నడిగూడెం మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

నడిగూడెం
—  మండలం  —
నల్గొండ జిల్లా పటంలో నడిగూడెం మండల స్థానం
నల్గొండ జిల్లా పటంలో నడిగూడెం మండల స్థానం
నడిగూడెం is located in తెలంగాణ
నడిగూడెం
నడిగూడెం
తెలంగాణ పటంలో నడిగూడెం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°09′09″N 79°52′58″E / 17.152601°N 79.882736°E / 17.152601; 79.882736
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రం నడిగూడెం
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 39,335
 - పురుషులు 19,558
 - స్త్రీలు 19,777
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.50%
 - పురుషులు 65.12%
 - స్త్రీలు 49.33%
పిన్‌కోడ్ 508234

ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 30 కి. మీ. దూరంలో ఉంది.

నల్గొండ జిల్లా నుండి మార్పుసవరించు

లోగడ నడిగూడెం మండలం,నల్గొండ జిల్లా,సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా నడిగూడెం మండలాన్ని (1+10) 11 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా, కోదాడ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]

మండల జనాభాసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 39,335 - పురుషులు 19,558 - స్త్రీలు 19,777

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

  1. ఏక్‌లాష్‌ఖాన్ పేట
  2. తెల్లబలి
  3. వల్లాపురం
  4. రత్నవరం
  5. రామాపురం
  6. నడిగూడెం
  7. చకిరాల
  8. సిరిపురం
  9. కాగిత రామచంద్రపురం
  10. కరివిరాల
  11. బృందావనపురం

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/246.Suryapet.-Final.pdf

వెలుపలి లంకెలుసవరించు