లార్డ్ ఆఫ్ ది రింగ్స్

లార్డ్ ఆఫ్ ది రింగ్స్ (ఆంగ్లం: The Lord of the Rings) కొంత మందికి సినీమా రూపంగా, కొంత మందికి పుస్తక రూపంగా తెలుసు. (సినీమా పుస్తకాల పైననే ఆధారపడింది).

The Lord of the Rings: The Motion Picture Trilogy poster (2003)

చలన చిత్రము

మార్చు

లార్డ్ ఆఫ్ ది రింగ్స్, మూడు చలన చిత్రాల సీరీస్ .

  • లార్డ్ ఆఫ్ ది రింగ్స్ :ది ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్ (2001)
  • లార్డ్ ఆఫ్ ది రింగ్స్ :ది టూ టవర్స్(2002)
  • లార్డ్ ఆఫ్ ది రింగ్స్ :ది రిటర్న్ ఆఫ్ ది కింగ్(2003)

కాల్పానిక మిడిల్ ఎర్త్ లో, ఒక పొట్టి హాబిట్ (ఒక కల్పించబడిన పాత్ర, వ్యాసము చివరలో వివరణలు ఇవ్వబడ్డాయి) ఫ్రోడో బేగిన్స్ ఆతని ఎనిమిది మంది సహచరులు కలిపి(ఫెలోషిప్), దుష్టశక్తులు ఉన్న ఉంగరాన్ని, తద్వారా దుష్ట రాక్షసుడైన సారాన్ ను నాశనము చెయ్యడానికి బయలుదేరుతారు. ఫెలోషిప్ విడిపోయి ఫ్రోడో తన విశ్వసనీయ సహచరుడు సామ్వైస్ గామ్జీ, ద్రోహబుద్ది గల గోల్లుమ్ లతో ఉంగరాన్ని పట్టుకుని మోర్డోర్ (అక్కడి అగ్నిపర్వతము లో కాని ఉంగరము నాశనము కాదు.) వైపు బయలుదేరతాడు. గాండోర్ నగర సింహాసనానికి వారసుడు ఆరగార్న్, మంత్రగాడు గేండాల్ఫ్ మిడిల్ ఎర్త్ లో ఉన్న సామ్రాజ్యాలను ఏకము చేస్తూ ఉండగా, దుష్ట సారోన్ తన దుష్ట మాంత్రిక అనుచరుడు సారోమాన్ తో కలిసి తన శక్తి ని పెంచుకుంటాడు.

జె.ఆర్.ఆర్. టోల్కీన్ రచించిన నవలల ఆధారంగా పీటర్ జాక్సన్, 8 సంవత్సరములు శ్రమంచి, 27 కోట్ల డాలర్ల బడ్జెట్ తో,మొత్తము 10 గంటలు నిడివి గల మూడు సినీమాలు నిర్మించాడు. అన్నిటి షూటింగు ఒకటే సారి న్యూజిలాండు లో జరిగింది.

పుస్తకాలు

మార్చు
The Lord of the Rings
 
Cover design for the three volumes of The Lord of the Rings
కృతికర్త: జె.ఆర్.ఆర్.టోల్కీన్
దేశం: United Kingdom
భాష: English
విభాగం (కళా ప్రక్రియ): Fantasy novel
ప్రచురణ: Allen & Unwin
విడుదల: 1954 and 1955
ప్రచురణ మాధ్యమం: Print (Hardback & Paperback)
పేజీలు: 1216 pp
దీనికి ముందు: The Hobbit
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): NA


ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ బ్రిటిష్ విద్యావేత్త జె.ఆర్.ఆర్.టోల్కీన్ రచించిన 'ఫాంటసీ ప్రభందము'. ది హాబిట్ అనే ఒక పుస్తకము న కు ఉత్తరము(సీక్వెల్) గా మొదలై, పెద్ద కథ గా మారి పోయింది. 1937 నుండి 1949 వరకు దశలు గా వ్రాయబడినది. మొదటి ప్రపంచయుద్దములో సైనికుడైన టోల్కీన్ ఈ గ్రంథాన్ని చాలా మటుకు రెండవ ప్రపంచ యుద్దకాలము లో నే రచించారు.[1] 1954-55 లో మొదటి సారి ప్రచుచ్రితమైన ఈ గ్రంథము అనేక మాట్లు పునర్ముద్రితమై సుమారు 38 భాషల లోకి అనువదించబడినది.[2] 20 వ శతాబ్దపు సాహితీ చరిత్ర లోనే ఒక ప్రముఖ స్థానాన్ని పొందింది.

"ధైర్యము అస్సలు అనుకోని ప్రదేశాల లో దొరుకుతుంది.(Courage is found in the most unlikely places)" --జె.ఆర్.ఆర్. టోల్కీన్

జాన్ రోనాల్డ్ రూయల్ టోల్కీన్ (జనవరి 3, 1892 - సెప్టెంబరు 2, 1973) సౌత్ ఆఫ్రికా లో జన్మించిన ఒక బ్రిటిష్ రచయత, వ్యాకరణ/లక్షణ శాస్త్రజ్ఞుడు, రచయత, యూనివర్శిటీ ప్రొఫెసరు. క్రానికల్స్ అఫ్ నార్నియా ను రచిచంచిన సి.ఎస్' లూయీస్ కు స్నేహితుడు

మూలాలు

మార్చు
  1. "World War I and World War II". Archived from the original on 2006-06-13. Retrieved 2006-06-16.
  2. "Tolkien FAQ: How many languages have The Hobbit and The Lord of the Rings been translated into?". Archived from the original on 2007-02-26. Retrieved 2007-02-25.