నగర కేంద్ర గ్రంథాలయం
నగర కేంద్ర గ్రంథాలయం, హైద్రాబాద్ లో 1961 ప్రారంభమైంది. భారత డిజిటల్ లైబ్రరీ[1] ప్రాజెక్టు లో భాగంగా, దీని లోని ఎంపిక చేసిన పుస్తకాలను స్కానింగు చేశారు. భారత డిజిటల్ లైబ్రరీ లో ఏప్రిల్ 2010 నాటికి 14343 తెలుగు పుస్తకాలు లభ్యమవుతున్నాయి.
దేశము | భారతదేశం |
---|---|
తరహా | నగర గ్రంథాలయం |
స్థాపితము | 1960 |
ప్రదేశము | చిక్కడపల్లి |
గ్రంధ సంగ్రహం / సేకరణ | |
సేకరించిన అంశాలు | పుస్తకాలు, విద్యావిషయక పత్రికలు, వార్తాపత్రికలు, పత్రికలు, చేతిరాత ప్రతులు |
చట్టపరమైన జమ | అవును |
ప్రాప్యత, వినియోగం | |
వినియోగించుటకు అర్హతలు | ఏమీలేవు, అందరికి అందుబాటులో వుంది |
ఈ గ్రంథాలయం హైదరాబాద్ మహానగర గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. ఇది చిక్కడపల్లి లో వున్నది. దీనితో పాటు మొత్తం 85 పౌర గ్రంథాలయాలు నగర ప్రజలకు సేవలందిస్తున్నాయి. తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమ వ్యాప్తికి కృషి చేసిన వట్టికోట ఆళ్వారు స్వామికి నివాళిగా ఈ గ్రంథాలయానికి ఆయన పేరు పెట్టారు.[2] OSM గతిశీల పటము
విభాగాలు
మార్చుగ్రంథాలయంలో సాధారణ, రిఫరెన్స్, పత్రికలు, విద్యార్ధి, పిల్లల విభాగాలు, రెండు అంతస్తుల భవనంలో విస్తరించి వున్నాయి. ఇవేకాక గ్రంథాలయాధికారులు కృతులను ఇతర రూపాలలోకి మార్చి భద్రపరచడానికి ప్రత్యేక విభాగం కూడా వుంది. సాధారణ విభాగంలో వివిధ విషయాలపై వివిధ భాషల గ్రంథాలు లభ్యమవుతాయి. పత్రికల విభాగంలో 1964 నుండి ప్రచురితమైన వివిధ భాషల పత్రికలు దొరుకుతాయి. పిల్లల విభాగంలో పిల్లలకు సౌకర్యంగా వుండే కుర్చీలు, బల్లలున్నాయి. సమాచార సాంకేతిక విభాగంలో 25 కంప్యూటర్ ల ద్వారా, అతి వేగ ఇంటర్నెట్ అందుబాటులో వుంది. ఇక్కడ సమావేశ మందిరం వుంది. 150 రూపాయల సభ్యత్వ రుసుముతో పుస్తకాలు అరువు తెచ్చుకోవచ్చు. విద్యార్ధులు ఇక్కడ ప్రశాంత వాతావరణంలో చదువుకోవటానికి వస్తారు.[3]
పనిచేయు వేళలు
మార్చుఉదయం 8 నుండి సాయంత్రం 8 వరకు గ్రంథాలయం పనిచేస్తుంది. ప్రజా సెలవుదినాలు, సోమవారం మాత్రం దినపత్రికల విభాగమే పనిచేస్తుంది.
పుస్తకాల వివరాలు
మార్చుభాష | సంఖ్య |
---|---|
తెలుగు | 63801 |
ఇంగ్లీషు | 67282 |
ఉర్దూ | 15876 |
హిందీ | 24647 |
తమిళం | 2954 |
కన్నడ | 3515 |
మరాఠీ | 3226 |
సంస్కృతము | 2525 |
ఇవీ చూడండి
మార్చువనరులు
మార్చు- ↑ S Venkamma (2004-05-10). "Universal digital library Project" (PDF). Archived from the original (PDF) on 2015-09-19. Retrieved 2020-01-14.
- ↑ "తెలంగాణ గ్రంథాలయాల సౌరభం". Government of Telangana. 2019-06-04. Archived from the original on 2020-01-13. Retrieved 2020-01-13.
- ↑ Shreya Bahirat (2019-02-19). "Check Out This 50-Year-Old Public Library That Also Hosts Cultural & Social Events". LBB. Archived from the original on 2020-01-14. Retrieved 2020-01-14.