దేవ్ పటేల్ (జననం 1990 ఏప్రిల్ 23) ఒక బ్రిటిష్ నటుడు, చిత్రనిర్మాత.[1] ఆయన ఈ4 టీన్ డ్రామా స్కిన్స్ (2007)లో అన్వర్ ఖర్రాల్ పాత్రతో తన కెరీర్ ప్రారంభించాడు. డానీ బాయిల్ రూపొందించిన స్లమ్‌డాగ్ మిలియనీర్ (2008)లో యుక్తవయస్కుడైన జమాల్ మాలిక్ పాత్రతో ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు.[2] దీని కోసం ఆయన ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడిగా బిఎఎఫ్టీఎ అవార్డుకు సైతం ఎంపికయ్యాడు.[3]

దేవ్ పటేల్
2024లో దేవ్ పటేల్
జననం (1990-04-23) 1990 ఏప్రిల్ 23 (వయసు 34)
వృత్తి
  • నటుడు
  • చిత్రనిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం
భాగస్వామిటిల్డా కోభమ్-హెర్వే (m.2017)

ది బెస్ట్ ఎక్సోటిక్ మ్యారిగోల్డ్ హోటల్ (2011), ది సెకండ్ బెస్ట్ ఎక్సోటిక్ మ్యారిగోల్డ్ హోటల్ (2015), సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చాప్పీ (2015), హెచ్బివొ సిరీస్ ది న్యూస్‌రూమ్‌లో సహాయక పాత్రతో ఆయన కెరీర్ మలుపు తిరిగింది. ది లయన్ (2016)లో సరూ బ్రియర్లీగా అతని నటనకు, ఉత్తమ సహాయ నటుడిగా బిఎఎఫ్టీఎ అవార్డును గెలుచుకున్నాడు. ఉత్తమ సహాయ నటుడిగా అకాడమీ అవార్డుకు కూడా నామినేట్ అయ్యాడు. ఆ తరువాత, ఆయన హోటల్ ముంబై (2018), ది పర్సనల్ హిస్టరీ ఆఫ్ డేవిడ్ కాపర్‌ఫీల్డ్ (2019), ది గ్రీన్ నైట్ (2021)లలో నటించాడు. ఆయన యాక్షన్ చిత్రం మంకీ మ్యాన్ (2024)తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

దేవ్ పటేల్ 1990 ఏప్రిల్ 23న హారోలో కేర్ వర్కర్ అనిత, ఐటీ కన్సల్టెంట్ రాజు దంపతులకు జన్మించాడు.[4][5][6][7] ఆయన తల్లిదండ్రులు భారతీయ గుజరాతీ హిందువులు, అయితే వారిద్దరూ కెన్యాలోని నైరోబీలో జన్మించారు.[8] వారి పూర్వీకులు గుజరాత్‌లోని జామ్‌నగర్, ఉంఝాలకు చెందిన వారు.[9] ఆయన హారోలోని రేనర్స్ లేన్ జిల్లాలో పెరిగాడు.[10][11] లాంగ్‌ఫీల్డ్ ప్రైమరీ స్కూల్, విట్‌మోర్ హై స్కూల్‌లలో చదివాడు. సర్ ఆండ్రూ అగ్యుచీక్‌గా పాఠశాలలో చదువుకునే రోజుల్లో ఆయన ట్వెల్ఫ్త్ నైట్‌లో మొదటిసారి నటించాడు.[12]

ఆయన 2000లో టైక్వాండో రేనర్స్ లేన్ అకాడమీలో శిక్షణను ప్రారంభించాడు.[13] ఆయన డబ్లిన్‌లో జరిగిన 2004 ఎఐఎమ్ఎఎ (యాక్షన్ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లతో సహా జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో అనేకసార్లు పాల్గొన్నాడు.[14][15] ఆయన మార్చి 2006లో, 1వ డాన్ బ్లాక్ బెల్ట్‌ని సంపాదించాడు.[16]

