పీటర్ జాక్సన్
సర్ పీటర్ రాబర్ట్ జాక్సన్ (జననం 1961 అక్టోబరు 31) న్యూజిలాండ్ చిత్ర దర్శకుడు, స్క్రీన్ రచయిత నిర్మాత. పీటర్ జాక్సన్ దర్శకత్వం వహించిన లార్డ్ ఆఫ్ ది రింగ్స్ త్రయం (2001-2003) హాబిట్ త్రయం (2012-2014) ఈ రెండు సినిమాలు పేరుపొందాయి. పీటర్ జాక్సన్ దర్శకత్వం వహించిన సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. డ్రామా హెవెన్లీ క్రియేచర్స్ (1994), హ ది ఫ్రైటెనర్స్ (1996), కింగ్ కాంగ్ (2005), ప్రపంచ యుద్ధం I దే షాల్ నాట్ గ్రో ఓల్డ్ (2018) ది ది బీటిల్స్: గెట్ బ్యాక్ (2021). లాంటి సినిమాలు పీటర్ జాక్సన్ కు పేరు తెచ్చి పెట్టాయి. పీటర్ జాక్సన్ ఆల్-టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన చిత్ర దర్శకులలో నాల్గవ స్థానంలో ఉన్నాడు, పీటర్ జాక్సన్ దర్శకత్వం వహించిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా $6.5 బిలియన్లకు వసూళ్లను రాబట్టాయి .[1]
సర్ పీటర్ జాక్సన్ | |
---|---|
జననం | 1961 అక్టోబర్ 31 న్యూజిలాండ్, |
వృత్తి | దర్శకుడు రచయిత నిర్మాత |
క్రియాశీలక సంవత్సరాలు | 1976 ప్రస్తుతం |
పిల్లలు | 2 |
మీట్ ది ఫీబుల్స్ (1989) సినిమా ద్వారా పీటర్ జాక్సన్ తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. పీటర్ జాక్సన్ తన భాగస్వామి ఫ్రాన్ వాల్ష్‌తో కలిసి ఆస్కార్ అవార్డును పంచుకున్నాడు.[2] ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్ (2003) సినిమాకు గాను పీటర్ జాక్సన్‌కు మూడు అకాడమీ అవార్డులు లభించాయి, వీటిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు విభాగంలో ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. పీటర్ జాక్సన్ కు ఎన్నో అవార్డులు వచ్చాయి, గోల్డెన్ గ్లోబ్, రెండు ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులు నాలుగు సాటర్న్ అవార్డులు పీటర్ జాక్సన్ కు వచ్చాయి.
పీటర్ జాక్సన్ సొంతంగా ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఆ నిర్మాణ సంస్థ పేరు వింగ్‌నట్ ఫిల్మ్స్, ఈ నిర్మాణ సంస్థ ద్వారా పీటర్ జాక్సన్ సినిమాలు నిర్మిస్తూ ఉంటాడు. పీటర్ జాక్సన్ 2002లో న్యూజిలాండ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌కు అవార్డుకు ఎంపికయ్యాడు. 2010 ఏప్రిల్లో వెల్లింగ్‌టన్‌లో జరిగిన ఒక వేడుకలో న్యూజిలాండ్ గవర్నర్ జనరల్ సర్ ఆనంద్ సత్యానంద్ చేతుల మీదగా పీటర్ జాక్సన్ ఈ అవార్డును అందుకున్నాడు. 2014 డిసెంబరులో, పీటర్ జాక్సన్ కు స్టార్ అవార్డు లభించింది.[3]
- ↑ "Top Grossing Director At The Worldwide Box Office". The Numbers. Retrieved 1 January 2020.
- ↑ Barnes, Brooks (30 November 2012). "Middle-Earth wizard's not-so-silent partner". The New York Times.
- ↑ "Peter Jackson gets star on Hollywood Walk of Fame". The New Zealand Herald. 25 November 2014. Retrieved 25 November 2014.