ద డార్క్ నైట్

కామిక్స్ ఆధారిత సూపర్ హీరో చిత్రం

ద డార్క్ నైట్ 2008ఆంగ్లం:The dark knight. చిత్రాన్ని ప్రముఖ హాలివుడ్ దర్శకుడు క్రిస్టొఫర్ నొలన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం డి.సి. కామిక్స్ లోని బాట్ మాన్ దారావాహికల ఆధారంగా రూపొందించబడింది. బాట్ మాన్ త్రయం (ట్రైయాలజి) లో ఇది రెండవ చిత్రం. మొదటి చిత్రం "బాట్ మాన్ బిగిన్ స్(2005)" మూడవ చిత్రం " ద డార్క్ నైట్ రైసెస్(2012)". ఈ చిత్రానికి దర్శకత్వ, నిర్మాణ, సహ రచయితగా నోలన్ వ్యవహరించారు. ఈ చిత్రానికి ప్రేరణగా 1940 లో వచ్చిన The Killing Joke, (ఈ నవల ద్వారా జోకర్ పాత్ర మొదలైంది.), The Long Halloween కామిక్ పుస్తకాలు. అయితే ద డార్క్ నైట్ అనే పేరుని మొదటగా బాట్ మాన్ సృష్టికర్త అయిన బిల్ ఫింగర్ తన నవల Batman #1 (1940) లో ఉపయోగించాడు. నోలన్ ఈ చిత్రాన్ని తన ట్రేడ్మార్క్ ఐమాక్స్ కేమెరాతొ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు. ముఖ్యంగా చిత్ర ప్రారంభంలో జోకర్ డబ్బు దొంగిలించే సన్నివేశం. ఈ చిత్రం జూలై 2008న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని 2000 దశాబ్దపు అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా అబివర్ణించారు. విమర్శకుల ప్రశంసలతో పాటూ ఉత్తమ సమీక్షలు ( Reviews) పొందింది. ప్రపంచవ్యాప్తంగా $1 బిలియన్ డాలర్లకు పైగా సాధించింది. ఈ చిత్రం ఎక్కువ లాభాలనార్జించిన 19వ చిత్రంగా గుర్తింపు పొందింది. జోకర్ పాత్రను పోషించిన హీథ్ లెడ్జర్ ఆ సంవత్సరపు ఆస్కార్ అవార్డులలో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు పొందారు.

The Dark Knight
Theatrical release poster
దర్శకత్వంChristopher Nolan
స్క్రీన్ ప్లే
కథ
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంWally Pfister
కూర్పుLee Smith
సంగీతం
పంపిణీదార్లుWarner Bros. Pictures
విడుదల తేదీs
జూలై 14, 2008 (2008-07-14)(New York City)
జూలై 18, 2008 (North America)
జూలై 24, 2008 (United Kingdom)
సినిమా నిడివి
152 minutes[2]
దేశాలు
  • United States[1]
  • United Kingdom[1]
భాషఆంగ్ల భాష
బడ్జెట్$185 million[3]
బాక్సాఫీసు$1.005 billion[3]

గోథం నగరంలోని నేరస్థులు డబ్బు దాచుకునే బ్యాంకుని జోకర్ తన మనుషులు (అందరూ జోకర్ ముసుగు దరిస్తారు.) తో దోపిడీ చేస్తాడు. ప్లానులో భాగంగా ప్రతీ వ్యక్తి పని పూర్తి అయిన వెంటనే తన తోటి వ్యక్తిని చంపేయమని చెప్తాడు. అందరూ ఒకరినొకరు చంపేసుకుంటారు. చివరగా ఉన్న వ్యక్తిని అసలైన జోకర్ చంపేసి డబ్బు మొత్తం తీసుకొని వ్యానులో వెళ్ళిపోతాడు.