వ్యక్తిగత జీవితం

మార్చు

దేవ్ పటేల్ స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలో నటించిన సహనటి ఫ్రీదా పింటోతో 2009లో డేటింగ్ ప్రారంభించాడు. దాదాపు ఆరు సంవత్సరాల డేటింగ్ తర్వాత తాము విడిపోయామని 2014 డిసెంబరు 10న ఈ జంట ప్రకటించింది.[17][18]

మార్చి 2017లో, ఆస్ట్రేలియన్ నటి టిల్డా కోభమ్-హెర్వేతో ఆయన సంబంధం బహిరంగమైంది.[19][20][21] 2024 ఏప్రిల్ 2న దర్శకుడిగా ఆయన తొలి ఫీచర్ అయిన మంకీ మ్యాన్ లాస్ ఏంజెల్స్ ప్రీమియర్‌లో రెడ్ కార్పెట్‌పై ఈ జంట మొదటిసారి ఫోటోగ్రాఫ్‌లకు పోజులిచ్చింది.[22]

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర నోట్స్
2008 స్లమ్‌డాగ్ మిలియనీర్ జమాల్ మాలిక్
2010 ది లాస్ట్ ఎయిర్‌బెండర్ ప్రిన్స్ జుకో
2011 ది బెస్ట్ ఎక్సోటిక్ మేరిగోల్డ్ హోటల్ సోనీ కపూర్
2012 అబౌట్ చెర్రీ ఆండ్రూ
2014 ది రోడ్ విత్ఇన్ అలెక్స్
2015 ది సెకండ్ బెస్ట్ ఎక్సోటిక్ మేరిగోల్డ్ హోటల్ సోనీ కపూర్
చప్పి డియోన్ విల్సన్
2016 ది మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ శ్రీనివాస రామానుజన్
ఓన్లీ ఎస్టర్డే తోషియో (వాయిస్) ఇంగ్లీష్ డబ్
లయన్ సరూ బ్రియర్లీ
2018 హోటల్ ముంబై అర్జున్
ది వెడ్డింగ్ గెస్ట్ జై
2019 ది పస్సనల్ హిస్టరీ ఆఫ్ డేవిడ్ కాపర్‌ఫీల్డ్ డేవిడ్ కాపర్ఫీల్డ్
ఐ లాస్ట్ మై బాడీ నవోఫెల్ (వాయిస్) ఇంగ్లీష్ డబ్
2020 రోబోరోవ్స్కీ షార్ట్ ఫిల్మ్; టిల్డా కోభమ్-హెర్వేతో సహ-రచయిత, సహ-దర్శకత్వం వహించాడు[23]
2021 ది గ్రీన్ నైట్ గవైన్
2023 ది వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ డా. ఛటర్జీ / జాన్ విన్స్టన్ షార్ట్ ఫిల్మ్[24]
పాయిజన్ వుడ్స్ షార్ట్ ఫిల్మ్[25]
2024 మంకీ మ్యాన్ కిడ్ రచయిత, నిర్మాత మరియు దర్శకుడు కూడా[26]
2025 రాబిట్ ట్రాప్ TBA పోస్ట్ ప్రొడక్షన్

