మాదిగ (మదిగ, ఆది జంబవ, మాతంగి, మక్కాలు, మాదిగ, మాదిగారు గా కూడా పిలువబడుతుంది) దళితులకు చెందిన సమూహం. వారు దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఉత్తర భారతదేశంలోని మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో షెడ్యూల్డ్ కులం గా వర్గీకరింపబడినవారు. ఉత్తర భారతదేశంలో {చమర్} గా పిలుస్తారు [1] షెడ్యూల్డ్ కులాల జాబితాలో 32వ కులం మాదిగ . ఈ కులస్తులు పూర్వం మృతి చెందిన పశువుల తోలుతీసి వ్యవసాయ బావులకు తోలు తొండాలు అన్ని శూద్ర కులాలకు కు తోలుతో పనిముట్లు చేసావారు. చెప్పులు కుట్టడం, పెళ్ళిల్లకు డప్పుకొట్టడం చేసే వారు.తెలంగాణ రాష్ట్రంలో కొలనుపాకలో 2000 సంవత్సరం పూర్వం నుండి మాదిగ (జాంబవ మఠం) ఉంటుంది

మాదిగ
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ
భాషలు
తెలుగు, కన్నడ భాష, హిందీ భాష
సంబంధిత జాతి సమూహాలు
తెలుగు ప్రజలు, హిందీ ప్రజలు, కన్నడిగులు

ఆంధ్ర రాష్ట్ర జనాభాలో 10 శాతం , తెలంగాణ రాష్ట్ర జనాభాలో 16% మాదిగలున్నారు. విద్యా ఉద్యోగ రంగాలలో తమ వాటా కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎం.ఆర్.పి.ఎస్) ని మంద కృష్ణ మాదిగ స్థాపించాడు. మాదిగలు చనిపోయిన పశువు మాంసం భుజించేవారు. జాంబవ పురాణం ప్రకారం మాదిగలు మొదటి వారు, మొదటి రాజులు అని జాంబపురాణం లో చెప్పబడింది

మాదిగ కులం చారిత్ర పరంగా అట్టడుగుస్థాయిలోనికి అణచివేయబడింది. ప్రస్తుతం వారి సాంఘిక-ఆర్థిక స్థితి షెడ్యూల్డ్ కులంగా వర్గీకరణ ప్రభావంవల్ల మెరుగుపడింది. దళిత ఉద్యమకారుడు లెల్లే సురేశ్ ఈ కులం గురించి 2004లో తీసిన డాక్యుమెంటరీ చిత్రం మహాదిగ విమర్శనాత్మకంగా ప్రశంసలు పొందింది.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Madhav, K.V.S. (2004-09-09). "Starring Madiga and dappu..." The Hindu. p. 02. Archived from the original on 2004-09-27. Retrieved 2016-05-24.


ఇతర పఠనాలు

మార్చు

బయటి లంకెలు

మార్చు

[మంద కృష్ణమాదిగ)

"https://te.wikipedia.org/w/index.php?title=మాదిగ&oldid=4198197" నుండి వెలికితీశారు