నందివాడ బాలయోగి

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం నందివాడ అనే చిన్న పల్లెటూరు ఉంది.ఆ గ్రామంలో పుట్టిన శ్రీ పిసిసి సత్యం, సూరమ్మ దంవతులకు మొత్తం 11 మంది సంతానం.దైవభక్తి పరులైన ఆ పుణ్య దంపతులకు సంతానంలో సప్తమ గర్బవాసునిగా ఆదినారాయణ జన్మించాడు.అతడే మన నందివాడ బాలయోగి.తల్లిదండ్రులు బాలుడికి ఆదినారాయణ అను నామకరణం చేయుటకు పూర్వం తల్లి సూరమ్మకు తాను గర్బవతిగా ఉండగా ఒకనాడు స్వప్నంలో శ్రీ వైకుంఠవాసుడైన శ్రీ మన్నారాయణుడు శంఖు, చక్రగదాదారియై అభయహస్తంతో ఓ బాలుని రూపమున ఆ పుణ్యవతి గర్భమున జన్మించినట్లు శుభస్వప్నం కలిగింది.

తదుపరి శ్రీ జయనామ సంవత్సరం ఆషాఢ శుక్ల సప్తమీ బుధవారం హస్తా నక్షత్రం అనగా 7-7-1954 వ సంవత్సరమున పుత్ర జననమైనది.ఈ కారణంగా బాలునికి ఆదినారాయణ అని నామకరణం చేసారు. ఆదీనారాయణ తన 16వ ఏట ఒక మహాశివరాత్రి పర్వధినమున శ్రీ ముమ్మిడివరం బాలయోగీశ్వరులవారిని దర్శించిన పిదప దైవ సంకల్పంతో తనలో అనూహ్యమైన మార్పు కలిగి దృఢ సంకల్పంతో తన స్వగ్రామమైన నందివాడ చేరి అదే సంవత్సరమున 1975న శ్రీ రామనవమి పర్వధినమున తపస్సునకు కూర్చుండిరి.నాటి నుండి నేటి వరకు అఖండముగా తపస్సు కొనసాగించుచున్నారు. ప్రతి యేటా మహాశివరాత్రి, ఆ మరుసటి రోజు భక్తుల కోరిక మీర భక్తకోటికి దర్శనం యిస్తున్నారు.

మూలాలు

మార్చు

[1]

ఇతర లింకులు

మార్చు
  1. nandivada, balayogi. "Nandivada Balayogi Asramam". templesofindia.org (in ఇంగ్లీష్). Archived from the original on 2022-01-31. Retrieved 2022-01-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)