మూలాలు

మార్చు
  1. "Shortlister: Dev Patel - Introduction". Tribeca Shortlist. 4 January 2017. Archived from the original on 29 October 2021. Retrieved 7 February 2020.
  2. "Dev Patel on the Struggle of Finding Roles After 'Slumdog Millionaire'". ABC News (in ఇంగ్లీష్). Retrieved 20 May 2020.
  3. Moore, Matthew (15 January 2009). "Baftas 2009: Slumdog Millionaire nominated for 11 awards as Oscars momentum builds". The Daily Telegraph (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0307-1235. Archived from the original on 11 January 2022. Retrieved 20 May 2020.
  4. "Dev Patel". indobase.com. 23 April 1990. Retrieved 8 January 2024.
  5. "Dev Patel Biography". Tribute. Retrieved 15 May 2014.
  6. Burrows, Tim (1 December 2008). "Slumdog Millionaire: Dev Patel hits the jackpot". The Daily Telegraph. Archived from the original on 11 January 2022. Retrieved 26 March 2009.
  7. Tilley, David (20 January 2009). "Slumdog Millionaire starring Dev Patel scoops nine Oscar nominations". Harrow Observer. Archived from the original on 14 February 2009. Retrieved 26 March 2009.
  8. Iqbal, Nosheen (21 February 2015). "Dev Patel: 'I didn't know what I was getting myself into'". The Guardian. Retrieved 6 February 2020.
  9. Jain, Ankur (28 January 2009). "Young 'Slumdog' hails from Kutch". The Times of India. Ahmedabad.
  10. "Dev Patel proud of quirks". NZ City. 10 August 2010. Retrieved 7 October 2010.
  11. Jain, Atisha (3 May 2016). "My self-esteem is way too low to call myself a star yet: Dev Patel". Hindustan Times.
  12. Burrows, Tim (1 December 2008). "Slumdog Millionaire: Dev Patel hits the jackpot". The Daily Telegraph. Archived from the original on 11 January 2022. Retrieved 26 March 2009.
  13. Brady, Tara; Okyere, Elaine (15 January 2009). "Dev Patel praised by teachers". Harrow Observer. Archived from the original on 25 January 2009. Retrieved 24 January 2009.
  14. "Rayners Lane Taekwon-do Academy". www.raynerslanetkd.com. Retrieved 21 May 2020.
  15. "AIMAA World Championships". Rayners Lane Taekwon-do Academy. 24 October 2004. Retrieved 18 February 2009.
  16. "Dan Grades achieved at Rayner Lane Taekwon-do Academy Black Belt Gradings". Rayners Lane Taekwon-do Academy. 2006. Retrieved 6 January 2009.
  17. Susan Wloszczyna (29 March 2011). "Freida Pinto, Dev Patel: Like something out of a movie". USA Today. Retrieved 26 February 2012.
  18. Marquina, Sierra (10 December 2014). "Freida Pinto, Dev Patel Split After Almost Six Years Together -- Get All the Details". Us Magazine. Retrieved 13 December 2014.
  19. Penny Debelle (1 March 2017). "Lion star Dev Patel and Tilda Cobham-Hervey now Hollywood's hottest couple". The Advertiser. Retrieved 14 October 2017.
  20. Gilchrist, Ava (3 August 2022). "Dev Patel And Actress Tilda Cobham-Hervey Have A Fairytale Relationship, Here's How It Started". Elle Australia. Retrieved 8 July 2023.
  21. "Dev Patel: Actor breaks up knife fight in Australia". BBC. 3 August 2022. Retrieved 17 February 2024.
  22. Mazzeo, Esme (4 April 2024). "Dev Patel and Tilda Cobham-Hervey make their red carpet debut as a couple at Monkey Man premiere". Peoplemag. Retrieved 5 April 2024.
  23. Slatter, Sean (1 February 2021). "'The Flame', 'Roborovski' recognised at Flickerfest awards". IF Magazine. Retrieved 2 March 2024.
  24. "You're Invited to a Week of New Wes Anderson Shorts This September". Netflix Tudum (in ఇంగ్లీష్). 15 September 2023. Retrieved 28 September 2023.
  25. Peralta, Diego (11 March 2024). "Wes Anderson's Netflix Short Films Will Be Combined Into a Single Anthology". Collider. Retrieved 14 March 2024.
  26. D'Alessandro, Anthony (26 January 2024). "Dev Patel's 'Monkey Man' Springs From Netflix To Monkeypaw & Universal, Sets April Theatrical Release, Trailer Drops". Deadline Hollywood. Archived from the original on 26 January 2024. Retrieved 26 January 2024.