నకుల్ నాథ్
నకుల్ నాథ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు.[1][2][3]
నకుల్ కమల్ నాథ్ | |||
లోక్‌సభ సభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 23 మే 2019 | |||
ముందు | కమల్ నాథ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | చింద్వారా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కోల్‌కతా , పశ్చిమ బెంగాల్ , భారతదేశం | 1974 జూన్ 21||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | కమల్ నాథ్ అల్కా నాథ్ | ||
జీవిత భాగస్వామి | ప్రియా నాథ్ |
రాజకీయ జీవితం
మార్చునకుల నాథ్ తన తండ్రి కమల్ నాథ్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నాథన్ షా కవ్రేటిపై 37,536 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత పార్లమెంట్‌లో సంప్రదింపుల కమిటీలో, వాణిజ్యంపై స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.
మూలాలు
మార్చు- ↑ NT News (10 April 2024). "లోక్‌సభ తొలిదశ ఎన్నికలు.. అత్యంత ధనవంతుడిగా నిలిచిన నకుల్ నాథ్.. ఎన్ని కోట్ల ఆస్తులంటే..?". Archived from the original on 10 April 2024. Retrieved 10 April 2024.
- ↑ The Indian Express (9 April 2024). "In father Kamal Nath's big shadow, amid Congress exodus, heli-hopping Nakul tries to cover slippery ground" (in ఇంగ్లీష్). Archived from the original on 10 April 2024. Retrieved 10 April 2024.
- ↑ Hindustan Times (17 February 2024). "Who is Nakul Nath, Kamal Nath's son and Lok Sabha MP with ₹660 crore net worth?" (in ఇంగ్లీష్). Retrieved 10 April 2024.