ద్వివుదుడు కిష్కింధాపురాధీశుడైన సుగ్రీవుని మంత్రులలో ఒకడైన మైంధుని సోదరుడు. ద్వివుదుడి నామార్థము ప్రకారము రెండు రకాల దృష్టి కలవాడని అర్థం. ఈ ద్వివుదుడు నరకాసురుని స్నేహితుడు. ద్వివుదుడి వృత్తాంతం భాగవతం దశమ స్కందము ఉత్తర భాగములో వస్తుంది.

ద్వివుదుడు యాదవనగరాలు నాశనం చేయడం- బలరాముడి చేతిలో హతుడవ్వడం

మార్చు

నరకాసురుని మరణవార్త విన్న ద్వివుదుడు యాదవ వంశంపై పగతో యాదవ నగరాలు ధ్వంసం చేయసాగాడు. బలరాముడు రైవత గిరిపై కేళివిలాసాలలోనుండగా ద్వివుదుడు ఆ కొండ వృక్షశాఖలపై విహరిస్తూ వాటిని ధ్వంసం చేయసాగాడు. అప్పుడు బలరాముడు రాయి విసరగా, ద్వివుడు తప్పించుకొని దగ్గరలో నున్న సురాభాండం అందుకొని దాన్ని చెట్టు పైనుండి క్రిందకు విసిరాడు. వానర చేష్టలు ప్రదర్శిస్తూ, యాదవులు ఆరవేసుకొన్న బట్టలను చింపి, చీల్చి ముక్కలు చేయసాగాడు. బలరాముడు క్రోధోధిక్తుడై ముసలాయుధం ధరించి నిలబడగా ద్వివుదుడు పెద్ద చెట్టు విసిరాడు. బలరాముని ఆవేశం పెరిగింది. చేతిలో తన వద్ద ఉన్న సునంద అనే ముసలాయుధం ధరించి దానిని ద్వివుదుడి పైకి విసిరాడు. ఆ ఆయుధం ద్వివుదుడిని తల తాకగానే ద్వివుదుడి తల తాటి పండులా నేలపై పడింది. ఆవిధంగా దుష్టవానర సంహారం చూసిన యాదవులు బలరాముని అభినందించారు.


బయటి లింకులు

మార్చు