ధేమాజి

అసోం రాష్ట్రంలోని ధేమాజి జిల్లాకు, జిల్లా ప్రధాన కేంద్రం.
(ధెమాజి నుండి దారిమార్పు చెందింది)

ధెమాజి, అసోం రాష్ట్రంలోని ధెమాజి జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.

ధెమాజి
పట్టణం
ధెమాజి is located in Assam
ధెమాజి
ధెమాజి
భారతదేశంలోని అసోంలో ప్రదేశం ఉనికి
ధెమాజి is located in India
ధెమాజి
ధెమాజి
ధెమాజి (India)
Coordinates: 27°29′N 94°35′E / 27.48°N 94.58°E / 27.48; 94.58
దేశం భారతదేశం
రాష్ట్రంఅసోం
Government
 • Bodyధెమాజి పట్టణ కమిటి
Area
 • Total3.5 km2 (1.4 sq mi)
Elevation
91 మీ (299 అ.)
Population
 (2011)
 • Total12,816
భాషలు
 • అధికారికఅస్సామీ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
787057
ISO 3166 codeIN-AS
Vehicle registrationఏఎస్ 22
స్త్రీ పురుష నిష్పత్తి1000:915 (మగ/ఆడ)

పద వివరణ మార్చు

ధెమాజి పదం దేయోరి భాషలోని దేమా-జి నుండి వచ్చింది, ధెమాజి అంటే గొప్ప నీరు (వరద పీడిత ప్రాంతమని) అని అర్థం.[1]

భౌగోళికం మార్చు

27°29′N 94°35′E / 27.48°N 94.58°E / 27.48; 94.58 అక్షాంక్షరేఖాంశాల మధ్య ఈ పట్టణం ఉంది.[2] దీని సగటు ఎత్తు 91 మీటర్లు (298 అడుగులు) గా ఉంది. బ్రహ్మపుత్రా నదికి ఉత్తరాన ఉన్న ఈ ధెమాజి పట్టణానికి ఉత్తరాన అరుణాచల్ హిమాలయాలు, తూర్పున అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమాన అస్సాం రాష్ట్ర లఖింపూర్ జిల్లా ఉంది. ఈ పట్టణం మీదుగా జియాధల్, గైనోడి, దిఖారి, డిహాంగ్, డిమో, సిమెన్ వంటి నదులతోపాటు ఇతర నదులు కూడా ప్రవహిస్తున్నాయి. సుబన్సిరి నది పట్టణ పశ్చిమ సరిహద్దు ద్వారా ప్రవహిస్తోంది.

చరిత్ర మార్చు

ప్రస్తుతమున్న జిల్లా ప్రాంతాన్ని 400 సంవత్సరాలపాటు చుటియా రాజులు పాలించారు. గతకాలపు రాజధానికి సంబంధించిన శిథిలాలు ఇప్పటికీ ఈ పట్టణంలో కనిపిస్తుంటాయి. అహోం రాజులు నిర్మించిన గుగుహ డోల్, మా మణిపురి దాన్, పాడుమణి వంటి అనేక స్మారక చిహ్నాలు ఇక్కడ చూడవచ్చు.

1989, అక్టోబరు 14న లఖింపూర్ జిల్లా నుండి ధెమాజి విడిపోయి పూర్తిస్థాయి జిల్లాగా మారింది.[3]

జనాభా మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, [4] ధెమాజి పట్టణ జనాభా 12,816 గా ఉంది. ఇందులో పురుషులు 51% మంది, స్త్రీలు 49% మంది ఉన్నారు. ధెమాజి సగటు అక్షరాస్యత రేటు 92% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత 94%, స్త్రీ అక్షరాస్యత 89%గా ఉంది. ఈ మొత్తం జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

రవాణా మార్చు

జాతీయ రహదారి 15 ధెమాజి పట్టణం మీదుగా వెళుతోంది. మరో జాతీయ రహదారి 515 కులాజన్, సిలాపాథర్ వద్ద జాతీయ రహదారి 15ను విడిపోయి పసిఘాట్ వద్ద జోనై, సిలాపాథర్ గుండా వెళుతుంది. రంగియా రైల్వే డివిజన్ కు చెందిన ధెమాజి రైల్వే స్టేషన్ దాని బ్రాడ్-గేజ్ రైలు ద్వారా పట్టణంలో సేవలు అందిస్తోంది. గౌహతి, ముర్కాంగ్సెలెక్, టిన్సుకియాకు పలు రైళ్ళు నడుస్తున్నాయి. ధెమాజికి 66 కిలోమీటర్ల దూరంలో ఉత్తర లఖింపూర్ సమీపంలో ఉన్న లీలబరి విమానాశ్రయం, 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిబ్రుగర్ సమీపంలో మోహన్బరి విమానాశ్రయం ఉన్నాయి. బ్రహ్మపుత్రపై ఉన్న బోగిబీల్ వంతెన ధెమాజిని రోడ్డు, రైలు మార్గాల ద్వారా దిబ్రుగర్ పట్టణంతో కలుపుతోంది. దీనిని 2018, డిసెంబరు 25న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించాడు.

రాజకీయాలు మార్చు

ధెమాజి పట్టణం లఖింపూర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.[5] ధెమాజి జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు (ధెమాజి, జోనాయ్) ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన సర్బానంద సోనోవాల్ అస్సాం ముఖ్యమంత్రి అయ్యేవరకు 2016, మే నెలవరకు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు.[6] భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రదాన్ బారువా ప్రస్తుత లఖింపూర్ లోక్‌సభ నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడిగ ఉండగా, జోనాయ్ కు భుబోన్ పెగు స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్నాడు. తకామ్ మిసింగ్ పోరిన్ కేబాంగ్, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, అసోమ్ జతియాతాబాడీ యువ చరా పరిషత్, ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆల్ తాయ్ అహోమ్ స్టూడెంట్స్ యూనియన్, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్,, క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి మొదలైనవి ఇక్కడ ప్రజాదరణ పొందాయి.

మూలాలు మార్చు

  1. Brown, W.B. An Outline of the Deori-Chutia language. Assam secretariat printing office,1895, p. 70.
  2. Falling Rain Genomics, Inc - Dhemaji
  3. Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2020-11-19.
  4. "Census of India 2001: Data from the 2011 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2020-11-19.
  5. "List of Parliamentary & Assembly Constituencies" (PDF). Assam. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 2020-11-19.
  6. "ECI". Archived from the original on 2018-08-20. Retrieved 2020-11-19.

ఇతర లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ధేమాజి&oldid=4149425" నుండి వెలికితీశారు