విజయ నరేష్

సినీ నటుడు, రాజకీయ నాయకుడు

విజయ నరేష్ లేదా నరేష్ ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు. ఇతను ప్రముఖ నటి విజయ నిర్మల కుమారుడు. అనేక తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

విజయ నరేష్
Vijay naresh.jpg
నరేష్
జన్మ నామంనరేష్ కృష్ణమూర్తి
జననం (1960-01-20) 1960 జనవరి 20 (వయస్సు: 60  సంవత్సరాలు)
ప్రముఖ పాత్రలు నాలుగు స్తంభాలాట
శ్రీవారికి ప్రేమలేఖ
చిత్రం భళారే విచిత్రం

నేపథ్యముసవరించు

బాలనటుడిగా 1972లో పండంటి కాపురం చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. 1982 లో ఇతని తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో ప్రేమ సంకెళ్ళు చిత్రంలో కథానాయకుడిగా నటించాడు, కానీ ఆ చిత్రం విజయవంతం కాలేదు. తర్వాతి కాలంలో అనేక హాస్య ప్రధాన చిత్రాలలో నటించి నటుడిగా మంచిపేరు తెచ్చుకున్నాడు. ఇతను కథానాయకిడిగా నటించిన చిత్రం జంబలకిడి పంబ తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన హాస్యచిత్రంగా నిలిచింది. కొద్దికాలంగా సహాయ పాత్రలను పోషిస్తున్నాడు. ప్రతినాయక పాత్రలను కూడా పోషించనున్నట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 2019 మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో అంతకు మునుపు అధ్యక్షుడైన శివాజీ రాజా మీద 69 ఓట్ల ఆధిక్యంతో గెలిచి అధ్యక్షుడయ్యాడు.[1]

వ్యక్తిగత జీవితముసవరించు

ఇతని వివాహము మూడుసార్లు జరిగింది. మొదటి సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించిన తర్వాత మనస్ఫర్ధల కారణంగా విడిపోయారు. తర్వాత రెండో పెళ్ళి చేసుకున్నాక అది కూడా విడాకులవరకు వచ్చింది. 50 ఏళ్ళ వయస్సులో ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకుడు అయిన రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను 2010 డిసెంబరు 3 న హిందూపురంలో వివాహం చేసుకున్నాడు.ముగ్గురు కొడుకులు.[2][3]

రాజకీయ జీవితముసవరించు

1990 వ దశకంలో రాజకీయ అనిశ్చితి వల్ల వాజ్‌పేయి ప్రభుత్వం కేవలం పదమూడు రోజులో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సమయంలో వాజపేయి ప్రసంగానికి ఉత్తేజితుడై భారతీయ జనతా పార్టీలో చేరి కొంతకాలం చురుకైన పాత్ర పోషించాడు. యువ నాయకుడి నుంచి రాష్ట్ర జనరల్ సెక్రటరీ స్థాయికి ఎదిగాడు. 2009లో పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తరువాత బిజెపిని వదిలిపెట్టాడు.

నటించిన చిత్రాల పాక్షిక జాబితాసవరించు

మూలాలుసవరించు

  1. "'మా' అధ్యక్షుడిగా నరేష్‌". 12 March 2019. మూలం నుండి 12 March 2019 న ఆర్కైవు చేసారు. Cite news requires |newspaper= (help)
  2. http://www.cinejosh.com/ap-telugu-gossips/4/7198/senior-hero-naresh-naresh-marriage-with-ramya-jandhyala-actor-naresh-character-artist-naresh-bjp-leader-naresh-.html
  3. నటుడు నరేష్ పేరుకు ముందు విజయ[permanent dead link]
  4. సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. మూలం నుండి 19 జనవరి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 19 January 2020. Cite news requires |newspaper= (help)
  5. ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడ‌వురా". మూలం నుండి 19 January 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 19 January 2020. Cite news requires |newspaper= (help)
  6. సాక్షి, సినిమా (24 January 2020). "'డిస్కో రాజా' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. మూలం నుండి 25 జనవరి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 24 January 2020. Cite news requires |newspaper= (help)
  7. ఈనాడు, సినిమా (24 January 2020). "రివ్యూ: డిస్కోరాజా". మూలం నుండి 25 జనవరి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 24 January 2020. Cite news requires |newspaper= (help)

బయటి లంకెలుసవరించు