నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పేరు నరసింహకొండ. ఇక్కడ వెలసిన శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం చాలా పురాతనమైనది. ఈ దేవాలయం ఇక్కడ ఉన్న చిన్న కొండపై ఉండుట వలన ఈ కొండను నరసింహకొండ అని పిలిచేవారు, ఈ కారణంగానే ఈ కొండ దిగువ భాగాన, కొండపైకి వెళ్లే మార్గంలో ఉన్న ఊరికి నరసింహకొండ అనే పేరు వచ్చింది.

శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రచురించిన వాల్ పోస్టర్

పవన విద్యుత్సవరించు

నెల్లూరు జిల్లాలో ఇక్కడ చాలా కాలం నుంచే పవన విద్యుత్ పరికరాలను అమర్చి విద్యుత్ను తయారు చేస్తున్నారు.

పెన్నానదిసవరించు

పెన్నానది, కొండ ప్రాంతం, అందమైన ప్రదేశాలు చూడముచ్చటగా ఉండి, భక్తులనే కాక ప్రకృతిని ఆస్వాదించే పర్యాటకులను సైతం ఆకర్షిస్తూ పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంది.

విద్యసవరించు

ఇక్కడ నారాయణ విద్యాసంస్థ స్థాపించిన విద్యాలయం మరొక ప్రత్యేక ఆకర్షణ.

డిస్టిలరీస్సవరించు

ఇక్కడ ఊరికి కొంచెం దూరంలో పూర్వం ప్రభుత్వ సారాయి (తయారీ, ) హోల్ సేల్ విక్రయ కేంద్రం ఉండేది, ఈ ప్రదేశాన్ని ప్రస్తుతం జిల్లాలోని బ్రాందీషాపులకు అవసరమయ్యే డిస్టిలరీస్ సరుకుల గోడౌన్‍గా ఉపయోగిస్తున్నారు.

ప్రయాణ మార్గాలుసవరించు

నెల్లూరు నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ప్రతి 30 నిముషములకు ఈ మార్గంలో బస్సు వసతి ఉంది.

ఇవి కూడా చూడండిసవరించు

నరసింహావతారము sri lakshmihayagreevaswamy devasthanam narasimhakonda

జొన్నవాడ

బయటి లింకులుసవరించు