నంది మల్లయ (Nandi Mallaya) తెలుగు సాహిత్యంలోని తొలి తెలుగు జంట కవులు నంది మల్లయ్య, ఘంట సింగనలు.[1] వీరికి 'రాచమల్లు కవులు' అని బిరుదు కూడా ఉంది. వీరు గుంటూరు, నెల్లూరు మండలాల్లో 1480 ప్రాంతాల్లో ఉండేవారు[2]. ఈ నంది మల్లయ నంది తిమ్మనకు తాత.

నంది మల్లయ
జననం పదహారో శతాబ్దం
రచనలు ప్రబోధ చంద్రోదయము,
వరాహ పురాణము
సమకాలీనులు ఘంట సింగన
గురువు నంది తిమ్మన
ఆశ్రయమిచ్చిన రాజులు విజయనగర సామ్రాజ్యము

రచనలు మార్చు

 
వరాహస్వామి భూదేవి అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడం.

విజయనగర సామ్రాజ్యంలో ఉన్నప్పుడు నంది మల్లయ, ఘంట సింగన ఈ జంటకవులు ప్రబోధ చంద్రోదయము,[3] వీరు రచించిన మరో గ్రంధం వరాహ పురాణమును రచించారు,[4] ఐతే వరాహ పురాణం అనేది హిందూ మతంలోని పురాణాల సాహిత్యం నుండి వచ్చిన సంస్కృత గ్రంథం వీరు రచించిన గ్రంథమని పూర్తి ఆధారంతో ఇంకా నిరూపించబడలేదు. నంది ఘంట కవులు కొత్త కొత్త మాటలు వాడడమేగాక చిత్ర, బంధ, గర్భ కవిత్వాలలో కూడా తమాషాలు చేశారు. ప్రతిలోమానులోమ కందం వ్రాశారు. తొలినుంచి చదివినా, కొస నుంచి చదివినా ఈ క్రింది పద్యం ఒకేలా ఉంటుంది...

విశేషాల పద్యం మార్చు

సారసనయనాఘనజఘ - నారచితరతారకలికహరిసారరసా
సారరసారహకలికర - తారతచిరనాఘజనఘనాయనసరసా".

అనే కాకుండా కేవలం రెండు అక్షరాలు మాత్రమే ఉపయోగించి ఒక కంద పద్యం రచించారు.

కాకలికాకలకలకల - కోకిలకులలీలకలులకులుకులకలుకే
కైకోకుకేలికొలకుల - కోకాలీకేలికులికొంకకుకలికీ" (వరాహపురాణం).

అలాగే ఒకే అక్షరంతో కూడా ఈ జంట కవులు ఒక పద్యం చెప్పారు...

నానననుని ననూనున - నేనేనిను ననన్ను నెన్న నీనీ
న్నానౌననోన్నినానౌ - నేనే నను నన్ను నాన నేను నన్నన్".

ఇలా కవిత్వాన్ని చిత్రవిచిత్రంగా పదబందాలను అల్లి కొత్త కవులకు మార్గదర్శకులయ్యారు.

మూలాలు మార్చు

  1. కృష్ణమిశ్రుడు(మూలం), నంది మల్లయ(అను ) (1976). ప్రబోధ చంద్రోదయము.
  2. "Nandi Mallaya active 15th century [WorldCat.org]". www.worldcat.org. Retrieved 2022-01-30.
  3. కృష్ణమిశ్రుడు(మూలం), నంది మల్లయ(అను ) (1976). ప్రబోధ చంద్రోదయము.
  4. R.P.Sharma. "వరాహ పురాణము Varaaha Puranam" (in Indonesia). Retrieved 2022-01-30.{{cite web}}: CS1 maint: unrecognized language (link)