ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా)

తెలంగాణ, జోగులాంబ గద్వాల జిల్లా లోని మండలం
(ధరూర్ మండలం(మహబూబ్ నగర్) నుండి దారిమార్పు చెందింది)

ధరూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1]

ధరూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, ధరూర్ స్థానాలు
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, ధరూర్ స్థానాలు
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, ధరూర్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°18′16″N 77°42′31″E / 16.304323°N 77.708588°E / 16.304323; 77.708588
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జోగులాంబ జిల్లా
మండల కేంద్రం ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా)
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 232 km² (89.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 65,945
 - పురుషులు 33,070
 - స్త్రీలు 32,875
అక్షరాస్యత (2011)
 - మొత్తం 25.86%
 - పురుషులు 36.59%
 - స్త్రీలు 14.97%
పిన్‌కోడ్ 509125

ఇది సమీప పట్టణమైన గద్వాల నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం గద్వాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం ధరూర్.

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 64612. ఇందులో పురుషుల సంఖ్య 32434, స్త్రీల సంఖ్య 32178. అక్షరాస్యుల సంఖ్య 22221.[3]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 232 చ.కి.మీ. కాగా, జనాభా 47,227. జనాభాలో పురుషులు 23,782 కాగా, స్త్రీల సంఖ్య 23,445. మండలంలో 10,240 గృహాలున్నాయి.[4]

మండల చరిత్ర

మార్చు

సా.శ. 1650 ప్రాంతంలో ఐజ మహళ్ తో పాటు, ఈ ధరూర్ మహళ్ ను ముష్ఠిపల్లి వీరారెడ్డి నాడగౌడుగా పరిపాలించాడు[5]. ఇతనికి మగ సంతానం లేకపోవడం చేత పెద్దారెడ్డి అను వ్యక్తిని ఇల్లరికపు అల్లునిగా తెచ్చుకున్నాడు. వీరారెడ్డి అనంతరం పెద్దారెడ్డి ఈ ప్రాంతాలకు నాడగౌడికానికి వచ్చాడు. ఈ కాలంలోనే ఐజ, ధరూర్ లతో పాటు మరికొన్ని ప్రాంతాలు పెద్దారెడ్డి నాడగౌడికం కిందికి చేరాయి.

 
చింతరేవుల ఆంజనేయస్వామి ఆలయం

పూర్వపు పాలమూరు జిల్లా వరప్రధాయిని. జిల్లాలోని అనేక చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులకు జలజీవాన్ని అందిస్తున్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, సాగు, తాగు నీటి కొరకు ఏర్పాటుచేసిన నెట్టెంపాడు ప్రాజెక్టులు ఈ మండలంలోనే ఉన్నాయి. గద్వాల సంస్థాన మూల పురుషులు పాలించిన నేల ఇది. నవాబులకు అలవాలమై వెలిగిన ఉప్పేరు ఈ మండలంలోని ప్రాంతమే. కృష్ణానది ఈ మండలంలో ప్రవహిస్తుంది. పాగుంట, చింతరేవుల వంటి పుణ్యక్షేత్రాలు ఈ మండలంలో ఉన్నాయి. మండలంలోని ఉప్పేరు, గార్లపాడు, ఖమ్మంపాడు, నర్సన్‌దొడ్డి మొదలగు గ్రామాలలో పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టి క్రీ. పూ. 3 వ శతాబ్ది నాటి ఆనవాళ్ళను వెలికితీసింది. మండలంలోని గంగనపల్లి గ్రామానికి చెందిన వెంకట్రావు మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మెన్‌గా పనిచేశాడు.జీవనది లాంటి కృష్ణానది మండలంలో ప్రవహిస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖ తన నివేదికలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో కంటే ధరూర్ మండలంలో అత్యధికంగా 39.2 మీటర్లలోకి భూగర్భజలాలు పడిపోయాయని నివేదిక ఇవ్వడం మండలానికి చెందిన భౌగోళికపర విషాదం[6].

