నమ్రతా రావు కేరళకు చెందిన సినిమా ఎడిటర్. ఓయ్ లక్కీ, లక్కీ ఓయ్! (2008), ఇష్కియా (2010), బ్యాండ్ బాజా బారాత్ (2010), లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ (2011), కహానీ (2012) వంటి సినిమాలకు ఎడిటర్ గా పనిచేసింది.[1]

నమ్రతా రావు
జననం (1981-06-17) 1981 జూన్ 17 (వయసు 42)
ఎర్నాకులం, కొచ్చి, కేరళ
వృత్తిసినిమా ఎడిటర్
క్రియాశీల సంవత్సరాలు2008 – ప్రస్తుతం

2010లో వచ్చిన లవ్ సెక్స్ ఔర్ ధోఖా సినిమా ఎడిటర్ గా, నటిగా అత్యంత ప్రసిద్ధి చెందింది. 2011లో ఈ సినిమాకు ఉత్తమ ఎడిటింగ్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. ఆమె విమర్శకుల ప్రశంసలు పొందిన కహానీ (2012)కి ఉత్తమ ఎడిటింగ్‌కి జాతీయ చలనచిత్ర అవార్డు, ఉత్తమ ఎడిటింగ్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది.

జననం, విద్య మార్చు

నమ్రతా రావు 1981, జూన్ 17న ఢిల్లీలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఐటీలో పట్టా పొందిన నమ్రతా, సినిమారంగంలోకి వచ్చింది.[2][3]

వృత్తిరంగం మార్చు

గ్రాఫిక్ డిజైనర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన అమృతా రావు, కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫిల్మ్ మేకింగ్ అధ్యయనం చేయాలని నిర్ణయించుకోవడానికి ముందు కొంతకాలం ఎన్డీటీవీలో కూడా పనిచేసింది.[2][4]

సినిమాలు మార్చు

  • బాబా బ్లాక్ బార్డ్ (చిన్న, 2006)
  • ఐ యామ్ వెరీ బ్యూటీఫుల్! (డాక్యుమెంటరీ, 2006)
  • మీలా క్యా? (డాక్యుమెంటరీ, 2007)
  • త్రీ బ్లైండ్ మెన్ (డాక్యుమెంటరీ, 2007)
  • ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్! (2008)
  • దహ్లీజ్ పార్ (డాక్యుమెంటరీ, 2008)
  • ఇష్కియా (2010)
  • లవ్ సెక్స్ ఔర్ ధోఖా (2010)
  • బ్యాండ్ బాజా బారాత్ (2010)
  • విత్ లవ్, ఢిల్లీ (2011)
  • లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ (2011)
  • కహానీ (2012)
  • లైఫ్ కి తో లాగ్ గయీ (2012)
  • షాంఘై (2012)
  • జబ్ తక్ హై జాన్ (2012)
  • శుద్ధ్ దేశీ రొమాన్స్ (2013)
  • 2 స్టేట్స్ (2014)
  • తిత్లీ (2014)
  • కతియాబాజ్ (డాక్యుమెంటరీ, 2014)
  • అహల్య (చిన్న, 2015)
  • డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి! (2015)
  • దమ్ లగా కే హైషా (2015)
  • ఫ్యాన్ (2016)
  • కహానీ 2 (2016)
  • బెఫిక్రే (2016)
  • అనుకుల్ (2017)
  • లస్ట్ స్టోరీస్ (2018)
  • బద్లా (2019)
  • మేడ్ ఇన్ హెవెన్ (టీవీ సిరీస్, 2019)
  • ఘోస్ట్ స్టోరీస్ (2020)
  • మిస్ మ్యాచ్డ్ (టీవీ సిరీస్, 2020)
  • హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్ (డాక్యుమెంటరీ సిరీస్, 2021)
  • జయేశ్ భాయ్ జోర్దార్ (2022)
  • శ్రీమతి ఛటర్జీ వర్సెస్ నార్వే (2023)

అవార్డులు మార్చు

సంవత్సరం అవార్డు విభాగం సినిమా
2012 జాతీయ చలనచిత్ర అవార్డులు ఉత్తమ ఎడిటర్ కహానీ[5]
2011 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ ఎడిటర్ లవ్ సెక్స్ ఔర్ ధోఖా[6]
2013 కహానీ
2011 ఐఫా అవార్డులు ఉత్తమ ఎడిటర్ బ్యాండ్ బాజా బారాత్[7]
2013 కహానీ
2011 కలర్స్ స్క్రీన్ అవార్డులు ఉత్తమ ఎడిటర్ బ్యాండ్ బాజా బారాత్
2013 కహానీ
2013 జీ సినీ అవార్డులు ఉత్తమ ఎడిటర్
2013 టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ ఎడిటర్

మూలాలు మార్చు

  1. "A signature cut". The Hindu. 25 March 2012.
  2. 2.0 2.1 "The Best Cut". The Indian Express. 4 March 2012.
  3. God is in the rushes The Hindu 15 April 2017
  4. Film editor Namrata Rao ki "Kahaani" Archived 2013-04-24 at the Wayback Machine Career360, 14 July 2012.
  5. "60th National Film Awards Announced" (PDF) (Press release). Press Information Bureau (PIB), India. Retrieved 2023-05-07.
  6. "Namrata Rao is flying high". The Times of India. 3 October 2011.
  7. 'Band Baaja Baaraat' wins three IIFA AwardsCNN-IBN, 25 June 2011.

బయటి లింకులు మార్చు