దేవేంద్రనాథ్ ఠాగూర్

దేవేంద్రనాధ్ టాగోర్ (Bengali: দেবেন্দ্রনাথ ঠাকুর) ( మే 15 1817జనవరి 19 1905) హిందూ తత్వవేత్త, బ్రహ్మ సమాజంలో మత సంస్కర్త. ఈయన హిందూ మతంలో సంస్కరణలు తేవడానికి ప్రయత్నించాడు. ఈయన 1848 లో బ్రహ్మో మతం స్థాపించాడు.

దేవేంద్రనాధ్ టాగోర్
দেবেন্দ্রনাথ ঠাকুর
దేవేంద్రనాథ్ టాగూర్ చిత్రపటం
జననం(1817-05-15)1817 మే 15
కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా[1]
మరణం1905 జనవరి 19(1905-01-19) (వయసు 87)
కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
జాతీయతIndian
వృత్తిమత సంస్కర్త
ఉద్యమంబెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం
జీవిత భాగస్వామిసరళా దేవి
పిల్లలుద్విజేంద్రనాథ్ టాగూర్, సత్యేంద్రనాథ్ టాగూర్, హేమేంద్రనాథ్ టాగూర్, జ్యోతిరీంద్రనాథ్ టాగూర్, రవీంద్రనాథ్ టాగూర్, వీరేంద్రనాథ్ టాగూర్, సోమేంద్రనాథ్ టాగూర్, సౌదామిని టాగూర్, సుకుమారి టాగూర్, శరత్ కుమారి టాగూర్, స్వర్ణకుమారి టాగూర్, వర్ణకుమారి టాగూర్.

కుటుంబ స్థితిగతులు మార్చు

దేవేంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ లో జొరా సంకోలో జన్మించారు. ఆయన తండ్రి ద్వారకానాథ్ టాగూర్. దేవేంద్రనాథ్ వంశస్థులు తరతరాలుగా స్థితిమంతులే కాక ఉన్నత విద్యావంతులు, వారి రంగాల్లో నిపుణులూ కూడా అయి ఉన్నారు. ఆ క్రమంలోనే దేవేంద్రనాథ్ ఠాగూర్ తండ్రి ద్వారకానాథ్ ఠాగూర్‌ను ప్రిన్స్‌ బిరుదుతో వ్యవహరించేవారు. ద్వారకానాథ్ ఠాగూర్ ఆనాటి వంగదేశంలో సంస్కర్తగా, మతకర్తగా ప్రఖ్యాతుడైన రాజా రామమోహనరాయ్ సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన సంస్కరణాభిలాషను, హిందూమత ఔన్నత్య చింతననూ ద్వారకానాథ్ అభినందించేవారు. రామమోహనరాయ్ ప్రారంభించిన బ్రహ్మ సమాజంపై సమాజంలోని నలువైపులా ఆరోపణలు, వ్యతిరేకత ప్రారంభమైన రోజుల్లో ద్వారకానాథ్ బ్రహ్మసమాజానికి, రామ్మోహనరాయ్‌కీ ప్రధాన సహాయకునిగా ఉండేవారు. ఠాగూరు కుటుంబపు జాగీరైన జాకో సంకోలోని ఒక భవనంలో బ్రహ్మసమాజపు మొదటి ప్రార్థనాలయాన్ని నిర్మించారు. దానికి ఆది బ్రహ్మసమాజం అని పేరుపెట్టారు రామ్మోహనరాయ్. ఆపైన జొరా సంకోలో ఠాగూరు వంశస్థులందరూ బ్రహ్మసమాజీకులుగా మారారు. రామ్మోహనరాయ్ క్రైస్తవ మతప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మిషనరీ పాఠశాలలకు ప్రతిగా ప్రారంభించిన విద్యాలయాల్లో కూడా ఠాగూర్ వంశస్థులే తొలి విద్యార్థులుగా చేరారు.[2]

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. Chaudhuri, Narayan (2010). Maharshi Debendranath Tagore. Makers of Indian Literature (2nd ed.). New Delhi: Sahitya Akademi. p. 11. ISBN 978-81-260-3010-1.
  2. దేవేంద్రనాథ్ ఠాకూరు చరిత్రము:మూ.దేవేంద్రనాథ్ భట్టాచార్య, ఆ.ఆకురాతి చలమయ్య:శాంతికుటీరం ప్రచురణ:1937