దొంగతనం

ఒకరి వస్తువు ను వారికి తెలియకుండా లేదా అనుమతి లేకుండ తీసుకోవటం.

దొంగతనం చేసినవాడు దొంగ లేదా చోరుడు. చోరత్వం 64 కళలలో ఒకటి అయినా చట్టరీత్యా దొంగతనం నేరం. స్త్రీ అయితే దొంగది పురుషుడైతే దొంగోడు అంటారు. దొంగాట ఒక రకమైన ఆట. అనధికారంగా ముద్రించి చలామణీ చేసే కరెన్సీ నోట్లును దొంగ నోట్లు అంటారు.

బూట్లను దొంగిలిస్తున్న ఇద్దరు పిల్లదొంగలు.

దొంగతనము - నిర్వచనము

మార్చు

దొంగ తనము అనగా ఒకరు కష్టపడి సంపాదించిన దాన్ని అతనికి తెలియకుండా, అతని అనుమతి లేకుండా రహస్యంగా తస్కరించి తమ అవసరాలకు వాడుకోవడాన్ని దొంగ తనము అని నిర్వహించ వచ్చు. దొంగతనము మానవ సమాజములోనే కాక ఇతర జీవ జంతువుల లోను స్పస్టముగా కనబడుతుంది. దీన్ని బట్టి చూస్తే దొంగ తనము అనేది ప్రకృతి సిద్ధంగా వున్నదన్న విషయం అర్థమవుతుంది.

దొంగల్లో రకాలు

మార్చు

ఇతర జీవ జంతువులలో దొంగతనాలు

మార్చు

దొంగ తనము కేవలము మానవ జాతిలోనే కాదు. ఇతర జీవ జాతులలోనూ ఈ ప్రవృత్తి స్పస్టంగా కనబడుతుంది. ఈ ప్రకృతిలో దీనికి ఉదాహరణలు కోకొల్లలు. కోయిల తన గృడ్లను కాకి గూటిలో దొంగతనంగా పెట్టి తన జాతిని వృద్ధి చేసుకుంటుంది. పాములు దొంగతనంగా... పక్షి గూళ్ళలోని గ్రుడ్లను దొంగిలించి ఆరగిస్తాయి. కొన్ని కీటకాలు ఎవరికి కనబడకుండా వేషం వేసుకుని అనగా రంగులు మార్చుకొని తమకు ఆహారం కాగల ఇతర జీవుల కొరకు దొంగతనంగా నక్కి మాటు వేసి అవి కనబడగానే వాటిపై దొంగ దెబ్బ తీసి వాటిని చంపి ఆరగిస్తాయి. కొన్ని జీవరాసులు తమ ఆహార సంపాదనకొరకు అనేక పన్నాగములు పన్ని, వల వేసి తమ ఎరలను అందులో ఇరుక్కొనేటట్లు చేసి తీరిగా బోంచేస్తాయి. సాలీడు పెట్టె సాలె గూళ్ళు ఈ కోవకే చెందుతాయి.

ఖైదీల్లో దొంగలే అధికం

మార్చు

జైలుకు వచ్చే వారిలో 60 శాతం మంది దొంగతనం కేసుల్లో నిందితులుగా ఉన్న వారే. కొద్దిరోజుల్లోనే వారిలో 90 శాతం మందికి బెయిల్‌పై విడుదలవుతున్నారు. పట్టుకుంటే వారిని క్షణాల్లో విడిపించుకోవడానికి అతడి సన్నిహితులు చట్టపరంగా అన్ని ఏర్పాట్లు చకాచకా పూర్తి చేసేస్తారు. పోలీసులు అరెస్టు చేస్తున్నారు... చేతులు దులుపుకొంటున్నారు. దొంగతనం కేసుల్లో నిందితులను పట్టుకుంటున్న పోలీసులు వారిని అరెస్టు చూపి కోర్టు ఆదేశాల మేరకు జైలుకు పంపిన అనంతరం చేతులు దులుపేసుకుంటున్నారన్నది కఠోర వాస్తవం. బెయిల్‌పై/శిక్ష కాలం పూర్తి చేసుకుని జైలు నుంచి విడుదలవుతున్న వారు ఏం చేస్తున్నారన్న అంశంపై పోలీసులు దృష్టి సారించకపోవడమే విస్తరిస్తున్న దొంగతనాలకు కారణమని తెలుస్తోంది. దొంగను పట్టుకున్నాక... అతను చెప్పే చిరునామానే రికార్డుల్లో నమోదు చేసేస్తున్నారన్న విమర్శ కూడా ఉంది. పోలీసులను మభ్యపెట్టి కొందరు దొంగలు తప్పుడు చిరునామాలు ఇస్తున్నా గుర్తించలేని పరిస్థితుల్లో కొందరు పోలీసులు ఉంటున్నారు. జైలు నుంచి విడుదలైన దొంగలు ఎలా ఉపాధి పొంది పొట్టపోసుంటున్నారన్న అంశంపై పోలీసులు దృష్టిసారించక పోవడం ప్రజల పాలిట శాపంలా మారింది.

