ధనరాజ్ పిళ్ళై (తమిళం: தன்ராஜ் பிள்ளை) (జననం 1968 జూలై 16) ఒక ఫీల్డ్ హాకీ ఆటగాడు మరియు భారత హాకీ జట్టు యొక్క మాజీ సారథి. ప్రస్తుతం ఈయన భారత హాకీ జట్టుకు మానేజర్ గా ఉన్నారు. కన్వర్ పాల్ సింగ్ గిల్ తొలగింపు తర్వాత ఏర్పడిన ఇండియన్ హాకీ ఫెడరేషన్ (భారత హాకీ సమాఖ్య) యొక్క అడ్ హాక్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు.[1]

Dhanraj Pillay
Personal information
Full name Dhanraj Pillay
Playing position Forward
Senior career*
Years Team Apps (Gls)
1992-1993 Indian Gymkhana 78 (78)
1993 HC Lyon
1994-1997 Selangor HA 7 (8)
1997-1999 Abahani Ltd.
2000 HTC Stuttgart Kickers
2000-2001 Bank Simpanan Nasional HC
2002 Arthur Andersen HC
2002 Singapore Hockey Federation
2004 Ernst & Young HC
2005 Telekom Malaysia HC
National team
1989– India 258 (280)
  • Senior club appearances and goals counted for the domestic league only.
† Appearances (Goals).

విషయ సూచిక

వ్యక్తిగత జీవితంసవరించు

ధనరాజ్ మహారాష్ట్రలోని ఖడ్కిలో తమిళులైన నాగలింగం పిళ్ళై మరియు ఆండాళ్ళమ్మలకు నాలుగవ కుమారునిగా జన్మించాడు. ఒక బ్రహ్మచారిగా, అతను పోవైలో ఉన్న సమయంలో అతని తల్లిదండ్రులు మహారాష్ట్రలోని ఖడ్కిలో ఉండేవారు.[2]

అతను తమిళం (మాతృ భాష), హిందీ, మరాఠీ మరియు ఆంగ్ల భాషలు ధారాళంగా మాట్లాడగలడు.

ప్రారంభ జీవితంసవరించు

పిళ్ళై యుక్తవయస్సులో ఆర్డాన్స్ ఫ్యాక్టరీ సిబ్బంది కాలనీలో ఉండేవాడు. అక్కడే అతని తండ్రి క్రీడా ప్రాంగణ నిర్వాహకుడు. తన సోదరులు మరియు ఆ కాలనీలోని స్నేహితులతో కలిసి మెత్తని, మట్టితో కూడిన OFK మైదానంలో ఆడుతూ, అతను విరిగిన కర్రలు మరియు పారేసిన హాకీ బంతులతో తన నైపుణ్యాలకు మెరుగు పెట్టుకున్నాడు. అతను ప్రఖ్యాత ఫార్వర్డ్ ఆటగాడు మరియు తనకు ఆదర్శము అయిన, మహమ్మద్ షాహిద్ శైలిని అనుకరించేవాడు. తన విజయానికి పూర్తి కారణంగా అతను పేర్కొనే అతని తల్లి, కడుపు నిండా తినటానికి సరిపడని జీవనం సాగిస్తున్నప్పటికీ తన ఐదుగురు కుమారులను హాకీ ఆడటానికి ప్రోత్సహించింది.

ఎనభయ్యవ దశకం మధ్యలో, ధనరాజ్ తన అన్న రమేష్ తో కలిసి ఉండటానికి ముంబై వెళ్ళాడు. రమేష్ ముంబై లీగ్ లో RCF తరఫున ఆడుతుండేవాడు. రమేష్ అప్పటికే అంతర్జాతీయ మ్యాచ్ లలో భారతదేశం తరఫున ఆడాడు మరియు అతని నిర్దేశకత్వం ధనరాజ్ కు ఒక సమర్ధుడైన, వేగవంతమైన స్ట్రైకర్ గా వృద్ధి చెందటానికి సహాయం చేసింది. తరువాత అతను మహీంద్రా & మహీంద్రాలో చేరాడు. అక్కడ అతను అప్పటి భారత శిక్షకుడు, జోక్విం కార్వాల్హో వద్ద శిక్షణ పొందాడు.[1]

అరంగేట్రంసవరించు

1989లో ధనరాజ్ పిళ్ళై మొదటిసారి అంతర్జాతీయ హాకీలో రంగ ప్రవేశం చేసాడు. ఆప్పుడే అతను న్యూఢిల్లీలో జరిగిన ఆల్విన్ ఆసియా కప్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు.[3]

అంతర్జాతీయ క్రీడా జీవితంసవరించు

ధనరాజ్ పిళ్ళై, డిసెంబరు 1989 నుండి ఆగస్టు 2004 వరకు క్రీడా జీవితాన్ని కొనసాగించాడు, 339 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. భారతీయ హాకీ సమాఖ్య, చేయబడిన గోల్స్ కొరకు అధికారిక గణాంకములను పొందు పరచదు. ధనరాజ్ చేసిన అంతర్జాతీయ గోల్స్ సంఖ్యపై విశ్వసనీయ సమాచారం లేదు. వాటి సంఖ్య 170 కన్నా ఎక్కువ అని అతను లెక్కించాడు, కానీ ఒక ప్రముఖ హాకీ గణాంకకర్త ఆ సంఖ్య సుమారు 120 అని నొక్కి చెప్పాడు.

