ధమ్తారి జిల్లా

చత్తిస్గఢ్ లోని జిల్లా
(ధమ్‌తరి జిల్లా నుండి దారిమార్పు చెందింది)

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాలలో ధమ్తారి జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా ధమ్తారి పట్టణం ఉంది. సముద్రమట్టానికి 305 మీటర్ల ఎత్తులో ఉన్న ధమ్తారి జిల్లా వైశాల్యం 2029 చ.కి.మీ. జిల్లా తూర్పు సరిహద్దులో సాత్పురా పర్వతశ్రేణులు ఉన్నాయి. ఈ పర్వతావళిని షివాపహాడ్ అంటారు. జిల్లా ఉత్తర అక్షాంశంలో 20-27 డిగ్రీలు, తూర్పు రేఖాంశంలో 81-33 డిగ్రీలలో ఉంది.

Dhamtari జిల్లా
धमतरी जिला
ఛత్తీస్‌గఢ్ పటంలో Dhamtari జిల్లా స్థానం
ఛత్తీస్‌గఢ్ పటంలో Dhamtari జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
ముఖ్య పట్టణంDhamtari
విస్తీర్ణం
 • మొత్తం2,029 కి.మీ2 (783 చ. మై)
జనాభా
 (2001)
 • మొత్తం7,03,569
 • జనసాంద్రత350/కి.మీ2 (900/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత75.16
Websiteఅధికారిక జాలస్థలి
సీతానది వన్యప్రాణుల అభయారణ్యంలోని అడవి

భౌగోళికం

మార్చు

ధమ్తారి జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో ప్రధానమైనది మహానది. ఈ నదికి ఇప్పటికీ కంకన్నది, చిత్రోత్పల, నీలోత్పల, మందవాహిని, జైరత్ మొదలైన పేర్లు ఉన్నాయి. ఈ నదికి సెందూరు, పైరీ, సొందూరు, జొయన్, ఖరన్, షివ్నాథ్ మొదలైన ఉపనదులు ఉన్నాయి. ఈ నదుల కారణంగా సస్యశ్యామలం అయింది. జిల్లాలో వరి ప్రధానపంటగా ఉంది. మద్యభారతంలో ప్రవహిస్తున్న నదులలో ప్రధానమైనది మహానది. మహానది సిహవా పర్వతాలలో జనించి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతం సముద్రంలో సంగమిస్తుంది.

ఆర్ధికం

మార్చు

ధమ్తారి జిల్లాలో 136 రైస్ మిల్లులు ఉన్నాయి. [1] రవిశంకర్ సాగర్ ఆనకట్ట (గంగ్రెల్ ఆనకట్ట) 570 చ.కి.కీ వ్యవసాయభూములకు నీటిని అందిస్తుంది. అలాగే ఇది రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్, ప్రజలకు, రాయ్‌పూర్‌కు 11 కి.మీ దూరంలో ఉన్న భిలాయ్ స్టీల్ ప్లాంటుకు సురక్షిత త్రాగునీటిని అందించే ప్రధాన వనరుగా ఉంది. ఇక్కడ 10 మె.వా, 1.2మె.వా విద్యుత్తును ఉత్పత్తిచేసే పవర్ ప్లాంట్లు ఉన్నాయి.

  • 1914లో మదంసిల్లి వద్ద నిర్మించిన సిఫెన్ ఆనకట్ట ఆసియాలో మొదటి ఆనకట్టగా గుర్తింపు పొందింది. ఇవి కాక జిల్లాలో సొందూర్ ఆనకట్ట, దుధ్వా ఆనకట్ట మొదలైన ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయి.
  • జిల్లాలో 52% భూభాగంలో అరణ్యాలు ఉన్నాయి. జిల్లాలో ఉష్ణమండల ఉష్ణోగ్రత నెలకొని ఉంది.

[2]

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 799,199, [3]
ఇది దాదాపు. కొమరోస్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. సౌత్ డకోటా నగర జనసంఖ్యకు సమం..[5]
640 భారతదేశ జిల్లాలలో. 485వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 236 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.11%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 1012:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 78.95%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

ధమ్తారి జిల్లా 20°42' ఉ డిగ్రీలు ఉత్తర అక్షాంశం, 81°33' డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. ధమ్తారి జిల్లా రాయ్‌పూర్ జిల్లా భూభాగం నుండి కొంత భూభాగం వేరుచేసి 1998 జనవరి 6 న రూపొందించబడింది. రాయ్‌పూర్ జిల్లా 3 జిల్లాలుగా విడదీయబడింది : రాయ్‌పూర్, మహాసముంద్, ధమ్తారి.

  • ధమ్తారి జిల్లాలో ధమ్తారి, కురుద్, నగరి తాలూకాలు, బ్లాకులుగా ఉన్నాయి.
  • జిల్లావైశాల్యం 2029 చ.కి.మీ. జిల్లా సముద్రమట్టానికి 305 మీ ఎత్తులో ఉంది.
  • జిల్లా ఉత్తర, దక్షిణ సరిహద్దులో రాయ్‌పూర్ జిల్లా, తూర్పు, పశ్చిమ సరిహద్దులలో ఒడిషా రాష్ట్రం ఉంది.
  • ధమ్తారి జిల్లా కాంకేర్, మహాసముంద్ పార్లమెంటు నియోజక వర్గాల మద్య ఉంది.
  • జిల్లాలో 3 శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి : ధమ్తారి, కురుద్, షిహ్వ.

మూలాలు

మార్చు
  1. "Dhamtari Government Website". Retrieved 2006-09-22.
  2. "Dhamtari District NCCR". Archived from the original on 2007-09-28. Retrieved 2006-09-22. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Comoros 794,683 July 2011 est. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. South Dakota 814,180

వెలుపలి లింకులు

మార్చు
  • [1] List of places in Dhamtari

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు