ద్వారకానాథ్ టాగూర్
ద్వారకానాథ్ టాగూర్ (1794–1846) మొదటి భారతీయ పారిశ్రామికవేత్తలలో ఒకడు [1] టాగూర్ కుటుంబానికి చెందిన జోరాసంకో శాఖకు అతడు వ్యవస్థాపకుడు.
ద్వారకానాథ్ టాగూర్ | |
---|---|
జననం | 1794 కలకత్తా |
మరణం | 1 ఆగస్టు 1846 లండన్ |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | పారిశ్రామికవేత్త |
పిల్లలు | దేబేంద్రనాథ్ టాగూర్ |
వంశ చరిత్ర
మార్చుటాగూర్ల అసలు ఇంటిపేరు కుషారి. వారు రార్హి బ్రాహ్మణులు. మొదట పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్‌వాన్ జిల్లాలోని కుష్ అనే గ్రామానికి చెందినవారు. రవీంద్ర-జీవిత చరిత్ర రచయిత ప్రభాత్ కుమార్ ముఖర్జీ తన పుస్తకం యొక్క మొదటి సంపుటి 2 వ పేజీలో "కుషారీలు భట్ట నారాయణ కుమారుడైన దీన్ కుషారి వారసులు; మహారాజా క్షితీశుర, కుష్ (బుర్ద్‌వాన్ జిల్లాలో) అనే గ్రామాన్ని దీన్‌కు బహూకరించాడు. దాని అధిపతిగా అతడికి కుషారి అనే పేరొచ్చింది " [2]
ద్వారకానాథ్ టాగూర్ కుషారీ (శాండిల్య గోత్ర) విభాగానికి చెందిన రార్హియా బ్రాహ్మణుల వారసుడు. ఇస్లాం మతంలోకి మారిన బ్రాహ్మణ కుటుంబంతో సంబంధా లున్నందున వారి పూర్వీకులను పిరాలి బ్రాహ్మణులు అని పిలుస్తారు. [3] [4]
బాల్యం
మార్చుద్వారకానాథ్ కలకత్తా పోలీసు శాఖలో పని చేసే రమ్మొనీ ఠాకూర్, మేనక దంపతులకు రెండో కొడుకుగా జన్మించాడు. రమ్మొనీ ఠాకూర్ అన్న రామ్ లోచన్ మేనక సోదరియైన అలకసుందరిని ఇదివరకే వివాహమాడి ఉన్నాడు. అయితే వారికి సంతానం కలుగలేదు. కాబట్టి 1794 లో ద్వారకానాథ్ జన్మిస్తూనే రామ్ లోచన్ ఆయన్ను అనధికారికంగా దత్తత తీసుకున్నాడు. 1799 లో అధికారికంగా దత్తత స్వీకరించాడు.
1807 డిసెంబరు 12 న, రామ్‌లోచన్ తన ఆస్తి మొత్తాన్ని తన దత్తపుత్రుడు, అప్పటికి ఇంకా మైనరయిన ద్వారకానాథ్‌కు వదలిపెట్టాడు.. 1792 లో లార్డ్ కార్న్‌వాలిస్ ప్రవేశపెట్టిన శాశ్వత పరిష్కారం యొక్క నిబంధనల కిందికి వచ్చే జమీందారీ ఎస్టేట్‌లు ఆ ఆస్తిలో ఉన్నాయి. జమీందార్లకు పన్ను వసూలు చేసే అధికారం, బ్రిటిష్ తరపున తమ జమీందారీల భూభాగాన్ని పరిపాలించే అధికారం ఉంది. అందువలన, తన దత్తత తండ్రి రాం లోచన్ ఠాకూర్ విడిచిపెట్టిన జమిందారీకి కాబోయే జమీందారుగా ద్వారకానాథ్, 16 సంవత్సరాల వయస్సులో 1810 లో పాఠశాలను విడిచిపెట్టాడు. కలకత్తా వద్ద ఒక ప్రఖ్యాత న్యాయవాది రాబర్ట్ కట్లర్ ఫెర్గుస్సన్ వద్ద శిష్యరికం చేసాడు. కలకత్తాకూ, బెర్హంపూర్, కటక్ ల లోని తన జమీందారీకీ మధ్య తిరుగుతూండేవాడు [5]
వ్యాపార జీవితం
మార్చుటాగూర్ ఒక పాశ్చాత్య విద్యావంతుడైన బెంగాలీ బ్రాహ్మణుడు. కోల్‌కతాకు చెందిన పౌర నాయకుడు, బ్రిటిషు వ్యాపారుల భాగస్వామ్యంతో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, షిప్పింగ్ వాణిజ్య సంస్థలను స్థాపించడంలో పాత్ర పోషించాడు. 1828 లో, అతను మొదటి భారతీయ బ్యాంక్ డైరెక్టర్ అయ్యాడు. 1829 లో కలకత్తాలో యూనియన్ బ్యాంక్ స్థాపించారు. అతను మొదటి [6] ఆంగ్లో-ఇండియన్ మేనేజింగ్ ఏజెన్సీ (జనపనార మిల్లులు, బొగ్గు గనులు, తేయాకు తోటలు మొదలైనవి నడిపే పారిశ్రామిక సంస్థలు, [7] ) కార్, టాగూర్ అండ్ కంపెనీని స్థాపించాడు. అంతకుముందు, కలకత్తాలోని పార్సీ అయిన రుస్తోంజీ కోవాస్జీ ఒక జాత్యంతర సంస్థను స్థాపించాడు. కాని 19 వ శతాబ్దం ప్రారంభంలో, పార్సీలను దక్షిణాసియా సమాజంగా కాక, సమీప ప్రాచ్య సమాజంగా వర్గీకరించారు. టాగూర్ సంస్థ భారతదేశంలోని నేటి పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలలో, బంగ్లాదేశ్‌లో విస్తరించి ఉన్న భారీ జమీందారీ ఎస్టేట్‌లను నిర్వహించింది. బెంగాల్ లోని గొప్ప బొగ్గు గనులో వాటాలను, కలకత్తా, హుగ్లీ నది ముఖద్వారాల మధ్య టగ్ సేవలను నడుపడం, చైనీస్ టీ పంటను ఎగువ అస్సాం మైదానాల్లో నాటడం మొదలైన వ్యాపారాలు చేసేది. చైనాతో నల్లమందు వ్యాపారంలో నిమగ్నమైన భారతీయ ప్రైవేట్ సంస్థలలో కార్, టాగూర్ అండ్ కంపెనీ ఒకటి. నల్లమందు ఉత్పత్తి భారతదేశంలో జరిగేది, అమ్మకాలు చైనాలో జరిగేవి. చైనీయులు నిరసన వ్యక్తం చేసినప్పుడు, ఈస్ట్ ఇండియా కంపెనీ నల్లమందు వాణిజ్యాన్ని కొన్ని ఎంచుకున్న భారతీయ కంపెనీలకు బదిలీ చేసింది. వాటిలో ఇది ఒకటి. 1832 లో టాగూర్ రాణిగంజ్‌లో మొదటి భారతీయ బొగ్గు గనిని కొనుగోలు చేశాడు, [6] ఇది చివరికి బెంగాల్ బొగ్గు కంపెనీగా మారింది. చాలా పెద్ద తెరచాప ఓడలు సరుకు రవాణాలో నిమగ్నమై ఉండేవి. దీంతో ద్వారకానాథ్ చాలా ధనవంతుడయ్యాడు. అతని సంపద గురించి కథలుగా చెప్పుకునేవారు. " ఒక జమీందారుగా ద్వారకానాథ్ కర్కశమైన సమర్థుడు, వ్యాపారాత్మకంగా ఉండేవాడు. కానీ ఔదార్యం లేదు" . [8]
మరణం
మార్చుద్వారకానాథ్ టాగూర్ "ఉచ్ఛస్థాయిలో ఉండగా" మరణించాడు [9]. లండన్లోని సెయింట్ జార్జ్ హోటల్ వద్ద 1846 ఆగస్టు 1 సాయంత్రం ఉరుములు మెరుపుల హోరువానలో వాల్నట్ పరిమాణంలో ఉన్న వడగళ్ళు పడి అతడు మరణించాడు
మూలాలు
మార్చు- ↑ Wolpert, Stanley (2009). A New History of India (8th ed.). New York, NY: Oxford UP. p. 221. ISBN 978-0-19-533756-3.
- ↑ "https://ia801600.us.archive.org/BookReader/BookReaderImages.php?zip=/5/items/in.ernet.dli.2015.339410/2015.339410.Rabindrajibani-O_jp2.zip&file=2015.339410.Rabindrajibani-O_jp2/2015.339410.Rabindrajibani-O_0041.jp2&scale=13.50599520383693&rotate=0"
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Thompson_1926_12
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Dutta, K.; Robinson, A. (1995). Rabindranath Tagore: The Myriad-Minded Man. Saint Martin's Press. pp. 17–18. ISBN 978-0-312-14030-4.
- ↑ "History of the Adi Brahmo Samaj (1906)"
- ↑ 6.0 6.1 Wolpert, Stanley (2009). A New History of India (8th ed.). New York, NY: Oxford UP. p. 221. ISBN 978-0-19-533756-3.
- ↑ Kulke, Hermann; Rothermund, Dietmar (2004). A History of India (4th ed.). New York, NY: Routledge. p. 265. ISBN 0-415-32920-5. Retrieved 18 September 2011.
- ↑ Kling, Blair B., Partner in Empire: Dwarkanath Tagore and the Age of Enterprise in Eastern India, p. 32. University of California Press, 1976; Calcutta, 1981. ISBN 0-520-02927-5
- ↑ Wolpert, Stanley (2009). A New History of India (8th ed.). New York, NY: Oxford UP. p. 221. ISBN 978-0-19-533756-3.