దొంగలున్నారు జాగ్రత్త (2022 సినిమా)

దొంగలున్నారు జాగ్రత్త 2022లో విడుదలైన తెలుగు సినిమా. సురేష్ ప్రొడక్షన్స్‌, గురు ఫిలింస్‌ బ్యానర్‌లపై డి సురేష్ బాబు, సునీత తాటి నిర్మించిన ఈ సినిమాకు సతీష్ త్రిపుర దర్శకత్వం వహించాడు. శ్రీ సింహ, ప్రీతి అస్రాని, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 15న విడుదల చేసి[1] సినిమా సెప్టెంబర్ 23న విడుదలవ్వగా, అక్టోబర్‌ 7న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలైంది.[2]

దొంగలున్నారు జాగ్రత్త
DongalunnaruJagratha.jpg
దర్శకత్వంసతీష్ త్రిపుర
నిర్మాతడి సురేష్ బాబు, సునీత తాటి
నటవర్గంశ్రీ సింహా, ప్రీతి అస్రాని, సముద్రఖని, శ్రీకాంత్ అయ్యంగర్
ఛాయాగ్రహణంయశ్వంత్
కూర్పుగ్యారీ బీ హెచ్
సంగీతంకాల భైరవ
నిర్మాణ
సంస్థలు
సురేష్ ప్రొడక్షన్స్‌, గురు ఫిలింస్‌
విడుదల తేదీలు
2022 సెప్టెంబర్ 23 (థియేటర్)
2022 అక్టోబర్‌ 7(నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

రాజు (సింహా) మెకానిక్ గా పనిచేసుకుంటూ భార్య నిరజ (ప్రీతీ అస్రానీ) ని పోషించుకుంటూ రాత్రి పూట ఆమెకి తెలియకుండా దొంగతనాలకి పాల్పడుతూంటాడు. ఈ క్రమంలో ఓ రాత్రి ఖరీదైన కారులోకి జొరబడి పని ముగించుకుని బయటపడబోతూంటే, కారు డోర్స్ లాక్ అయిపోతాయి. ఆ కారు చక్రవర్తి (సముద్రకని) అనే డాక్టరుది. ఆ కారు లోంచి రాజు ఎలా బయటపడ్డాడు ? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్‌, గురు ఫిలింస్‌
 • నిర్మాత: డి సురేష్ బాబు, సునీత తాటి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సతీష్ త్రిపుర
 • సంగీతం: కాల భైరవ
 • సినిమాటోగ్రఫీ: యశ్వంత్
 • ఎడిటర్: గ్యారీ బీ హెచ్
 • ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్

మూలాలుసవరించు

 1. 10TV Telugu (15 September 2022). "అడ్డంగా దొరికిపోయిన MM కీరవాణి కొడుకు శ్రీ సింహా.. "దొంగలున్నారు జాగ్రత్త" ట్రైలర్!". Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.
 2. "అప్పుడే ఓటీటీలోకి దొంగలున్నారు జాగ్రత్త మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?". 5 October 2022. Archived from the original on 22 October 2022. Retrieved 22 October 2022.
 3. "రివ్యూ: దొంగలున్నారు జాగ్రత్త". 23 September 2022. Archived from the original on 22 October 2022. Retrieved 22 October 2022.
 4. V6 Velugu (21 September 2022). "ఆయనతో సినిమా చేయడం ఒక కల". Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.
 5. "'దొంగలున్నారు జాగ్రత్త' యూనిక్‌ మూవీ : ప్రీతి అస్రాణి". 19 September 2022. Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.