శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము

శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అనే చరిత్రకు సంబంధించిన పుస్తకం ప్రముఖ చరిత్రకారుడైన బుద్ధరాజు వరహాలరాజురచించారు.[1]పుస్తకం ప్రారంభ పేజీల్లో ఆంధ్రదేశాన్ని పాలించిన క్షత్రియ సామ్రాజ్యాలు - అనగా విష్ణుకుండిన, కాకతీయ, ధరణికోట, హోయసాల, తూర్పుచాళుక్యులు గురించి, ఆంధ్ర దేశంలో జరిగిన యుద్ధాల గురించి బుద్ధరాజు వరహాలరాజు చక్కగా వివరించారు.

దస్త్రం:వరహాలరాజు గారు వ్రాసినగ్రంథము.jpg
వరహాలరాజు గారు వ్రాసినగ్రంథము

ఆంధ్ర ప్రదేశ్, తమిళ నాడు, కర్నాటక రాష్ట్రాలలో సుమారు తొమ్మిది వందలకు పైగా గ్రామాలను పర్యటించి నేరుగా క్షత్రియ కుటుంబాలను సందర్శించి వారి యొద్ద నుండి వంశ వృక్షాలను సేకరించారు. వశిష్ట, ధనుంజయ, కౌండిన్య, కాశ్యప, రఘుకుల గోత్రాలు, గోత్రాలను బట్టి గృహ నామాలు, ఏ గోత్రాలవారు ఏ సామ్రాజ్యానికి చెందినవారు, గోత్ర సీస మాలికలు, ఏ గృహ నామాలవారు ఏ గ్రామాల్లో ఉన్నారు, ప్రముఖుల వంశ వృక్షాలు వగైరా వివరాలు చక్కగా వివరించారు. ఆత్రేయ, పశుపతి, విశ్వామిత్ర, భరద్వాజ గోత్రీకులైన కర్ణాటక రాజుల వివరాలు మాత్రము ఇందులో పొందుపరచబడలేదు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్రీ శారదా పవర్ ప్రింటింగ్ వర్క్స్ ద్వారా 1973 లో ఈ పుస్తకాన్ని ప్రచురించారు.

ఇంకా చదవండి మార్చు

మూలాలు మార్చు

  1. "రొమాంటిక్ ఐకాన్ హరనాథ్". Sakalam (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-31. Retrieved 2021-12-16.