మండలం ఉనికి

మార్చు

ధరూర్ మండలానికి తూర్పున గద్వాల మండలం, దక్షిణాన గట్టు మండలం, ఉత్తరాన ఆత్మకూర్, నర్వ మండలాలు, ఆగ్నేయాన మల్దకల్ మండలం, పశ్చిమాన కర్నాటకలోని రాయచూరు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

మండల రాజకీయాలు

మార్చు

ధరూర్ మండల పరిషత్ చైర్‌పర్సన్‌గా ధరూర్ గ్రామానికి చెందిన శాంతి ఎన్నికైంది.. ఈమె మండల మాజీ జడ్పిటిసీ సభ్యుడు కర్రెన్న కోడలు. జాంపల్లి గ్రామానికి చెందిన పద్మ మండల జడ్పిటిసీ సభ్యురాలుగా ఎన్నికైంది..

3 వ శతాబ్ధి ఆనవాళ్ళు

మార్చు

ధరూర్ మండలంలో ఉప్పేరు, గార్లపాడు, ఖమ్మంపాడు, నర్సన్‌దొడ్డి మొదలగు గ్రామాలలో పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టి, కొన్ని శ్మశాన వాటికలను కనిపెట్టింది. నాలుగు పెద్ద గోతులను కనుగొన్నారు. ముతక బండలను చుట్టూ పేర్చిన సమాధులను బయల్పరిచారు. దారులకు శుద్ధి చేసిన గ్రానైట్ పలకలు పరిచి ఉండటాన్ని గమనించారు. ఒక గోతి కుటుంబ సమాధి గుంతగా తేల్చారు. అందులో అంత్యక్రియల వస్తువులు ఉన్నాయని చెప్పారు. ఈ వస్తువులు మూడు స్తరాల (పొరల)లో, మూడు వేరు వేరు కాలాలకు చెందినవిగా గుర్తించారు. మరొక గుంతలలో ఉత్తర, దక్షిణ అభిముఖాలుగా ఉన్న పెద్దల అస్తిపంజరాలను కనుగొన్నారు. నలుపు, ఎరుపు రంగు మట్టిపాత్రలు, ఎరుపు రంగు పూత పూసిన నలుపు పాత్రలు, బ్లేడులు, ఉలులు, కత్తులు వంటి ఇనుప వస్తువులు ఉన్నాయి. కొన్ని మట్టి పాత్రలపై బ్రహ్మీ లిపిలోని 'మా' వంటి అక్షరాన్ని గుర్తించారు. ఇది సా.శ. పూ. 3 వ శతాబ్ది నాటిదని తేల్చారు[7].

సమీప రైల్వే స్టేషన్లు

మార్చు
 
స్టేషను

మండలం లోని ప్రధాన ఆరోగ్య కేంద్రాలు

మార్చు

మండలం లోని దేవాలయాలు

మార్చు
 
శ్రీపాగుంట వేంకటేశ్వరస్వామి దేవాలయం (ఎడమ నుండి)

మండలం లోని పర్యాటక ప్రాంతాలు

మార్చు
 
ర్యాలంపాడు రిజర్వాయర్

ఉన్నత పాఠశాలలు ఉన్న గ్రామాలు

మార్చు

మండల రక్షకభట నిలయాలు

మార్చు

మండలం లోని గ్రామాలు

మార్చు
 
ప్రాథమికోన్నత పాఠశాల, భీంపురం

రెవెన్యూ గ్రామాలు

మార్చు

అనుబంధ గ్రామాలు

మార్చు

మండలం లోని తండాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  5. సమగ్ర ఆంధ్ర సాహిత్యం,12 వ సంపుటం, కడపటిరాజుల యుగం,రచన:ఆరుద్ర, ఎమెస్కో, సికిందరాబాద్,1968, పుట-48
  6. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్, పుట-5 తేది.21.09.2014
  7. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర - సంస్కృతి, సంపాదకులు: ఎం.ఎల్.కె. మూర్తి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం ప్రచురణలు-2008, పుట-127

వెలుపలి లింకులు

మార్చు