీ & మ్యూజియంల శాఖ రాష్ట్ర మంత్రిగా (స్వతంత్ర బాధ్యత) పని చేశాడు.[2][3]
దేవేందర్ సింగ్ బబ్లీ 2024 శాసనసభ ఎన్నికలకు ముందు ఆగష్టు 17న జననాయక్ జనతా పార్టీని వీడి,[4] సెప్టెంబర్ 2న భారతీయ జనతా పార్టీలో చేరాడు.[5][6] ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పరమ్‌బీర్ సింగ్ చేతిలో 10,836 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మూలాలు
మార్చు- ↑ CNBCTV18 (24 October 2019). "Haryana Assembly election results 2019: Here are the winners with highest and lowest vote margins" (in ఇంగ్లీష్). Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Economic Times (28 December 2021). "BJP's Kamal Gupta, JJP's Devender Singh Babli sworn in as ministers in Haryana". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
- ↑ TV9 Bharatvarsh (2024). "Devender Singh Babli BJP Candidate Election Result 2024 LIVE: Haryana टोहाना सीट विधानसभा चुनाव 2024 परिणाम". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Tribune (17 August 2024). "JJP in fix as 4 MLAs quit in 2 days" (in ఇంగ్లీష్). Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
- ↑ The Hindu (2 September 2024). "Fourth JJP leader joins BJP in two days ahead of Haryana assembly poll" (in Indian English). Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
- ↑ The Economic Times (2 September 2024). "Haryana MLA Devender Singh Babli joins BJP". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.