ఇతను నాలుగు ఒలంపిక్ లు (1992, 1996, 2000, మరియు 2004), నాలుగు ప్రపంచ కప్ లు (1990, 1994, 1998, మరియు 2002), నాలుగు చాంపియన్ ట్రోఫీలు (1995, 1996, 2002, and 2003), మరియు నాలుగు ఆసియా క్రీడలు (1990, 1994, 1998, మరియు 2002) ఆడిన ఏకైక ఆటగాడు. అతని సారథ్యంలో భారతదేశం ఆసియా క్రీడలు (1998) మరియు ఆసియా కప్ (2003) లలో విజయాన్ని సాధించింది. ఇతను బ్యాంకాక్ ఆసియా క్రీడలలో అత్యధిక గోల్స్ కూడా సాధించాడు మరియు సిడ్నీలో జరిగిన 1994 ప్రపంచ కప్ లో వరల్డ్ ఎలెవన్ పక్షంలో స్థానం పొందిన ఏకైక భారతీయ ఆటగాడు.

క్లబ్ హాకీసవరించు

అతను ఇండియన్ జింఖానా (లండన్), HC లయాన్ (ఫ్రాన్సు), BSN HC & టెలికోం మలేషియా HC (మలేషియా), అభాహని లిమిటెడ్ (ఢాకా) మరియు HTC స్టట్గార్ట్ కిక్కర్స్ (జర్మనీ) వంటి విదేశీ క్లబ్బుల కొరకు కూడా ఆడాడు. ఇతను బ్యాంకాక్ ఆసియన్ గేమ్స్ లో అత్యధిక గోల్స్ సాధించిన వాడు కూడా మరియు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన 1994 హాకీ ప్రపంచ కప్ లో వరల్డ్ ఎలెవన్ పక్షంలో స్థానం పొందిన ఏకైక భారతీయ ఆటగాడు. తన వృత్తి జీవిత చివరి దశలో ధనరాజ్ మరాఠా వారియర్స్ తరఫున రెండు సీజన్లకు ప్రీమియర్ హాకీ లీగ్ లో ఆడాడు.

పురస్కారాలుసవరించు

అతను 1999-2000 సంవత్సరానికి, భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకున్నాడు. 2000 సంవత్సరములో అతను పౌర పురస్కారం అయిన పద్మశ్రీని అందుకున్నాడు. ధనరాజ్ తన శకంలో గొప్ప నైపుణ్యం కలిగిన ఫార్వర్డ్స్ లో ఒకడు. చిన్న చట్రము మరియు పారుతున్న లాక్స్ తో అతను ప్రత్యర్థుల ఎత్తుగడలను మట్టి కరిపించి ప్రతీకారం తీర్చుకోగలడు. అతను 2002 ఆసియా క్రీడలలో గెలుపొందిన హాకీ జట్టు యొక్క విజయ సారథి.[3] జర్మనీలోని కలోన్ లో జరిగిన 2002 చాంపియన్స్ ట్రోఫిలో అతను ఆ టోర్నమెంట్ లో ఉత్తమ ఆటగాడిగా పురస్కారం అందుకున్నాడు.

పిళ్ళై ప్రస్తుతం బొంబాయిలో ఒక హాకీ అకాడమీ ప్రారంభించే ప్రయత్నములలో నిమగ్నమై ఉన్నాడు. తన అకాడమీ కొరకు నిధులు సేకరించటానికి, అతను బొంబాయిలో ఖాళీ ప్లాస్టిక్ ప్రింటర్ కాట్రిడ్జ్ లను సేకరించి వాటిని యూరోపియన్ పునర్వినిమయ (రీసైక్లింగ్) సంస్థకు అమ్మే ఉద్యమాన్ని నడిపిస్తున్నాడు.[4]

వివాదాలుసవరించు

ధనరాజ్ ఎక్కువగా చంచలమైన వాడుగా వర్ణించబడతాడు మరియు అతనికి పలు వివాదములతో సంబంధం ఉంది. పలుమార్లు, అతను హాకీ మానేజ్మెంట్ పై తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కాడు. బ్యాంకాక్ ఏషియాడ్ విజయం తరువాత అతను భారత జట్టుకు ఎంపిక అవలేదు. ధనరాజ్ మరియు ఇంకా ఆరుగురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చామని అధికారికంగా కారణం చెప్పారు. సరైన స్వాగత సన్నాహములు చేయనందుకు మరియు మ్యాచ్ రుసుములు చెల్లించనందుకు మానేజ్మెంట్ పై అతను విరుచుకు పడటానికి, దీనిని ఒక ప్రతీకారంగా ఎక్కువమంది భావించారు. పాకిస్తాన్తో జరిగిన 1998 సీరీస్ కి ముందు అతను విదేశీ యాత్రలకు చెల్లించే అతి తక్కువ వేతనములకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసాడు.[5] ఖేల్ రత్న పురస్కారం అందుకున్న తర్వాత, పిళ్ళై ఈ విధంగా వ్యాఖ్యానించాడు, "ఈ పురస్కారం కొన్ని చేదు జ్ఞాపకాలను చెరిపివేయటానికి సహాయపడుతుంది."[6]

బోంబే హాకీ అసోసియేషన్ దాని కృత్రిక పచ్చిక పట్టును శిక్షణకు ఉపయోగించుకోవటానికి అనుమతి నిరాకరించటంతో, ముంబైలో ఒక హాకీ అకాడమీని ప్రారంభించాలనే అతని ఆలోచనలు కార్యరూపం దాల్చలేదు.[7]

జీవిత చరిత్రసవరించు

"ఫర్గివ్ మీ అమ్మా (మదర్)" అనే పేరుతో ఒక జీవిత చరిత్ర విడుదల అయింది. దాదాపు మూడు దశాబ్దముల అతని క్రీడా జీవితాన్ని గమనించిన పాత్రికేయుడు సుదీప్ మిశ్రా, ఈ పుస్తకాన్ని రచించాడు.[8]

గమనికలు మరియు సూచనలుసవరించు

బాహ్య లింకులుసవరించు