ధనుంజయ గోత్రం
పరిచయము
మార్చుధనుంజయ గోత్రము అనగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజుల ( ఆంధ్ర క్షత్రియులు ) కులంలో నాలుగు గోత్రములలో ఒకటి. ఇతర గోత్రములు ఏవనగా - కౌండిన్య, వశిష్ట, కాస్యప. ఈ గోత్రం ఆర్య క్షత్రియులు, కర్ణాటక రాజులకు, రాజాపూర్ సరస్వతి బ్రాహ్మణులకు, కన్యకుబ్జ బ్రాహ్మణులకు, గౌడ సరస్వతి బ్రాహ్మణులకు కూడా చెందుతుంది. వేలాది సంవత్సరాలుగా ధనుంజయ గోత్రానికి కౌండిన్య, వశిష్ట, కాస్యప గోత్రాలతో వివాహ సంబంధాలు ఉన్నాయి.
చరిత్ర
మార్చుసుప్రసిద్ధ కామకోటి పీటం వారి ప్రకారము ధనుంజయ గోత్రానికి ఋషి ప్రవ్రర ఏమనగా :
- 1. శ్రీమద్వైశ్వామిత్ర మధుచ్చందో ధనుంజయ త్రయార్షేయ ప్రవరాన్విత ధనుంజయ గోత్ర:
- 2. శ్రీమదఘమర్షణ మధుచ్చందో ధనుంజయ త్రయార్షేయ ప్రవరాన్విత ధనుంజయ గోత్ర:
- 3. శ్రీమదాత్రేయ అత్యనానస ధనుంజయ త్రయార్షేయ ప్రవరాన్విత ధనుంజయ గోత్ర:
బ్రహ్మర్షి విశ్వామిత్రుడి తండ్రి యైన గాది చంద్రవంశానికి చెందిన రాజు. కనుక ధనుంజయ గోత్రము చంద్రవంశానికి చెందినదని తెలుస్తున్నది. ఈ గోత్రపు రాజ ప్రవర: భరత్ పరీక్షిత్ విష్ణువర్ధన ప్రవరాన్విత కోట హరిసీమ కృష్ణ మహారాజ వంశ'
ఆంధ్ర దేశములో ధరణి కోటను రాజధానిగా చేసుకుని 400 సంవత్సరాల పాటూ గుంటూరు జిల్లాను పాలించిన ధరణికోట రాజులు ధనుంజయ గోత్రీకులు [1][2] నేడు కోస్తా జిల్లాలలో కనిపించే ఆంధ్ర క్షత్రియులలో ధనుంజయ గోత్రము వారు ధరణికోట రాజుల వంశస్థులు.
గృహనామాలు
మార్చు1. అడ్డాల; 2. ఈపూరి (వీపూరి) ; 3. ఉద్దరాజు; 4. ఉయ్యూరి; 5. ఏటికూరి (వేటికూరి) ; 6. కంకిపాటి; 7. కంతేటి; 8. కమ్మెల (కమ్మెళ్ళ) ; 9. కళ్ళేపల్లి; 10. కాశి; 11. కూనపరాజు; 12. కూసంపూడి (కూచంపూడి) ; 13. కొండూరి; 14. కొక్కెర్లపాటి; 15. కొత్తపల్లి; 16. కొప్పెర్ల; 17. కొలనువాడ 18. కొల్నాటి (కొల్లాటి) ; 19. కొవ్వూరి; 20. గండ్రాజు; 21. గాదిరాజు; 22. గుంటూరి; 23. గూడూరి; 24. గొట్టుముక్కల (గొట్టెముక్కల, గొట్టుముక్కుల) ; 25. గోకరాజు; 26. చంపాటి (చెంపాటి) ; 27. చింతలపాటి; 28. చెరుకూరి; 29. చేకూరి; 30. కోటజంపన 31. జుజ్జూరి; 32. తిరుమలరాజు; 33. తోటకూర (తోటకూరి) ; 34. దండు; 35. దంతులూరి; 36. దాట్ల ; 37. నల్లపరాజు; 38. నున్న; 39. పచ్చమట్ల (పట్సమట్ల) ; 40. పాకలపాటి; 41. పూసంపూడి; 42. పెన్మెత్స (పెనుమత్స) ; 43. భూపతిరాజు; 44. బైర్రాజు; 45. మద్దాల; 46. ముదుండి; 47. రుద్రరాజు; 48. వడ్లమూడి; 49. వానపాల; 50. వేగిరాజు; 51. సాగిరాజు 52.సాకిరాజు 53.వరదరాజు 54. యల్లంరాజు (ఎల్లంరాజు) 55.కుడుపూడి
కర్ణాటక రాజుల్లో ధనుంజయ గోత్రపు గృహనామాలు:
గుంటుమడుగు, చెలమగుంట, కాశి, వడ్లమూడి, వానపాల, నందిమండలం, అరవీటి, రాచకొండ, పాండురాజు,
మూలాలు
మార్చు- ↑ The History of Andhra Country 1000 A.D-1500 A.D by Yashoda Devi, Gyan Publishing House, ISBN 8121204380.
- ↑ Studies in South Indian Jainism, Part II, Andhra karnataka Jainism. Author(s): B.Seshagiri Rao, Ayyangar