దైద అమరలింగేశ్వర స్వామి

అమరలింగేశ్వరుడు ఉత్తరవాహినిగా ప్రవహించే కృష్ణానది ఒడ్డున ప్రకృతి సిద్దమైన బిలం (గుహ)లో కొలువై ఉన్నాడు. ఈ కొండ గుహలోగల ఆలయంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం శివుడు స్వయంభువుగా శివలింగం రూపంలో వెలసి భక్తుల నీరాజనాలను అందుకుంటున్నాడు.[1] కార్తీకమాసం, ప్రతి సోమవారం భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. కృష్ణానదిలో స్నానాలు ఆచరించి తడిబట్టలతో బిలంలో 900 మీటర్లు నడచి ఈ పుణ్యస్థలంలో భక్తులు అమరలింగేశ్వరుని దర్శించుకుంటారు.

అమరలింగేశ్వరస్వామి దేవాలయం.దైద
AMARALINGESWARASWAMY.DAIDA
దైద అమరలింగేశ్వరస్వామి దేవాలయం
దైద అమరలింగేశ్వరస్వామి దేవాలయం
అమరలింగేశ్వరస్వామి దేవాలయం.దైద AMARALINGESWARASWAMY.DAIDA is located in Andhra Pradesh
అమరలింగేశ్వరస్వామి దేవాలయం.దైద AMARALINGESWARASWAMY.DAIDA
అమరలింగేశ్వరస్వామి దేవాలయం.దైద
AMARALINGESWARASWAMY.DAIDA
ఆంధ్రప్రదేశ్ లో స్థానం
భౌగోళికాంశాలు :16°38′02″N 79°36′04″E / 16.633956°N 79.6010708°E / 16.633956; 79.6010708Coordinates: 16°38′02″N 79°36′04″E / 16.633956°N 79.6010708°E / 16.633956; 79.6010708
పేరు
ప్రధాన పేరు :దైద అమరలింగేశ్వరస్వామి దేవాలయం
ప్రదేశము
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:గుంటూరు జిల్లా
ప్రదేశం:దైదా
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:అమరలింగేశ్వరస్వామి (శివుడు )
అమరలింగేశ్వరస్వామి దేవాలయ చిత్రాలు
అమరలింగేశ్వరస్వామి
అమరలింగేశ్వరస్వామికి పూజలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరలింగేశ్వరస్వామి
దేవాలయం పక్కన కృష్ణానది

చరిత్రసవరించు

గుంటూరు జిల్లా, గురజాల నుంచి 12 కిలో మీటర్లు, పులిపాడు, దైద మార్గం నుంచి 5 కి.మీలో ఈ శైవ క్షేత్రం ఉంది. వాడపల్లిలో అగస్త్య మహర్షి అగస్త్యేశ్వరస్వామిని ప్రతిష్ఠించారు. ఆ క్షేత్రం సమీపంలోని ఈ బిలాన్ని అగస్త్య మహర్షి తపస్సు కోసం ఉపయోగించారని ఇక్కడి వారు చెపుతారు. ఆ తరువాత 2019 నాటికి 120 సంవత్సరాల క్రితం పులిపాడు గ్రామస్థులు కాండ్ర రామయ్య, పోట్ల హనుమయ్య తదితరులు ఆ బిలం సమీపంలో పశువులు కాచుకుంటుండగా మంత్రోచ్చారణలు వినిపించాయి. దీంతో వారు ఆ శబ్దం వచ్చిన దిశగా వెతగగా బండరాళ్ళ మాటున బిలద్వారం కనపడింది.[1] దీంతో గ్రామస్థుల సహాయంతో తాడులు కట్లుకుని బిలం లోపలికి ప్రవేశించారు. ఆ ఇరుకైన బిలంలో కొంతదూరం ప్రయాణించగా అక్కడ వారికి దివ్యలింగాకారం సాక్షాత్కరించింది.[2] అక్కడ పూజలు జరిగిన ఆనవాళ్ళను వారు గమనించారు.నాటి నుంచి ఈ బిలంలోని శివలింగం శ్రీ అమరలింగేశ్వరస్వామిగా భక్తుల పూజలతో ఆ క్షేత్రం విరాజిల్లుతుంది.

దర్శనంసవరించు

అమరలింగేశ్వరస్వామిని దర్శించటం కష్టంతో కూడుకుంది. బిలం లోపల వందల మీటర్ల దూరంలో కొలువైనందున వృద్దులు, మహిళలు, చిన్నారులకు స్వామిని దర్శంచుకునేందుకు ఇబ్బందులు పడుతారు. బిలం లోపకి వెళ్లటానికి, బయటకు రావటానికి వేరువేరు మార్గాలు ఉన్నాయి. లోపల ఇరుకైన మార్గం ఉంటుంది. అక్కడక్కడ ఒంగి, కూర్చుని వెళ్ళవలసి వస్తుంది. బిలం లోపలకి ప్రవేశించిన తరువాత 500 మీ. దూరంలో అమరలింగేశ్వరస్వామి కొలువైన ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ ఆ స్వామికి కృష్ణానది నుంచి తీసుకొచ్చిన నీటితో అభిషేకం చేసి పూజలు చేస్తారు. ఆ తరువాత మరో 500 మీ. నడక సాగిస్తే బిలం బయటకు వస్తాం[3].

ఇతర మార్గాలుసవరించు

బిలం లోపల నడక దారిలో ఇతర మార్గాలు కనపడతాయి.అవి శ్రీశైలం, కాశీ, ఎత్తిపోతల జలపాతం, గుత్తికొండ బిలం ప్రాంతాలకు వెళ్లే మార్గాలని ఇక్కడివారు చెపుతారు. కొందరు ఈ మార్గాల్లో వెళ్ళి కనపడకుండా పోయారని చెపుతుంటారు.

నమ్మకంసవరించు

ఇక్కడి స్వామి కోరిన వరాలు తీర్చే కొంగుబంగారం అని భక్తుల విశ్వాసం. సోమవారం రోజున కృష్ణానదిలో స్నానం చేసి తడిబట్టలతో ఆ లింగాకారుని తాకి, కృష్ణా జలాలతో అభిషేకించి, ఆ రాత్రి నిద్రచేస్తే ఎంతటి కోరికలైనా తీరతాయని భక్తులు నమ్మకం. బిలంలో గర్భాలయం పైన ఆరిచెట్టు ఉంది. పిల్లలు లేనివారు ఆరిచెట్టుకు ప్రదక్షిణలు చేసి ఉయ్యాలకడితే సంతానం కలుగుతుందటారు.

చిత్ర మాలికసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "ॐ శ్రీ అమరలింగేశ్వరస్వామి గుంటూరు జిల్లా - mymandir". web.archive.org. 2019-11-08. Retrieved 2019-11-08.
  2. "బిలంలో అమరలింగేశ్వరాలయం ఎక్కడో తెలుసా! | Manalokam". web.archive.org. 2019-11-08. Retrieved 2019-11-08.
  3. http://www.youtube.com/watch?v=LePaGJVUNI0

వెలుపలి లంకెలుసవరించు