నరేష్ కౌశిక్
నరేష్ కౌశిక్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో బహదూర్‌గఢ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
నరేష్ కౌశిక్ | |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | రాజిందర్ సింగ్ జూన్ | ||
---|---|---|---|
తరువాత | రాజిందర్ సింగ్ జూన్ | ||
నియోజకవర్గం | బహదూర్‌గఢ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చునరేష్ కౌశిక్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి నాల్గొవ స్థానంలో నిలిచాడు. ఆయన 2014 ఎన్నికలలో బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ఐఎన్‌సీ అభ్యర్థి రాజిందర్ జూన్‌పై 4,882 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2019 ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థి రాజిందర్ జూన్ చేతిలో ఓడిపోయాడు. నరేష్ కౌశిక్ 2024లో రోహ్‌తక్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ కన్వీనర్‌గా, రోహ్‌తక్ పార్లమెంటరీ నియోజకవర్గానికి బీజేపీ సమన్వయకర్తగా నియమితుడయ్యాడు.
మూలాలు
మార్చు- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ Zee News (1 October 2019). "हरियाणा विधानसभा चुनावः BJP ने बहादुरगढ़ विधानसभा सीट से एक बार फिर नरेश कौशिक पर जताया भरोसा". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.