నందిగం సురేష్ బాబు

(నందిగం సురేష్‌బాబు నుండి దారిమార్పు చెందింది)

నందిగం సురేష్‌బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచాడు.[2]

నందిగం సురేష్

లోక్‌సభ సభ్యుడు [1]
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019
ముందు మాల్యాద్రి శ్రీరాం
తరువాత తెన్నేటి కృష్ణప్రసాద్
నియోజకవర్గం బాపట్ల

వ్యక్తిగత వివరాలు

జననం (1976-06-15) 1976 జూన్ 15 (వయసు 48)
ఉద్దండరాయనిపాలెం, తుళ్లూరు మండలం గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు నందిగం పౌలు, సంతోషమ్మ
జీవిత భాగస్వామి బేబిలత
సంతానం ప్రిన్సి, గ్లోరి సురేఖ
నివాసం బాపట్ల

జననం, విద్యాభాస్యం

మార్చు

నందిగం సురేష్‌బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా , తుళ్లూరు మండలం , ఉద్దండరాయనిపాలెం గ్రామంలో 15జూన్ 1976లో నందిగం పౌలు, సంతోషమ్మ దంపతులకు జన్మించాడు. వారిది వ్యవసాయ కుటుంబం. ఆయన మందడం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 1992లో పదవ తరగతి పూర్తి చేశాడు.[3]

రాజకీయ జీవితం

మార్చు

నందిగం సురేష్‌బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సామాన్య కర్యకర్తగా నిబద్ధతతో పార్టీ బలోపేతానికి కృషి చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో అధికార పార్టీ నాయకులు పంట పొలాలను తగుబెట్టిన విషయంలో పార్టీ తరఫున, రైతాంగానికి అండగా నిలిచి అనేక కార్యక్రమాలు నిర్వహించాడు. ఆయన నిబద్ధతకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సురేష్‌బాబు కు బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాడు. సురేష్‌బాబు 2019లో జరిగిన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగు దేశం పార్టీ అభ్యర్థి మాల్యాద్రి శ్రీరాం పై 16 065 ఓట్ల మెజారిటీతో గెలిచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5]

మూలాలు

మార్చు
  1. Lok Sabha (2019). "Suresh Nandigam". Archived from the original on 17 జనవరి 2022. Retrieved 17 January 2022.
  2. Sakshi. "Bapatla sc Constituency Winner List in AP Elections 2019 | Bapatla sc Constituency Lok Sabha Election Results". www.sakshi.com. Archived from the original on 7 June 2021. Retrieved 7 June 2021.
  3. Sakshi (5 April 2019). "తాడికొండతో...తరాల అనుబంధం". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.
  4. The Times of India (27 May 2019). "YSRC opens doors of Parliament for banana farmer, teacher and ex-cop | Vijayawada News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 7 June 2021. Retrieved 7 June 2021.
  5. Sakshi (26 May 2019). "ఆ నిబద్ధతే 'నందిగం'ను ఎంపీని చేసింది." Sakshi. Archived from the original on 7 June 2021. Retrieved 7 June 2021.