ధీర 2024లో తెలుగులో విడుదలైన సినిమా. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌‌పై పద్మావతి చదలవాడ నిర్మించిన ఈ సినిమాకు విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. లక్ష్ చదలవాడ, సోనియా భన్సాల్, నేహా పఠాన్‌ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2024 జనవరి 26న విడుదల చేసి[1], సినిమాను 2024 ఫిబ్రవరి 2న విడుదల చేశారు.[2][3]

ధీర
దర్శకత్వంవిక్రాంత్ శ్రీనివాస్
రచనవిక్రాంత్ శ్రీనివాస్
నిర్మాతపద్మావతి చదలవాడ
తారాగణం
  • లక్ష్ చదలవాడ
  • సోనియా భన్సాల్
  • నేహా పఠాన్‌
ఛాయాగ్రహణంకన్నా పీ.సి
కూర్పువినయ్ రామస్వామి వీ
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర
విడుదల తేదీ
2024 ఫిబ్రవరి 2 (2024-02-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

వైజాగ్ లో రణధీర్ అలియాస్ ధీర (లక్ష్ చదలవాడ) వాహన డ్రైవర్. డబ్బుకోసం ఏ పని అయినా చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో రాజ్ గురు అనే కోమా పేషంట్‌ ని హైదరాబాద్‌ కి తరలిస్తే రూ. 25 లక్షలు ఇస్తామని ఆఫర్ వస్తుంది. రణధీర్ ఒప్పుకుని ఆ పేషంట్‌ ని తీసుకుని అంబులెన్స్ లో బయల్దేరతాడు. అదే అంబులెన్స్ లో అతడి మాజీ ప్రేయసి డాక్టర్ అమృత (నేహా పఠాన్) పేషంట్‌, మరో డాక్టర్‌గా మిర్చి కిరణ్‌ వస్తాడు. వైజాగ్ నుంచి అంబులెన్స్ లో ఆ పేషంట్ ని తీసుకెళ్తుండగా చాలా మంది రణధీర్ ని వెంబడించి ఆ పేషంట్ ని చంపాలని చూస్తారు. అసలు ఆ పేషంట్ ఎవరు ? పేషంట్ ని సేఫ్ గా చేరిస్తే 25 లక్షలు ఎందుకు ఇస్తున్నారు ? ఆ పేషంట్ కోసం అంతమంది ఎందుకు వెనక పడుతున్నారు? రాజ్ గురు ఎవరు ? వాళ్లందరితో డాక్టర్ అమృతకు ఏంటి సంబంధం ? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు మార్చు

  • లక్ష్ చదలవాడ
  • సోనియా భన్సాల్
  • నేహా పఠాన్‌
  • మిర్చి కిరణ్
  • హిమజ
  • నవీన్ నేని
  • భరణి శంకర్
  • సామ్రాట్
  • బాబీ బేడి
  • వైవా రాఘవ్
  • భూషణ్
  • మేక రామకృష్ణ
  • సంధ్యారాణి

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్:శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర
  • నిర్మాత: పద్మావతి చదలవాడ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:విక్రాంత్ శ్రీనివాస్
  • సంగీతం: సాయి కార్తీక్
  • సినిమాటోగ్రఫీ: కన్నా పీ.సి
  • ఎడిటర్: వినయ్ రామస్వామి వీ

మూలాలు మార్చు

  1. 10TV Telugu (27 January 2024). "'ధీర' ట్రైలర్ చూశారా? 25 లక్షల నుంచి 2500 కోట్ల వరకు జర్నీ." (in Telugu). Archived from the original on 5 February 2024. Retrieved 5 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. NTV Telugu (10 January 2024). "ఫిబ్రవరి 2న లక్ష్ చదలవాడ 'ధీర'". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
  3. Eenadu (31 January 2024). "ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?". Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
  4. Sakshi (2 February 2024). "'ధీర' మూవీ రివ్యూ". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ధీర&oldid=4141004" నుండి వెలికితీశారు