ఆచరణలో

మార్చు

పోలీసులు దొంగలను పట్టుకోలేక, పెరుగుతున్న కేసులను అదుపు చేయడంలో విఫలమై... సంఖ్య తగ్గించేందుకు కొన్ని ఫిర్యాదులను కేసులుగా నమోదు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంకొన్ని సందర్భాల్లో ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన వారితో 'అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా... ఊరెళ్లినప్పుడు పక్కింటి వారికి చెప్పాలి కదా... మాకైనా సమాచారం ఇవ్వవచ్చు కదా.. నిజంగానే దొంగతనం జరిగిందా... వస్తువులు పోవడం వాస్తవమేనా' అంటూ గద్దిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. పోయిన సొత్తు పది తులాలైతే అయిదు తులాలుగానే కేసు కడుతున్నారన్న ఫిర్యాదులూ ఉన్నాయి. ఓ స్టేషను‌ పరిధిలో దొంగతనం జరిగితే మరో స్టేషను‌ అధికారి గుంభనంగా ఉంటున్నారు. ప్రతి స్టేషను‌లో, సర్కిల్‌ పరిధిలో ప్రత్యేకంగా క్రైం పార్టీలు ఉన్నా దొంగతనాల నిరోధంలో వారి పాత్ర కనిపించడం లేదు. సెంట్రల్‌ క్రైం స్టేషను‌ (సీసీఎస్‌) ఉన్నా... శాంతిభద్రతల విభాగంతో సమన్వయం కొరవడుతోంది. సీసీఎస్‌ సిబ్బంది నిందితులను పట్టుకుని శాంతి భద్రతల వారికి అప్పిగిస్తున్నారు. శ్రమ తమదైతే... పేరు సీసీఎస్‌కు వస్తుందన్న భావన శాంతిభద్రతల పోలీసుల్లో నెలకొంటోంది. క్రైం పార్టీ పోలీసులు నేరాన్వేషణలో కొన్ని ఖర్చులు పెడతారు... వివరాలు రాబట్టేందుకు నిందితులను అరెస్టు చూపకుండా ఉన్నన్ని రోజులు వారికి భోజనాలు, ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. వీటి కోసం శాఖాపరంగా కేటాయింపులు లేకపోవడంతో సీసీఎస్‌ సిబ్బంది చేతి చమురు వదులుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల వారిలో క్రమేణా నిర్లిప్తత చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. ఈగల్‌ మొబైల్‌ అని ఒక దళాన్ని ఏర్పాటు చేసినప్పటికీ దాని వల్ల హడావుడి తప్ప ఉపయోగం కానరావడం లేదు.గాంధీ జయంతి సందర్భంగా పలువురు ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి జైళ్ల నుంచి విడుదల చేశారు. యాదృచ్ఛికమో... వాస్తవమో కానీ అప్పటి నుంచే దొంగతనాలు జోరందుకున్నాయన్న భావనలు వ్యక్తమవుతున్నాయి. (ఈనాడు 25.11.2009)

చరిత్రలో దొంగల ప్రస్తావన

మార్చు

ఈ దొంగలు, దొంగ తనము అనేవి అతి ప్రాచీన కాలం నుండి ఉంది. వాటి నివారణకు ఆకాలంలో సామాజికంగా అనేక చర్యలు తీసుకున్నారు. దొంగతనం చేస్తే పలాన శిక్ష నరక లోకంలో విధిస్తారని గ్రంథాలలో వ్రాశారు. రాజుల పరిపాలన కాలంలో కూడా పలాన దొంగ తనానిని పలాన శిక్ష విధించాలని కూడా చట్టాలు చేసి అమలు పరచ బడింది. చారిత్రికంగా పిండారీలు/ థగ్గులు అనే ఒక జాతి వారు తమ ప్రధాన వృత్తిగా దొంగతనాన్ని ఎంచుకున్నారు వారిని అణచి వేయడానికి ఆ యా రాజ్య పాలకులు ఎంతగానో కృషి చేశారు.

ఏంచెయ్యాలి?

మార్చు
  • దొంగలను పట్టుకునేందుకు, దొంగతనాల నిరోధానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి.
  • పాత నేరస్తుల కదలికలపై నిఘా పెంచాలి
  • ఇంటికి తాళం పెట్టి ఊరెళ్లే పరిస్థితి వస్తే... స్థానిక పోలీసు స్టేషను‌లో సమాచారం ఇవ్వాలి. ఆ ప్రదేశంలో పోలీసు పెట్రోలింగ్‌ వాహనాలు తిరగాలి
  • అపార్ట్‌మెంట్ల వారు కాపలాదారులను నియమించుకోవాలి. ఎవరు వచ్చినా వారి పేర్లు... వచ్చిన సమయం... వెళ్లిన సమయం నమోదు చేయాలి.
"https://te.wikipedia.org/w/index.php?title=దొంగతనం&oldid=4268697" నుండి వెలికితీశారు