నందివెలుగు ముక్తేశ్వరరావు

నందివెలుగు ముక్తేశ్వరరావు ఐ.ఎ.ఎస్ అధికారి, తిరుపతి తిరుమల దేవస్థానం ప్రత్యేక అధికారి.[1]

నందివెలుగు ముక్తేశ్వరరావు

నందివెలుగు ముక్తేశ్వరరావు గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఓలేరు లో జన్మించారు.నల్గొండ జిల్లా కలక్టర్ గా,దేవాదాయ, ధర్మాదాయ శాఖ,భాషా సాంస్కృతిక శాఖ కమిషనర్ గా పనిచేశారు.మాతృభాషలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు.అధికార భాష అమలులో జిల్లాను ముందుంచారు.నల్గొండ స్ఫూర్తితో ఇతర జిల్లాల్లో కూడా ఈయన విధానాలు అమలుచేశారు.ఈయన హయాములో ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో తెలుగు ఓవెలుగు వెలిగింది.తెలుగులోమాత్రమే అధికారులు కలం కదిపారు. ఇంగ్లీషు రాతలు, మాటలకు స్వస్తి పలికి తెలుగులోనే వాక్యాలు, నిర్మాణకూర్పు చక్కగా చేశారు. అన్నిశాఖల కార్యాలయాల బోర్డులతో పాటు ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ అమ్మభాషలోనే రాశారు.పోలీసులు మొదలుకొని ఎస్పీ వరకు.. గ్రామకార్యదర్శి మొదలుకొని కలెక్టర్‌ దాకా.. అభియోగప్రతాలు మొదలుకొని న్యాయస్థానాల తీర్పుల వరకు.. అచ్చతెలుగులోనే రూపొందించి అమలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు, ఉత్తర ప్రత్యుత్తరాలతో పాటు దరఖాస్తుతో సహా తెలుగులోనే రాశారు.ఇంగ్లీషులోని కొన్నిపదాలను తెలుగులోకి మార్పు చేయడం కష్టమే అయినప్పటికీ కష్టపడి మరీ మాతృభాషను ఉపయోగించారు. జిల్లా కలెక్టర్‌ గా ఈయన ప్రత్యేక చొరవ, కృషి ఫలితంగానే తెలుగుభాష జిల్లాలో ప్రాచుర్యం పొందింది. తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలనే ఆదేశాలతో అధికారుల్లో వచ్చింది.ఆ మార్పుతో జిల్లాలో తెలుగుకు రక్షణ ఏర్పడింది. అధికారభాషను అమలుచేస్తూ రాష్ట్రంలో జిల్లాను ముందువరుసలో నిలిపి అవార్డు కూడా స్వీకరించారు.

విశేషాలు మార్చు

  • తెలుగులో రాయని ఫైళ్ళను తిప్పి పంపేవారు.

మూలాలు మార్చు

  1. India, The Hans (2018-05-07). "Book on retired IAS official released". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-15.

బాహ్య లంకెలు మార్చు