హిమజ తెలుగు టెలివిజన్, చలనచిత్ర నటి.[2] భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం..కొంచెం కష్టం వంటి సీరియల్స్ ద్వారా గుర్తింపుపొందిన ఈవిడ శివమ్ సినిమా ద్వారా చలనచిత్రరంగంలోకి అడుగుపెట్టింది.[3] స్టార్ మాలో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని 63వ రోజు ఎలిమినేట్ అయింది.[4]

హిమజ
జననం
హిమజ మల్లిరెడ్డి

(1990-11-02) 1990 నవంబరు 2 (వయసు 33)[1]
వృత్తిటెలివిజన్, చలనచిత్ర నటి
క్రియాశీల సంవత్సరాలు2013-ప్రస్తుతం
తల్లిదండ్రులుచంద్రశేఖర్‌రెడ్డి , రాజ్య లక్ష్మి

హిమజ 1990, నవంబర్ 2న విజయవాడలో జన్మించింది.[5]

సినీరంగ ప్రస్థానం

మార్చు

హిమజ నాన్న చంద్రశేఖర్‌రెడ్డిషిర్డీ సాయిబాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన సర్వాంతర్యామి టెలిఫిల్మ్‌కు మాటలు, పాటలు రాశాడు. దాంతో హిమజ ఇంటర్‌మీడియట్‌లో ఉన్నప్పుడే ‘సర్వాంతర్యామి’ టెలిఫిల్మ్‌లో నటించింది. డిగ్రీ పూర్తయిన తరువాత కొన్నిరోజులు సామాజిక శాస్త్రాన్ని బోధించే టీచర్ గా, హెచ్‌.ఆర్‌.గా ఉద్యోగాలు చేసింది. అటుతరువాత టెలివిజన్ రంగంలోకి ప్రవేశించి భార్యామణి, స్వయంవరం మొదలైన ధారావాహికల్లో నటించిన హిమజకు కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్‌ గుర్తింపునిచ్చింది. కొన్ని సీరియల్స్‌లో చేశాక సినిమాల్లోకి వచ్చింది. శివమ్ చిత్రంలో తొలిసారిగా రాశి ఖన్నాకు స్నేహితురాలిగా నటించింది. ఆ తర్వాత నేను శైలజ, చందమామరావే, జనతా గ్యారేజ్, ధృవ, శతమానంభవతి సినిమాల్లో నటించింది.[3][6]

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2015 శివమ్ రిషి తెలుగు
2016 నేను శైలజ తెలుగు
చుట్టాలబ్బాయి హిమజ తెలుగు
ధృవ తెలుగు
2017 మహానుభావుడు తెలుగు
శతమానం భవతి సుబ్బలక్ష్మి తెలుగు
స్పైడర్ రేణుకా తెలుగు/తమిళ్
ఉన్నది ఒకటే జిందగీ కనుక తెలుగు
నెక్స్ట్ నువ్వే దెయ్యం తెలుగు
వేట కొడవళ్ళు తెలుగు
2020 అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి తెలుగు
2021 వైష్ణవి తెలుగు
కనబడుటలేదు తెలుగు
2022 టెన్త్ క్లాస్ డైరీస్ నాగలక్ష్మి తెలుగు
2023 మాయాపేటిక తెలుగు
2024 ధీర తెలుగు

టీవిరంగం

మార్చు
సంవత్సరం సీరియల్ పేరు పాత్రపేరు ఛానల్ భాష
2013 స్వయంవరం సంధ్య జెమినీ టీవీ తెలుగు
2014-2016 కొంచెం ఇష్టం..కొంచెం కష్టం రేవతి జీ తెలుగు తెలుగు

టీవి కార్యక్రమాలు

మార్చు
సంవత్సరం కార్యక్రమం పాత్రపేరు ఛానల్ భాష ఎలిమినేట్ ఇతర వివరాలు
2019 బిగ్ బాస్ తెలుగు 3 పోటీదారురాలు మాటీవి తెలుగు Day 63 రియాలిటీ టీవి సిరీస్

మూలాలు

మార్చు
  1. "Telugu television actress Himaja". Nettv4u.com. Retrieved 20 July 2020.
  2. "Himaja to debut in Tollywood". The Times of India. 8 January 2015. Retrieved 20 July 2020.
  3. 3.0 3.1 ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి, తారలతో ముచ్చట్లు (4 April 2017). "గదిలోకి వెళ్లగానే చాలా సీరియస్‌గా ఉండిపోయేదాన్ని: హిమజ". Archived from the original on 17 మే 2017. Retrieved 20 November 2017.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
  4. "Small screen scorchers of 2019 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 20 July 2020.
  5. "Bedroom". The Times of India (in ఇంగ్లీష్). 2019-07-22. Retrieved 20 July 2020.
  6. సాక్షి (14 January 2017). "కొంచెం ఇష్టం...కొంచెం కష్టం వల్లే: హిమజ". Retrieved 19 November 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=హిమజ&oldid=4100949" నుండి వెలికితీశారు