ఆచంట సాంఖ్యాయన శర్మ

రచయిత, కవి

మహోపాధ్యాయ ఆచంట వేంకటరాయ సాంఖ్యాయన శర్మ (అక్టోబర్ 19, 1864-1933), తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు. తొలితరం తెలుగు కథకుడు. ఈయన 1903లో వ్రాసిన లలిత తొలి తెలుగు కథల్లో ఒకటిగా భావించబడింది. అయితే ఆధునిక కథాలక్షణాలు ఆ రచనకు ఉన్నాయా లేదా అన్న ప్రశ్న కొంత సంశయానికి దారితీసింది.[1] సాహితీ పరిశోధకుడు ఆరుద్ర సాంఖ్యాయనశర్మ వ్రాసిన విశాఖ (1904) కథే తెలుగుకథలలో మొదటిదని, గురజాడ అప్పారావు దిద్దుబాటు కథలని తులనాత్మకంగా పరిశీలించి నిరూపించాడు.[2] కానీ, బండారు అచ్చమాంబ 1898-1904 మధ్యకాలంలో వివిధ పత్రికల్లో ప్రకటించిన 10 కథానికలు వెలువడటంతో సాంఖ్యాయన శర్మ తొలి తెలుగు కథకుడు కాదని తేలింది.[3]

ఆచంట వేంకటరాయ సాంఖ్యాయన శర్మ
జననంఅక్టోబర్ 19, 1864
మరణం1933
ఇతర పేర్లుసాంఖ్యాయన శర్మ
ప్రసిద్ధితెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు
తొలితరం తెలుగు కథకుడు
తండ్రిబాపిరాజు
తల్లినరసాంబ

1890లలో ఆచంట వేంకటరాయ సాంఖ్యాయన శర్మ తన రచనలలో విస్తృతంగా విజ్ఞానశాస్త్ర విషయాలకు ప్రాచుర్యం కల్పించాడు.[4] సుజన ప్రమోదిని, కల్పలత వంటి పత్రికలు నడిపిన సాంఖ్యాయనశర్మ శతావధానాలు కూడా చేశాడు.[5]

బాల్యం

మార్చు

సాంఖ్యాయన శర్మ 1864లో మద్రాసు ప్రెసిడెన్సీలోని విశాఖపట్నంలో విద్యాధికులైన నియోగి బ్రాహ్మణ కుటుంబంలో నరసమాంబ, బాపిరాజు దంపతులకు జన్మించాడు.[6]

విద్య

మార్చు

వృత్తి

మార్చు

సాంఖ్యాయన శర్మ 1903లో కల్పలత అనే పత్రికను స్థాపించాడు. తెలుగులో ఇదే మొదటి శాస్త్ర విజ్ఞాన విషయాలపై వచ్చిన పత్రిక.

సాహిత్యరంగం

మార్చు

నాటకరంగం

మార్చు
 
ఆంధ్ర నాటక కళాపరిషత్తు వ్యవస్థాపక సభ్యులలో ఆచంట సాంఖ్యాయనశర్మ, 1929

1929లో తెలుగు నాటకరంగ నిర్వాహకులు, కళాకారులు, కవులు, పోషకులలోని ముఖ్యులు కలిసి నాటకరంగ పునరుద్ధరణకు పెట్టిన ఆంధ్ర నాటక కళాపరిషత్తులో వ్యవస్థాపక సభ్యులలో వీరు కూడా ఒకరు.[7] ప్రథమ పరిషత్తు మహాసభలకు దేశోధ్ధారక, విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, మహామహోపాధ్యాయ ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ, చట్టి చిన పూర్ణయ్యపంతులు, మల్లాది విశ్వనాథకవిరాజు, వనారస గోవిందరావు, కొత్తపల్లి లక్ష్మయ్య వ్యవస్థాపక సభ్యులుగా ధనసహాయం అందించారు. మొదటి రోజున సాంఖ్యాయన శర్మ, రెండవ రోజున కాశీనాథుని నాగేశ్వరరావు ఈ సభలకు అధ్యక్షత వహించారు.

కల్పలత పత్రిక

మార్చు

ఈ పత్రిక రెండున్నర సంవత్సరాలే నడిచినా, విడుదలైన 30 సంచికలు చాలా అమూల్యమైనవి. ఇందులోని విషయాలన్నీ ఆయనే స్వయంగా వ్రాసేవాడు. ఈ పత్రికలో శాస్త్ర విషయాలతో పాటు లఘ కథానికలు, ఆధునిక కవిత్వం మొదలైన ఇతర సాహితీ రచనలు కూడా ప్రచురించబడేవి. సాంఖ్యయన శర్మ కథలు లలిత, విశాఖ, అపూర్వోపన్యాసం మొదలైన ఈ పత్రికలో ప్రకటించినవే.[8]

రచనలు

మార్చు
  • సుధానిధి
  • మనోరమ
  • పార్ధ పరాజయము
  • అవదాత కలభకము
  • విక్రమోర్వశీయము
  • ఉత్తర రామ చరిత్రము
  • రహస్య దర్పణము
  • ఆంధ్ర పద్యావళి

మూలాలు

మార్చు
  1. అచ్చమాంబ: మనకు తెలియని మన చరిత్ర -ఆంధ్రజ్యోతి, వివిధ మార్చి 15, 2010, పరిశీలించిన తేది: 2010-08-06(?)
  2. శ్రీ లింగాల, రామతీర్థ (2009-12-28). "తెలుగు సాహిత్య విమర్శలో విభిన్న ధోరణులు". ఆంధ్రప్రభ. Retrieved 2014-03-15.[permanent dead link]
  3. తొలినాటి తెలుగు కథానికల కథ- సూర్యా పత్రిక జాల స్థలి, పరిశీలించిన తేది: 2010-08-06(?)
  4. విజ్ఞానశాస్త్రంతెలుగు రచయితలు- చీకోలు సుందరయ్య (ఈనాడు సాహిత్యం) జాలస్థలి
  5. తెలుగు కథా ప్రస్థానానికి దర్పణం కథామంజరి - -చీకోలు సుందరయ్య (ఈనాడు సాహిత్యం) జాలస్థలి, పరిశీలించిన తేది: 2010-08-06(?)
  6. మాగంటి.ఆర్గ్ లో పత్రము
  7. సురభి సప్తతి స్వర్ణోత్సవ సంచిక (1 ed.). హైదరాబాద్: సురభి నాటక కళాసంఘము. 1960.
  8. List of Telugu Journals published prior to 1947 [dead link]

బాహ్యా లంకెలు

మార్చు