 
సినిమాలో తన అత్యుత్తమ ప్రదర్శనకు గాను ఆస్కార్ అందుకున్న హీథ్ లెడ్జర్ సినిమా విడుదలకు మెందే డ్రగ్స్ అధికంగా వాడినందున మరణించాడు

తమ డబ్బును జోకర్ దొంగిలించుకుని పోయాడని తెలుకుకున్న నేరస్థులు జోకర్ మీద కోపంగా వుంటారు. ఇంతలో జోకర్ అక్కడికి వచ్చి తను బాట్మాన్ను చంపడాకి గాను ఆ డబ్బులో సగం తీసుకుంటానని వారికి చెప్తాడు. నేరస్తుల మిగిలిన డబ్బుని చైనాకు చెందిన లావ్ అనే వ్యాపారవేత్త డబ్బు మొత్తంతొ హాంగ్ కాంగ్కు వెళ్ళి పోతాడు. గొథం పోలిసులకు హాంగ్ కాంగ్ కి వెళ్ళి లావ్ ని అరెస్టు చేసే అధికారం లేదు. మరోవైపు గొథం న్యాయవాదిగా వచ్చిన హార్వీడెంట్ నేరస్తులను చట్టపరంగా వారిని పట్టుకోవాలని చూస్తాడు. బ్రూస్ వేన్ (బాట్ మాన్) హాంగ్ కాంగ్ లో వున్న లావ్ ని అక్కడికెళ్ళి బంధించి నగర పోలీస్ జేంస్ గోర్డాన్ కి అప్పగిస్తాడు. జోకర్ మాములు ప్రజలను పట్టుకుని బాట్మాన్ తన ముసుగుని తీసి అసలు రూపాన్ని బయట పెట్టకపోతే రోజుకొకరిని చంపేస్తానని చెప్తాడు.

జోకర్ నగర కమీషనర్ లోబ్ ని అతను త్రాగే వైనులో యాసిడ్ కలిపి చంపేస్తాడు. జడ్జిని ఆమె కారులో బాంబు అమర్చి చంపేస్తాడు. కమీషనరు లోబ్ అంతిమ యాత్రలో జోకర్ మనుషులు పోలిసులను కిడ్మాప్ చేసి వారి బట్టలు ధరించి అక్కడికి విచ్చేసిన నగర మేయర్ని చంపాలని ప్రయత్నిస్తారు. ఇందుకు అడ్డు పడిన జేంస్ గోర్డాన్ చనిపోతాడు. నగరంలో శాంతి భద్రతలకు కల్గుతున్న ఆటంకాలకు స్పందించి న్యాయవాది హార్వీడెంట్ తనే బాట్ మాన్ అని విలేకరుల సమావేశంలో చెప్తాడు. తనను పోలిసులు అరెస్టు చేస్తారు. జైలుకి ట్రక్కులో తీసుకు వెళ్తున్నప్పుడు జోకర్ తన మనుషులతో డెంట్ ను పట్టుకోవాలని చూస్తాడు. డెంట్ యొక్క ట్రక్కును పూర్తిగా ధ్వంసం చేస్తాడు. అప్పుడు నిజమైన బాట్మాన్ తన బాట్ పాడ్ మీద వచ్చి జోకర్కి ఎదురుగా నిలబడతాడు. అప్పుడు జోకర్ తనను చంపేయమని బాట్మాన్ తొ తలపడుతాడు. బాట్ మాన్ యొక్క విది నేరస్తులను బంధించడమే కాని చంపడం కాదు. అందుచేత జోకర్ను ప్రాణాలతొ ఒదిలేస్తాడు. అప్పుడు చనిపోయనట్టుగా నటించిన గోర్డాన్ జోకర్ను అరెస్టు చేస్తాడు.

