కమల్ నాథ్ (జననం: 1946 నవంబరు 18) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా, మధ్యప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడుగా, కేంద్ర మంత్రిగా పనిచేశాడు.

కమల్ నాథ్
కమల్ నాథ్


పదవీ కాలం
17 జులై 2020 – 28 ఏప్రిల్ 2022
ముందు గోపాల్ భార్గవ
తరువాత గోవింద్ సింగ్

పదవీ కాలం
17 డిసెంబర్ 2018 – 23 మార్చి 2020
ముందు శివరాజ్ సింగ్ చౌహాన్
తరువాత శివరాజ్ సింగ్ చౌహాన్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
10 మార్చి 1998 – 17 డిసెంబర్ 2018
ముందు సుందర్ లాల్ పత్వా
తరువాత నకుల్ నాథ్
నియోజకవర్గం ఛింద్వారా
పదవీ కాలం
18 జనవరి 1980 – 15 మే 1996
ముందు గార్గి శంకర్ మిశ్రా
తరువాత అల్కా నాథ్
నియోజకవర్గం ఛింద్వారా

వాణిజ్య & పరిశ్రమల మంత్రి
పదవీ కాలం
24 మే 2004 – 22 మే 2009
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు సయ్యద్ షానవాజ్ హుస్సేన్
తరువాత ఆనంద్ శర్మ

పదవీ కాలం
16 సెప్టెంబర్ 1995 – 16 మే 1996
ప్రధాన మంత్రి పీవీ. నరసింహారావు
ముందు గడ్డం వెంకటస్వామి
తరువాత గడ్డం వెంకటస్వామి

కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ
పదవీ కాలం
26 జూన్ 1991 – 16 సెప్టెంబర్ 1995
ప్రధాన మంత్రి పీవీ. నరసింహారావు

కేంద్ర రవాణా, రహదారుల మంత్రి
పదవీ కాలం
22 మే 2009 – 19 జనవరి 2011
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు టి.ఆర్. బాలు
తరువాత సి. పి. జోషి

కేంద్ర గృహనిర్మాణ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
పదవీ కాలం
19 జనవరి 2011 – 28 అక్టోబర్ 2012
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
తరువాత గిరిజ వ్యాస్

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
పదవీ కాలం
28 అక్టోబర్ 2012 – 26 మే 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
తరువాత వెంకయ్య నాయుడు

వ్యక్తిగత వివరాలు

జననం (1946-11-18) 1946 నవంబరు 18 (వయసు 77)
కాన్పూరు, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి అల్కా నాథ్
సంతానం 2, సహా నకుల్ నాథ్
నివాసం భోపాల్, మధ్యప్రదేశ్, భారతదేశం
పూర్వ విద్యార్థి కలకత్తా యూనివర్సిటీ
సంతకం కమల్ నాథ్'s signature
మూలం [1]

బాల్యం

మార్చు

కమల్ నాథ్ కాన్పూర్‌లో వ్యాపార వేత్త కుటుంబంలో జన్మించారు.[2] కమల్ నాథ్ తండ్రి మహేంద్ర నాథ్. సినిమాల నిర్మాత [3] కమల్ నాథ్ ది డూన్ స్కూల్ నందు చదువుకున్నాడు .[4] తరువాత, కమల్ నాథ్ కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ నుండి వాణిజ్యశాస్త్రం లో పట్టభద్రుడయ్యాడు.[5]

రాజకీయ జీవితం

మార్చు
 
కమల్ నాథ్ 2004 మే 24న న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
 
2004లో న్యూ ఢిల్లీలో ఆర్థిక, వ్యాపారం, వ్యవసాయ వ్యవహారాల US అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అలాన్ లార్సన్ కమల్ నాథ్.

కమల్ నాథ్ తొలిసారిగా 1980లో 7వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.[6] 1984లో 8వ లోక్‌సభకు, 1989లో 9వ లోక్‌సభకు, 1991లో 10వ లోక్‌సభకు కమల్ నాథ్ ఎన్నికయ్యారు.1991 జూన్లో కమల్ నాథ్ పీవీ నరసింహారావు మంత్రివర్గంలో పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేశారు.[7] 1995 నుండి 1996 వరకు కమల్ నాథ్ కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.[8]

కమల్ నాథ్ 1998లో 12వ లోక్‌సభకు 1999లో 13వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2001 నుండి 2004 వరకు, అతను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.[9] కమల్ నాథ్ 2004 ఎన్నికలలో 14వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు . కమల్ నాథ్ 2004 నుండి 2009 వరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు. 2009 మే 16న కమల్ నాథ్ మళ్లీ ఎంపీగా గెలిచి కేంద్ర రవాణా శాఖ మంత్రిగా పనిచేశాడు.[10] 2011లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఫలితంగా జైపాల్ రెడ్డి స్థానంలో కమల్ నాథ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.[11]

2012 అక్టోబరులో కమల్ నాథ్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.[12]

వ్యాపారవేత్తగా

మార్చు

వ్యాపార వేత్త

మార్చు

కమల్ నాథ్ ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (IMT) మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూషన్‌కు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.[13] ఈ సంస్థ మధ్యప్రదేశ్ లోని విద్యార్థులు పిల్లల కోసం స్థాపించబడింది. ఈ సంస్థ ద్వారా విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు అందించబడుతాయి.[14]

మూలాలు

మార్చు
  1. Lok Sabha (2022). "Kamal Nath". Archived from the original on 28 August 2022. Retrieved 28 August 2022.
  2. "Kamal Nath: The man behind Congress' 'kamaal' performance in Madhya Pradesh". 14 December 2018. Retrieved 5 January 2020.
  3. "Shri Mahendra Nath - Founder Chairman". imt.edu. Retrieved 26 March 2021.
  4. "Profile of Shri Kamal Nath, Minister of Commerce & Industry, Government of India". Department of Commerce, Government of India. Archived from the original on 10 April 2009. Retrieved 30 October 2008.
  5. "Kamal Nath : Bio, Political life, Family & Top stories". The Times of India. Retrieved 22 May 2022.
  6. "Biographical Sketch Member of Parliament XII Lok Sabha" Archived 3 మార్చి 2016 at the Wayback Machine, accessed 12 August 2011.
  7. "MR. KAMAL NATH Commerce & Industry Minister Government of India" Archived 30 సెప్టెంబరు 2011 at the Wayback Machine, accessed 12 August 2011.
  8. " Fifteenth Lok Sabha Member","WhereInCity India Information", accessed 12 August 2011.
  9. "Kamal Nath Minister of Urban Development" Archived 23 ఆగస్టు 2011 at the Wayback Machine,"Chiefly Musing", accessed 12 August 2011.
  10. Profile at Parliament of India website Archived 17 ఏప్రిల్ 2008 at the Wayback Machine
  11. "Cabinet reshuffle: Jaipal gets Petroleum; Kamal Nath moved to Urban Development", "NDTV", accessed 10 February 2012.
  12. "Cabinet reshuffle: Upgrade for Salman, Rahul boys likely", "The Times of India", accessed 27 November 2012.
  13. "business school in India | PGDM EPGDM |IMT Hyderabad". www.imthyderabad.edu.in. Retrieved 5 January 2020.
  14. http://www.parliamentofindia.nic.in "Biographical Sketch Member of Parliament 13th Lok Sabha", accessed 12 August 2011.
"https://te.wikipedia.org/w/index.php?title=కమల్_నాథ్&oldid=4322341" నుండి వెలికితీశారు