దోచేవారెవరురా 2023లో విడుదలైన తెలుగు సినిమా. ఐక్యూ క్రియేషన్స్‌ బ్యానర్‌పై బొడ్డు కోటేశ్వర రావు నిర్మించిన ఈ సినిమాకు శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. ప్రణవ్ చంద్ర, మాళవిక సతీశన్, అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేయగా[2], సినిమా మార్చి 11న విడుదలైంది.

దోచేవారెవరురా
దర్శకత్వంశివనాగేశ్వరరావు
స్క్రీన్ ప్లేశివనాగేశ్వరరావు
నిర్మాత
 • బొడ్డు కోటేశ్వర రావు


తారాగణం
ఛాయాగ్రహణంఅర్లీ
కూర్పుశివ వై. ప్రసాద్
సంగీతంరోహిత్ వర్ధన్
నిర్మాణ
సంస్థ
 • ఐక్యూ క్రియేషన్స్‌
విడుదల తేదీs
2023 మార్చి 11 (2023-03-11)(థియేటర్)
2023 సెప్టెంబరు 29 (2023-09-29)( ఆహా ఓటీటీలో)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ సవరించు

సిద్ధు (ప్రణవ్ చంద్ర) జీవనోపాధి కోసం సిద్దు (మాస్టర్ చక్రి)తో కలిసి దొంగతనం చేస్తుంతాడు. లక్కీ (మాళవిక) ఒక కంపెనీలో పనిచేస్తుంటుంది. అతని బాస్ ఆమెను హరాస్ చేస్తుంటాడు. ఒక రోజు ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీయించి బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆ వీడియో ఉన్న ఫోన్ ని దొంగతనం చేసి తెమ్మని సిద్ధుని అడుగుతుంది. సిద్ధు అంతా ప్లాన్ ప్రకారమే చేస్తాడు, కానీ ఆ బాస్ అదే రాత్రి తన ఇంటిలో హత్యకు గురౌతాడు. ఇంతకీ ఆ హత్య ఎవరు చేసారు అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు సవరించు

సాంకేతిక నిపుణులు సవరించు

 • బ్యానర్: ఐక్యూ క్రియేషన్స్‌
 • నిర్మాత: బొడ్డు కోటేశ్వర రావు
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివనాగేశ్వరరావు[4]
 • సంగీతం: రోహిత్ వర్ధన్
 • సినిమాటోగ్రఫీ: అర్లీ
 • ఎడిటర్: శివ వై ప్రసాద్

మూలాలు సవరించు

 1. Andhra Jyothy (27 September 2023). "ఓటీటీ విడుదలకు సిద్ధమైన కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్.. ఎప్పుడు, ఎక్కడంటే?". Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.
 2. TV9 Telugu (27 February 2023). "దోచేవారెవరురా ట్రైలర్ విడుదల చేసిన హరీష్ శంకర్." Archived from the original on 20 March 2023. Retrieved 20 March 2023.
 3. TV5 News (12 March 2023). ""దోచేవారెవరురా" మూవీ రివ్యూ" (in ఇంగ్లీష్). Archived from the original on 20 March 2023. Retrieved 20 March 2023.
 4. Andhra Jyothy (12 March 2023). "నన్ను ఎవరూ దోచుకోలేరు!". Archived from the original on 20 March 2023. Retrieved 20 March 2023.