పొందూరు

ఆంధ్ర ప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలం లోని జనగణన పట్టణం

పొందూరు (Ponduru), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం.[1] పొందూరు శ్రీకాకుళం నకు 20 కి.మీ దూరంలో ఉంది. ఖద్దరు, హస్తకళలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. భారతదేశంలో ఖాదీ వస్త్ర ప్రియులకు యిష్టమైన ఖద్దరును తయారుచేసే ప్రాంతం పొందూరు.

పొందూరు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వేలో హౌరా, చెన్నై మార్గంలో ఉంది. ఇచ్చట కంప్యూటరీకరణ కలిగిన ఉప తపాలా కార్యాలయం ఉంది. పొందూరునకు 7 కి.మీ దూరంలో బాలయోగీశ్వరస్వామి ఆశ్రమం ప్రసిద్ధి చెందింది.

గణాంకాలుసవరించు

2011 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా - మొత్తం 73,890 - పురుషులు 37,197 - స్త్రీలు 36,693

పొందూరు ఖద్దరుసవరించు

పొందూరు చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఒకవిధమైన చేప దంతాలతో ప్రత్తిని శుభ్రం చేసి దానిని రాట్నాలను ఉపయోగించి దారాన్ని తీస్తారు. ఈ దారాలనుపయోగించి మగ్గాలపై ఖద్దరు బట్టలను నేస్తారు. పొందూరు ఖద్దరు భారత దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని గుర్తు చేస్తుంది. మహాత్మా గాంధీ కూడా పొందూరుకు చెందిన ఖద్దరును యిష్టపడే వారు. పొందూరు ఖాదీ దేశమంతటా ఖాదీ బట్టలు వేసుకునే వారికి ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో దేవాంగ, పట్టుశాలి, నాగవంశం అనే కులాలు ముఖ్యమైనవి. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి చేనేత. ప్రత్తిని శుభ్రం చేసి రాట్నాలతో దారాన్ని తీసి మగ్గాలపై చక్కని ఖద్దరు వస్త్రాలను నేస్తారు. మగ్గాల తోనేకాక యంత్రపరికరాలు, మరమగ్గాల ఆధారంగా ఖద్దరు ఇతర రకాల నేతలు నేయు నేతగాళ్ళు కలరు. అమెరికా, స్వీడన్ వంటి దేశాలకు ఎగుమతులు కూడా జరుగుతాయి

ప్రముఖులుసవరించు

  • వాండ్రంగి కృష్ణదాసు పొందూరు సమీప గ్రామమైన వాండ్రంగికి చెందినవారు.ఇతను సెప్టెంబరు 5 1996 న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును శంకర్ దయాళ్ శర్మ చేతులమీదుగా అందుకున్నాడు.
  • పమ్మిన కూర్మారావు 1988లో భారత ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందారు.
  • వాండ్రంగి కొండలరావు - వాండ్రంగి కొండలరావు 38 సంవత్సరాలుగా తెలుగు ఉపాద్యాయుడుగా ఘనమైన సేవలు అందించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే ఉమ్మడి రాష్ట్ర ప్రముఖ పత్రిక ఈనాడుకు ఫ్రీలాన్స్ రైటర్ గా పలు వ్యాసాలు రాశారు. 40 సంవత్సరాల ప్రస్థానం ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. ఈయనకు వ్యాస బ్రహ్మ బిరుదు ఉంది. వీరు రాసిన ఊరు - పేరు (ఆంధ్రప్రదేశ్) పుస్తకం ఒక నూతన ఒరవడిని సృష్టించింది.
  • యెచ్చిన గోపాలరావు 2007 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, జాతీయస్థాయిలోను ఒకేసారి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను పొందుట విశేషం. 2007లో భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందాడు.
  • పమ్మిన రమాదేవి 2015 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయినిగా సెప్టెంబరు 5 2015ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా సన్మానింవబడింది. ఆమె జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత అయిన యెచ్చినగోపాలరావు సతీమణి. ఈ గ్రామానికి చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత అయిన పి.కూర్మారావు యొక్క కుమార్తె. ఆమె పొందూరు మండలంలోని తండ్యాం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తూ విశేషమైన సేవలందించారు[2]. ఈమె జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ బహుమతి 2015 ను ఢిల్లీలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుండి 2016 సెప్టెంబరు 5 న అందుకున్నారు.[3]
  • ఘండికోట బ్రహ్మాజీరావు

చిత్రమాలికసవరించు

పొందూరులో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీతలుసవరించు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీతలుసవరించు

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-15.
  2. "Rc 45 ap best teacher awards 2015 list of all districts". Archived from the original on 2016-03-07. Retrieved 2015-10-01.
  3. "national award teachers 2015-andhra pradesh" (PDF). Archived from the original (PDF) on 2016-09-09. Retrieved 2016-09-19.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=పొందూరు&oldid=3302447" నుండి వెలికితీశారు