నదీలోయ ప్రాజెక్టులు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నదులలో ప్రవహించే అపార జలరాశిని సద్వినియోగం చేసుకునేందుకు నిర్మించిన ప్రాజెక్టులే నదీలోయ ప్రాజెక్టులు (River valley projects). ప్రకృతి ప్రసాదించిన జలవనరులను సద్వినియోగం చేసుకునేందుకు వివిధ మార్గాలను ప్రాచీన కాలం నుండి మానవుడు అనుసరిస్తూనే ఉన్నాడు. వర్షపు నీటిని నిలువ చేసేందుకు చెరువులు తవ్వించడం, బావులు నూతుల ద్వారా భూగర్భ జలాలను వినియోగంచుకోవడం అనాదిగా వస్తున్నది. సాంకేతికంగా మానవుడు అభివృద్ధిచెందే కొద్దీ, జలసాధనలోను మానవుడు కొత్త పధతులను ప్రవేశపేడుతూ వచ్చాడు.
ఈ అభివృద్ధికి పరాకాష్టయే ఈ నదీలోయ ప్రాజెక్టులు . సాగునీరు, తాగునీరు, విద్యుదుత్పత్తి మొదలైన అనేక అవసరాలు ఏకకాలంలో తీర్చేందుకు వీలుగా చేపట్టిన ప్రాజెక్టులను, బహుళార్థసాధక ప్రాజెక్టులు అంటారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు మొదలైనవి బహుళార్థసాధక ప్రాజెక్టులు.
బృహత్తరమైన లక్ష్యాలు, వివిధ రంగాలకు ఒనగూడే ప్రయోజనాలు, సుదీర్ఘ నిర్మాణ కాలం, వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల సమన్వయం, పర్యావరణ అంశాలు, ముంపుకు గురయ్యే వేలాది గ్రామాలూ అక్కడ నివసించే ప్రజలు మొదలైనవన్నీ ఈ బృహత్తర ప్రాజెక్టులతో ముడిపడ్డ అంశాలు.
ప్రయోజనాలు
మార్చుభారీ స్థాయిలో నీటిని నిలువ చేసే అవకాశం ఉన్నందువలన, చాలా ఎక్కువ విస్తీర్ణంలోని ప్రజల సాగునీటి, తాగునీటి అవసరాలు తీరుతాయి. వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. కరువు వంటి ప్రకృతి వైపరీత్యాల వలన జరిగే నష్టం చాలావరకు నివారించవచ్చు.
సమస్యలు
మార్చుఈ భారీ ప్రాజెక్టుల నిర్మాణం వలన ఏర్పడే జలాశయాల్లో వేలాది ఎకరాల అటవీభూములు, గ్రామాలు, పంటపొలాలు మునిగిపోవడం వలన ఎన్నో పర్యావరణ, సామాజిక, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజల పునరావాసం సంతృప్తికరంగా జరగక, సామాజిక ఉద్రిక్తతలు తలెత్తిన సందర్భాలు అనేక ప్రాజెక్టుల విషయంలో జరిగాయి.
ఈ ప్రాజెక్టుల భారీ పరిమాణం వలన వివిధ ప్రాంతాల, రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించడమనేది చాలా ప్రధానమైన అంశం. అయితే నీటి పంపకాలపై వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలు ప్రాజెక్టు నిర్మాణాల పురోగతిని అడ్డుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వివిధ ట్రిబ్యునళ్ళు, సంస్థల వలన సమస్యలు పరిష్కారం కాని సందర్భాలు చాలా ఉన్నాయి.
ప్రాజెక్టుల జాబితా
మార్చుప్రాజెక్టుల జాబితా | ||
ప్రాజెక్టు పేరు | నది | రాష్ట్రం |
---|---|---|
ప్రకాశం బారేజి | కృష్ణ | ఆంధ్ర ప్రదేశ్ |
నాగార్జునసాగర్ ప్రాజెక్టు | కృష్ణ | ఆంధ్ర ప్రదేశ్ |
శ్రీశైలం ప్రాజెక్టు | కృష్ణ | ఆంధ్ర ప్రదేశ్ |
తెలుగుగంగ ప్రాజెక్టు | కృష్ణ | ఆంధ్ర ప్రదేశ్ |
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు | కృష్ణ | ఆంధ్ర ప్రదేశ్ |
శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ | కృష్ణ | ఆంధ్ర ప్రదేశ్ |
పులిచింతల ప్రాజెక్టు | కృష్ణ | ఆంధ్ర ప్రదేశ్ |
ప్రియదర్శిని జూరాల | కృష్ణ | ఆంధ్ర ప్రదేశ్ |