ననుమాస స్వామి
ననుమాస స్వామి తెలంగాణకు చెందిన కవి, రచయిత. ఇతడు 1952, జనవరి 1న వరంగల్లు జిల్లా, చెన్నారావుపేట గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఇతడు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు, చరిత్రలలో ఎం.ఎ. పట్టాలు పుచ్చుకున్నాడు. మాలపల్లి - గోదాన్ నవలల తులనాత్మక పరిశీలన అనే అంశంపై ఎం.ఫిల్, తెలుగు నవల - అస్పృశ్యతా సమస్య అనే అంశంపై పి.హెచ్.డి చేశాడు. రైల్వేడిగ్రీ కాలేజి, ఎ.వి.కాలేజిలలో అధ్యాపకుడిగా పనిచేశాడు.
రచనలు
మార్చు- దృక్సూచి (వ్యాస సంపుటి)
- మాలపల్లి-గోదాన్ నవలల తులనాత్మక పరిశీలనం (సిద్ధాంతగ్రంథం)
- జానపద పురాణాలు - పటం కథలు
- మడేలు పురాణం (సంక్షిప్త పటం కథ)
- గౌడ పురాణం : పటం ప్రదర్శన - యక్షగానం
- దండోరా (ఉస్మానియా దళిత బహుజన కవిత)
- అస్పృశ్యతా సమస్య - తెలుగునవల
- దిశ
- గౌడ పురాణం - ద్విపద కావ్యం
- కంఠ మహేశ్వర పటం కథ
- మేము మీకోసమే (గేయకథా సంపుటి)
- మోహిని దళిత నవల
- మూలవాసి పాటలు
- శాలివాహన శకంలో గౌడులు కైఫీయతుల్లో గౌడనాడులు
- సురాభాండేశ్వరం రూపకం
- తెలుగు సాహిత్యంలో అత్యాధునిక ధోరణులు సంవీక్షణము
- Cultural Reflections in Scroll Narratives in Telangana A Study
సాధించిన ఘనత
మార్చు- ఇతడు 13 గంటలపాటు నిర్విరామంగా "ఊసెత్తితే చాలు ఉలిక్కిపడే వృత్తి పురాణాలు" అనే అంశంపై ప్రసంగించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకున్నాడు.