శివనాగేశ్వరరావు

సినీ దర్శకుడు, రచయిత

బోయిన లచ్చన్న[1] తెలుగు సినిమా దర్శకుడు. ఆయన తన 23 వ యేట సినీ సినీపరిశ్రమలో అడుగు పెట్టాడు. ఆయన మొదట అసిస్టెంటు డైరక్టరుగా రామ్ గోపాల్ వర్మ వద్ద పనిచేసాడు. ఆయన మొదటి సినిమా మనీ.[2]

శివనాగేశ్వరరావు
జననం
ఉప్పలపాడు, గుంటూరు జిల్లా
విద్యాసంస్థహిందూ కళాశాల, గుంటూరు
వృత్తిదర్శకుడు

జీవిత విశేషాలు మార్చు

ఆయన గుంటూరు జిల్లాకు చెందిన ఉప్పలపాడు గ్రామంలో జన్మించాడు. ఆయన గుంటూరులోని హిందూ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు. ఆయనకు బాల్యం నుండి చిత్రపరిశ్రమలో చేరాలనే ఆసక్తి ఉండేది. తన 23వ యేట తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చేరుటకు 1979లో చెన్నై వెళ్లాడు. ఆరు నెలల వరకు యిబ్బందులు పడ్డాడు. జీవనాన్ని కొనసాగించుట కొరకు బుర్రిపాలెం బుల్లోడు, సన్నాయి అప్పన్న చిత్రాలలో అనధికారిక జూనియర్ ఆర్టిస్టుగా నటించాడు. వారు మూడు రోజులకు 100 రూపాయలు యిచ్చేవారు. తరువాత ఆయన ఒక కార్యాలయంలో అకౌంటెంట్ గా జాయిన్ అయ్యాడు. ఘట్టమనేని కృష్ణ నటించిన అమ్మాయికి మొగుడు మామయ్యకి యముడు చిత్రానికి దర్శకత్వ విభాగంలో పనిచేయాల్సిందినా త్రిపురనేని చిట్టిబాబు కోరాడు. ఆ చిత్రం పూంపుహార్ బ్యానర్ పై కరుణానిథి నిర్మిస్తున్నది. ఆయన మధుసూదరరావు, లెనిన్‌బాబు, సి.ఎస్.రావు, ఎస్.ఎ.చంద్రశేఖర్ వంటి దర్శకుల వద్ద పనిచేసాడు. క్రాంతికుమార్ వద్ద స్వాతి చిత్రం నుండి ఆరు సంవత్సరాలు పనిచేసాడు.[3]

 
మనీ సినిమా

చిత్రాలు మార్చు

దర్శకునిగా
నటునిగా
  • నిన్ను కలిసాక (2009)

మూలాలు మార్చు

  1. Boina, Welliton Leandro de Oliveira; Cordeiro, João Sérgio; Boina, Rosane Freire (2018-09-24). "Efeito da inoculação de biorremdiador no procedimento de compostagem de lodo de esgoto". Revista Ibero-Americana de Ciências Ambientais. 9 (5): 106–116. doi:10.6008/cbpc2179-6858.2018.005.0011. ISSN 2179-6858.
  2. http://www.idlebrain.com/celeb/interview/sivanageswararao.html
  3. Interview with Siva Nageswara Rao by Jeevi

ఇతర లింకులు మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో శివనాగేశ్వరరావు పేజీ