ద్రోణంరాజు సత్యనారాయణ

ద్రోణంరాజు సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి విశాఖపట్నం లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు, ఒకసారి పెందుర్తి అసెంబ్లీ సభ్యునిగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా వివిధ హోదాల్లో పనిచేశాడు.[1]

ద్రోణంరాజు సత్యనారాయణ

ఎంపీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1977 నుండి 1980
ముందు పి.వి.జి.రాజు
తరువాత కె.అప్పలస్వామి
నియోజకవర్గం విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 19 డిసెంబర్ 1933
చిన్నముసిడివాడ, పెందుర్తి మండలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం 2006
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి సావిత్రి
సంతానం ద్రోణంరాజు శ్రీనివాస్
నివాసం విశాఖపట్నం
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం మార్చు

ద్రోణంరాజు సత్యనారాయణ 1933 డిసెంబరు 19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలం, చిన్నముసిడివాడ గ్రామంలో జన్మించాడు. ఆయన విజయనగరం మహారాజా కాలేజీ నుండి డిగ్రీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

ద్రోణంరాజు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1952 నుండి 1970 వరకు చిన్నముసిడివాడ సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించాడు. ఆయన 1977లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. ద్రోణంరాజు సత్యనారాయణ విశాఖ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వుడా) ఆవిర్భావం తర్వాత తొలి చైర్మన్‌గా 1979లో నియమితులయ్యాడు. సత్యనారాయణ 1980లో పెందుర్తి నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై, 1983లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు.

ద్రోణంరాజు సత్యనారాయణ తరువాత విశాఖపట్నం జిల్లా, పరిషత్ చైర్మన్‌గా, 1988లో రాజ్యసభకు తొలిసారి, తిరిగి 1993లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ఆయన రాజకీయాల్లోనే కాకుండా విశాఖ జిల్లా, రాష్ట్ర గ్రామోద్యోగుల సంఘం నేతగా మంచి గుర్తింపునందుకున్నాడు.[2]

మూలాలు మార్చు

  1. Sakshi (18 December 2014). "ఉత్తరాంధ్ర రాజకీయ శిఖరం ద్రోణంరాజు". Archived from the original on 14 December 2021. Retrieved 14 December 2021.
  2. Loksabha (2021). "Dronamraju Satyanarayana , Visakhapatnam". Archived from the original on 14 December 2021. Retrieved 14 December 2021.

బయటి లింకులు మార్చు