జైలులో బాట్ మాన్ జొకర్ను ప్రశ్మిస్తాడు. అప్పుడు జోకర్ రేచల్ (బాట్ మాన్ యొక్క బాల్య స్నేహితురాలు, హార్వీడెంట్ యొక్క ప్రియురాలు)ని తన మనుషులు బందిచారని చెప్తాడు. అలాగే హార్వీడెంట్ ను కూడా బంధించారని చెప్తాడు. వారినెక్కడ బంధించారొ చెప్పమని బాట్ మాన్ జోకర్ని విచక్షణారహితంగా కొడతాడు. వారిద్దరిని వేర్వేరు బిల్డింగులలో ప్రేలుడు పదార్థాల మద్య బంధించారని జొకర్ చెప్తాడు. అయితే వారిద్దరిలో ఒకరిని మాత్రమే కాపాడగలవని బాట్మాన్ కి చెప్తాడు. బాట్ మాన్ రేచల్ ని కాపాడడానికి వెళ్ళగా గోర్డాన్ హార్వీని కాపాడడానికి తన బృందంతొ వెళ్తాడు. బాట్ మాన్ రేచల్ని కాపాడడానికి వెళ్ళిన ప్రదేశంలో హార్వీ ఉంటాడు. జొకర్ తనకు సమాచారాన్ని మార్చి ఇచ్చాడని బాట్ మన్ గ్రహిస్తాడు. డెంట్ని బయటకు తీసుకువస్తున్నపుడు. బాంబు పేలుతుంది. గోర్డాన్ రేచల్ ని కాపాడడంలో విఫలం అవుతాడు. రేచల్ చనిపోతుంది. ప్రేలుడు కారణంగా హార్వీ ముఖం ఒకవైపు పూర్తిగా కాలిపోతుంది.

మరోవైపు జైలులో వున్న జోకర్ పోలీస్ స్టేషనును బాంబుతో పేల్చివేసి అక్కడవున్న లావ్ ను తీసుకుని పారిపోతాడు. తను దొంగిలించిన డబ్బుకట్టల మీద లావ్ ను ఉంచి కాల్చేస్తాడు. మద్యలో అడ్డు వచ్చిన చెంచెన్ ను కూడా చంపేస్తాడు. అప్పుడు బాట్మాన్ యొక్క అసలు రూపాన్ని బయటపెడతానన్న వేన్ ఎంటర్ ప్రైజెస్ అకౌంటంట్ "రీస్"ను జోకర్ గంటలో చంపేయకపోతే తాను హాస్పిటల్ను పేల్చేస్తానని బెదిరిస్తాడు. పోలిసులు, వేన్ రీస్ ను జొకర్ మనుషుల నుండి కాపాడుతారు. ఆ సమయంలో హాస్పిటల్ లోవున్న హార్వీ దగ్గరకు జోకర్ వచ్చి రేచర్ మరణానికి తాను కారణం కాదని పోలీసులలోనే కొందరు డబ్బుకు ఆశపడి రేచల్ ని కిడ్నాప్ చేసి తన మరణానికి కారణమయ్యారని వారి మీద పగ తీర్చుకోమని అతనిని మార్చివేస్తాడు. జోకర్ తరువాత హాస్పిటల్ను పూర్తిగా ధ్వంసం చేస్తాడు.

డెంట్ రేచల్ మరణానికి కారణమైన వారిని తన వద్దనున్న కాయిన్ని ఎగరవేసి బొమ్మ, బొరుసు ఆధారంగా ఒక్కొక్కరిని చంపేస్తాడు. మరోవైపు నగర ప్రజలు ప్రయాణిస్తున్న ఓడ, గోథం ఖైదీలు ప్రయాణిస్తున్న మరో ఓడలో బాంబులు అమర్చి ఒక దాని డిటొనేటర్ మరొక ఓడకు అందిస్తారు. సరిగ్గా రాత్రి 12 కల్లా ఏదో ఒక ఓడ పేలకపోతే తన వద్ద నున్న డిటొనేటర్ ద్వారా రెండింటినీ పేల్చేస్తానని జోకర్ ప్రకటిస్తాడు. బాట్ మాన్ జోకర్ ను పట్టుకోవడానికి తనకు ఆయుధాలను సమకూర్చే లూసియన్ ఫాక్స్ ను city-wide tracking prototype device ద్వారా తనకు సమాచారం ఇవ్వమని కోరతాడు. అందుకు అయిష్టంగానే ఒప్పుకున్న ఫాక్స్ ఈ పని తర్వాత తను తన ఉద్యొగానికి రాజీనామా చేస్తానని చెప్తాడు.

