ద్రవ బుడగ
ద్రవ బుడగను ఆంగ్లంలో లిక్విడ్ బబుల్ అంటారు.
ద్రవపు బుడగ అనునది ద్రవంతో ఆవరింపబడిన గాలి. మార్గోనీ ఫలితం వలన రెండు పదార్థముల మధ్య తలతన్యత లలో మార్పుల వలన ఇవి ఏర్పడతాయి.
ఉదాహరణలుసవరించు
- శీతల పానీయాలలో గల కార్బన్ డై ఆక్సైడ్ దాని ద్రానణీయత కన్నా ఎక్కువగా ఉన్నపుడు మూత తీయగానె బుడగలు వస్తాయి.
- నీరు బాష్పీభవనం చెందినపుడు నీటి నుండి బుడగలు వచ్చుట మనం గమనించవచ్చు.
- సముద్ర తలంపై వచ్చు నురగలో కూడా బుడగలు వస్తాయి.
- సోడియం కార్బొనేట్లో ఏదైనా ఆమ్లం కలిపినపుడు బుడగలను గమనించవచ్చు.
వీటి ఆకారంసవరించు
ద్రవబుడగలు గోళాకారంగా ఉంటాయి. ఎందువనంటే ఈ ఆకారం అల్ప శక్తి స్థాయి గలది.
ఇవి ఎలా కనిపిస్తాయిసవరించు
మనం ద్రవపు బుడగలను చూడవచ్చు. ఎందువలనంటే అవి పరిసరాల పదార్థాల కన్నా వివిధ వక్రీభవన గుణకాలు కలిగి ఉంటాయి. ఉదాహరణకు గాలి యొక్క వక్రీభవన గుణకం 1.0003, నీటి వక్రీభవన గుణకం 1.333. ఈ తేడా వలన స్నెల్ నియమం ప్రకారం విద్యుదయస్కాంత తరంగాలు రెండు యానకాలలో ప్రయాణించునపుడు వాటి దిశను మార్చుకుంటాయి. కనుక ఈ బుడగలు వక్రీభవనం, అంతర పరావర్తనం చెందడం వలన అవి పారదర్శకంగా కనిపిస్తాయి.
ఈత కొట్టే సమయంలో బుడగల ఆటసవరించు
ఇవి కూడా చూడండిసవరించు
Look up ద్రవబుడగ in Wiktionary, the free dictionary.