నడకుదుటి వీరరాజు

తెలుగు రచయిత

నడకుదుటి వీరరాజు(1871-1937) పిఠాపురానికి చెందిన రచయిత, పండితుడు. ఇతడు 1871వ సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ తాలూకా, శహపురం గ్రామంలో సీతమ్మ, రామన్న కవిగార్లకు జన్మించాడు. ఇతడు బాల్యంలోనే కవితలు అల్లడం ప్రారంభించాడు. ఏకసంథాగ్రాహి. అష్టావధానాలు చేశాడు. శిలా, తామ్ర శాసనాలు చదివి పత్రికలలో అనేక వ్యాసాలు వ్రాశాడు. విద్వజ్జన మనోరంజని అనే ముద్రాక్షరశాలను నెలకొల్పి అనేక అముద్రిత గ్రంథాలను పరిష్కరించి ప్రచురించాడు[1]. ఇతనికి ఆచంట సాంఖ్యాయన శర్మ నడిపిన కల్పలత మాసపత్రిక 1903లో నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి లభించింది[2]. ఇదే పోటీలో ఓలేటి పార్వతీశం కు రెండవ పారితోషికము, బాలాంత్రపు వేంకటరావుకు నాలుగవ పారితోషికము లభించింది. నడకుదుటి వీరరాజు ఈ ఇద్దరినీ ఒకదగ్గర కలిపాడు. ఆనాటి నుండి వారిద్దరూ వేంకట పార్వతీశ కవులుగా జంట కవిత్వం చెప్పసాగారు. ఆ విధంగా వారిద్దరూ జంటకవులుగా మారడానికి నడకుదుటి వీరరాజే కారణం. ఇతడికి విమర్శకాదర్శక అనే బిరుదు కలదు.

నడకుదుటి వీరరాజు

రచనలుసవరించు

 1. శివపురాణము[3]
 2. వామనపురాణము
 3. విభ్రమతరంగిణి
 4. విమర్శన తరంగిణి
 5. జానకీ పరిణయము
 6. సకలజన మనోభిరంజనము
 7. నారాయణ విలాసము
 8. వీరమహిమ [4] మొదలైనవి.

ఇంకా ఇతడు

 1. శ్రీ రాధామాధవము
 2. ధర్మఖండము
 3. ఏకాంతసేవా విలాసము
 4. విష్ణుమాయా నాటకము మొదలైన గ్రంథాలను పరిష్కరించి ముద్రించాడు.

మూలాలుసవరించు

 1. రాపాక ఏకాంబరాచార్యులు (1 June 2016). అవధాన విదాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 933.
 2. కల్పలత పారితోషికములు, పేజీ 10
 3. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో శివపురాణము నాలుగవ సంపుటము ప్రతి
 4. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తకప్రతి