జోకర్ తన్ మనుషులతొ ఒక బిల్డింగులోకి ప్రవేశించి అక్కడి బంధీలకు జోకర్ ముసుగు తోడుగుతారు. SWAT బృందం వారుని చంపేందుకు ప్రయత్నిస్తుండగా బాట్మాన్ అక్కడికి వచ్చి జోకర్ మనుషులతో, SWAT తో పొరాడుతాడు. బందిలను రక్షించి చివరికి జోకర్ని పట్టుకుంటాడు. అప్పుడు రెండు ఓడలలోని వారు ఒకరి ఓడని మరొకరు పేల్చేందుకు నిరాకరిస్తారు సమయం 12 దాటినా ఓడలు పేలకపోవడంతొ ఆశ్చర్యపోయన జోకర్ తన వద్దనున్న డిటొనేటర్ ద్వారా పేల్చేయబోతుంటే బాట్మాన్ జోకర్ను బంధిస్తాడు. అప్పుడు జోకర్ మనిద్దరి మద్య యుద్ధంలో తనే గెలిచానని గోథం ప్రజలకు చట్టం, న్యాయం మీద నమ్మకం పోయాయని నగరంలో మంచి న్యాయవాదిగా పేరు తెచ్చుకున్న హార్వీడెంట్ ఇప్పుడు ఒక హంతకుడిగా మారి హత్యలు చేస్తున్నడని చెబుతాడు. ఈ విషయం విని నిర్ఘాంతపోయిన బాట్ మాన్ హార్వీ దగ్గరకు వెళతాడు.

హార్వీ గోర్డాన్ యొక్క భార్యా, పిల్లల్ని రేచల్ మరణించిన చోట బంధించి గోర్డాన్ ని అక్కడికి రమ్మంటాడు. గోర్డాన్ చేరుకున్న కొద్దిసేపటి తర్వాత బాట్ మాన్ అక్కడికి చేరుకుని తను ఈ హత్యలు తనకు జరిగిన అన్యాయానికి చేస్తున్ననని ఈ ప్రపంచంలో నీతి, న్యాయం, చట్టం అంటూ ఏవీ లేవని ఉన్నది ఒక్కటే "అవకాశం" అని చెబుతాడు. బాట్మాన్ హార్వీతొ తనకు జరిగిన అన్యాయానికి తనే బాధ్యుడునని ముందు తనని చంపమంటాడు. హార్వీ బాట్మాన్ను కాల్చేస్తాడు. తర్వాత గోర్డాన్ యొక్క కోడుకుని పట్టుకుని చంపేముందు కాయిన్ ఎగరవేసినప్పుడు బాట్మాన్ అడ్డుపడి హర్వీని కిందకు తొసేసి తన కొడుకుని కాపాడుతాడు.

ఈ ప్రమాదంలో హార్వి చనిపోతాడు. అప్పుడు గోర్డాన్ తొ బాట్మాన్ "నగర ప్రజల దృష్టిలో హార్వీ హీరోగానే మిగిలిపోవాలని చెబుతాడు." అతను చేసిన తప్పులు తన మీద వేసుకుంటాడు. అందుకు అయిష్టంగానే గోర్డాన్ అంగీకరిస్తాడు. ఈ విధంగా తన మీద నేర ముద్రను వేసుకున్న బాట్మాన్ పోలిసులు తనను బంధించేముందు అక్కడినుండి పారిపోతాడు. నేరస్థుడైన బాట్మాన్ యొక్క బాట్ సిగ్నల్ ను గోర్డాన్ ధ్వంసం చేస్తాడు. ఆల్ఫ్రెడ్ రేచల్ యొక్క నిశ్చితార్థ లేఖను కాల్చేస్తాడు. ఫాక్స్ తన కంప్యూటర్లు ధ్వంసం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "The Dark Knight (2008)". British Film Institute. Archived from the original on 2014-10-27. Retrieved June 16, 2014. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "The Dark Knight". British Board of Film Classification. Archived from the original on 2014-12-13. Retrieved December 13, 2014.
  3. 3.0 3.1 "The Dark Knight (2008)". Box Office Mojo. Retrieved March 19, 2009.