నములకంటి జగన్నాథమ్

నములకంటి జగన్నాథం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి. రాజకీయనాయకుడు. కాంగ్రేసువాది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సభ్యులుగా, రెండు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా పనిచేశారు. ఈ కవి ' అరుంధతీదేవి చరిత్రం ' అను వచన కావ్యాన్ని, ' వనితా విలాసం ' అను పద్యకావ్యాన్ని, నల్గొండ జిల్లాలోని యాదగిరి నరసింహస్వామిపై శార్దూల మత్తేభ విక్రీడితలతో ' శ్రీయాదగిరి నరసింహస్వామి ' శతకాన్ని రచించారు[1]... అంతేకాకుండా శివకేశవ భేదరాహిత్యాన్ని తెలుపుటకంటూ, ఉత్పలమాల, చంపకమాలలతో 'గిరిజా మనోహరా!' అను మకుటంతో, శతక రూపంలో ' శ్రీశైల గిరిజా మనోహరం ' అను కావ్యాన్ని రచించాడు. దీనిని నాటి ముఖ్యమంత్రి శ్రీకాసు బ్రహ్మానందరెడ్డికి....

నములకంటి జగన్నాథం
నములకంటి జగన్నాథం
నములకంటి జగన్నాథంయ
జననంనములకంటి జగన్నాథం
ప్రసిద్ధిరాజకీయనాయకుడు, కవి
మతంహిందూ మతము

శైలజామనోనాథుని- శతక కృతిని

స్వీకరింపుము శ్రీశైల క్షేత్రపతిని

గూర్చి వ్రాసితి శుభములు - గొనుము జగతి

మానితౌదార్య మాముఖ్యమంత్రివర్య! అంటూ అంకితమిచ్చాడు.

రచనలు

మార్చు
  • అరుంధతీదేవి చరిత్రం (వచన కావ్యం)
  • వనితా విలాసం (పద్య కావ్యం)
  • శ్రీయాదగిరి నరసింహస్వామి (శతకం)
  • శ్రీశైల గిరిజా మనోహరం (శతకం)
అరుంధతీదేవి చరిత్రం
మాల, మాదిగలు పరాయి మతాలలోకి ప్రవేశించటానికి కారకులు ఎవరు?, నాడు 15 కోట్లు ఉండిన ఈ వర్గ జనాభా దేశం విడిచిపోతే మన సమాజ స్వరూపం ఎమయ్యేది? అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ గ్రంథాన్ని రచించినట్లు రచయిత ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో తెలియజేశాడు[2].

మూలాలు

మార్చు
  1. శ్రీశైల గిరిజామనోహరం, రచన:నములకంటి జగన్నాథమ్, అరవింద పబ్లికేషన్స్, హైదరాబాద్, ముందుమాట
  2. అరుంధతీ దేవి చరిత్రం, వైదిక గ్రంథ ప్రచారక మండలి, హైదరాబాద్-1968.