నందిని నర్సింగ్‌హోం

నందిని నర్సింగ్‌హోం 2016లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రముఖ తెలుగు నటుడు నరేష్ కుమారుడు విజయ నవీన్ కృష్ణ ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమా రంగప్రవేశం చేశాడు.

నందిని నర్సింగ్‌హోం
నిర్మాతరాధా కిషోర్
భిక్షమయ్య
తారాగణంనవీన్
నిత్య
శ్రావ్య
షకలక శంకర్
జయప్రకాష్ రెడ్డి
వెన్నెల కిషోర్[1]
ఛాయాగ్రహణందాశరధి శివేంద్ర
సంగీతంఅచ్చు రాజమణి, శేఖర్ చంద్ర
విడుదల తేదీ
21 అక్టోబరు 2016
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

చంద్రశేఖర్ అలియాస్ చందు (నవీన్ విజయ్ కృష్ణ) ఎం.కామ్ చదివి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతుంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తాను ఎంబీబీఎస్ చదివానని చెప్పుకుని నందిని నర్సింగ్ హోం అనే హాస్పిటల్లో వైద్యుడిగా చేరతాడు. అక్కడ కాంపౌండర్ గా పని చేసే స్నేహితుడి సాయంతో ఎలాగోలా నెట్టుకొస్తుంటాడు. ఆ హాస్పిటల్ యజమాని అయిన నందిని (నిత్య) అతణ్ని ఇష్టపడుతుంది. ఐతే గతంలో అమూల్య (శ్రావ్య) అనే అమ్మాయితో ప్రేమలో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నందినికి కొంచెం దూరంగా ఉంటాడు చందు. ఇదిలా ఉంటే చందు చేసిన తప్పిదం కారణంగా ఒక ప్రాణమే పోతుంది. దీనికి తోడు నందిని నర్సింగ్ హోంలో కొన్ని అనూహ్య పరిణామాలు జరుగుతాయి. ఇంతకీ చందు ఏం తప్పు చేశాడు.. హాస్పిటల్లో తెర వెనుక ఏం జరుగుతుంటుంది.. అమూల్యతో అతడి గతమేంటి.. నిత్యతో చందు వ్యవహారం ఎక్కడిదాకా వెళ్లింది.. అన్నది మిగతా కథ.[2]

నటవర్గం మార్చు

  • నవీన్ విజయ్ కృష్ణ (తొలి పరిచయం)
  • నిత్య
  • బుదిరి తల్లి బుదిరేష్
  • శ్రావ్య
  • జయప్రకాష్
  • సంజయ్ స్వరూప్
  • వెన్నెల కిషోర్
  • షకలక శంకర్
  • సప్తగిరి తదితరులు

సాంకేతికవర్గం మార్చు

  • సంగీతం: అచ్చు
  • ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర
  • నిర్మాతలు: రాధాకిషోర్-బిక్షమయ్య
  • కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పి.వి.గిరి

మూలాలు మార్చు

  1. http://www.greatandhra.com/movies/reviews/nandini-nursing-home-review-boredom-77654.html
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-10-24. Retrieved 2016-10-24.

బయటి లింకులు మార్చు