ధనుష్కోడి

భారతదేశంలోని గ్రామం
(ధనుష్కోటి నుండి దారిమార్పు చెందింది)
  ?ధనుష్కోడి
తమిళనాడు • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 9°09′07″N 79°26′45″E / 9.152011°N 79.445851°E / 9.152011; 79.445851
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 0 మీ (0 అడుగులు)
జిల్లా (లు) రామనాథపురం జిల్లా
కోడులు
ప్రాంతీయ ఫోన్ కోడ్

• +04567

ధనుష్కోడి తమిళనాడు రాష్ట్రములోని తూర్పుతీరమున ఉన్న రామేశ్వరము దీవి యొక్క దక్షిణపు అంచునగల చిన్న గ్రామం. 1964కు ముందు భారతదేశానికి, శ్రీలంకకు వారధి పట్టణముగా ప్రసిద్ధి చెందిన ధనుష్కోడి, ప్రస్తుతం ఒక చిన్న జాలార్ల గ్రామం.

ధనుష్కోడి, పాంబన్ వంతెనకు ఆగ్నేయముగా ఉంది. రామేశ్వరము నుండి ధనుష్కోడి వరకూ ఉన్న రైల్వే లైను 1964లో సంభవించిన పెనుతుఫానులో, ప్రయాణీకులతో సహా కొట్టుకు పోయింది. ఆ తరువాత రైల్వే లైనును పునరుద్ధరించినా, ఆరు పెద్ద ఇసుకతిన్నెలు పట్టాలను కప్పివేయగా దాన్ని ఉపయోగించడం నిలిపివేశారు. ప్రస్తుతం ధనుష్కోడికి సముద్రతీరము వెంట కాలినడకన లేదా ఇసుకతిన్నెలపై జీపు ద్వారా చేరుకోవచ్చు.

ధనుష్కోడిలోని చర్చి యొక్క అవశేషాలు

పూర్వము కాశీ తీర్ధయాత్ర, రామేశ్వరములో పూజచేసి, ధనుష్కోడి వద్ద మహోదధి (బంగాళాఖాతము), రత్నాకర (హిందూ మహాసముద్రము) ల సంగమస్థలంలో పవిత్రస్నానం చేయనిదే పూర్తికాదని భావించేవారు. సేతు ధనుష్కోడి నుండే ప్రారంభమవుతుంది. సంస్కృతములో సేతు అనగా వంతెన. ఇప్పుడు సేతు అనగా రామాయణములో రాముడు లంకను చేరుటకు నిర్మించాడని భావిస్తున్న వారధి అనే ప్రత్యేకార్ధము కూడా వచ్చింది. రామసేతులో ఉపయోగించిన రాళ్లు (నీటిపై తేలే రాళ్లు) ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు వలలో పడతాయి ఇవి. జాగ్రత్తగా తీసుకొచ్చి పర్యాటకులకు అమ్ముతారు వీళ్లు. అమ్మడం, కొనడంపై నిషేధం ఉన్నా.. ధనుష్కోడి దాటిచ్చేస్తారు వీరు.

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు