దైతరీ నాయక్

సామాజిక కార్యకర్త

దైతరీ నాయక్ ఒడిషా, కియోంజర్ జిల్లాలోని బైతరణి గ్రామానికి చెందిన సమాజ సేవకుడు. బీడు బారుతున్న పొలాలకు నీళ్లివ్వడానికి ప్రభుత్వాలు ముందుకు రాని సమయంలో తనే పలుగు, పారా పట్టి కొండను తవ్వి కాలువ నిర్మించాడు. అతని కృషి ఫలితంగా ఆ గ్రామంలో సుమారు వంద ఎకరాలు సస్యశ్యామలం అయ్యాయి.[1][2]

జీవిత విశేషాలుసవరించు

ఒడిశాలోని తాళవైతరణి గ్రామానికి చెందిన దైతరీ నాయక్ తన గ్రామంలో సరైన నీటి వసతిలేక తరుచూ పంటలు ఎండిపోతుండటంతో తీవ్ర నిరాశకు గురయ్యేవాడు. ఆ  గ్రామంలో సాగునీటికి, తాగునీటికి తీవ్ర కొరత ఉంది. పంటలు పండవు, దాహం తీరదు. అతని గ్రామానికి నీళ్లు రావాలంటే కొండకు అవతలి పక్కన ఉన్న ప్రవాహం నుంచి నీళ్లు రావలసి ఉంది. కానీ ఆ దారి నిండా రాళ్ళూ రప్పలూ, ముళ్ళ పొదలూ వున్నాయి. వాటిని తొలగించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీనికోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో దైతరీ రంగంలోకి దిగాడు. దైతరీ నాయక్ తన 75 యేళ్ళ వయస్సులో ఓ పలుగు, పారా పట్టి తవ్వడం ప్రారంభించాడు. గ్రామస్థులు అతని ప్రయత్నాన్ని ఎగతాళి చేశారు. నాయక్ తో పాటు అతని అన్నదమ్ములు చేతులు కలిపారు. అలా తవ్వుకుంటూ 3 కి.మీ.ల మేర కాలువ నిర్మించారు. చివర్లో గ్రామస్థులు కూడా తలో చెయ్యి వెయ్యడంతో 2010లో ప్రారంభమైన కాలువ తవ్వకం.. 2013లో పూర్తయింది.[3] ఎక్కువగా కొండలు, అటవీ ప్రాంతంతో కూడిన బన్స్ పాల్, హరించందన్ పూర్, తెల్కాయ్ తాలూకాల్లో చాలా గ్రామాలకు తీవ్ర నీటి సమస్య ఉంది. తాగునీటికే నానా కష్టాలు పడే చోట పంటలు పండించేందుకు దైతరణి నాయక్ ఒక మార్గం చూపించి, గ్రామ ప్రజల్లో వెలుగులు నింపాడు.[4][5]  

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "దైతరీ నాయక్.. ఒంటిచేత్తో వంద ఎకరాలకు నీళ్లిచ్చాడు".
  2. "Odisha's canal man carves 8 km long road through mountains". https://www.deccanchronicle.com/. 2018-06-21. Retrieved 2018-06-28. External link in |work= (help)
  3. "కొండలు పగలేసి 3 కి.మీ. కాలువ తవ్వాడు."
  4. "గ్రామానికి నీటి కోసం కిలోమీటరు మేర కొండను తొలిచిన అపర భగీరథుడు".
  5. "Odisha tribal does a Manjhi, digs 3-km water channel through mountain". https://www.hindustantimes.com/. 2018-06-22. Retrieved 2018-06-28. External link in |work= (help)

బయటి లంకెలుసవరించు