నర్రా ప్రవీణ్ రెడ్డి
నర్రా ప్రవీణ్ రెడ్డి కవి, రచయిత, పరిశోధకుడు. చిట్యాల మండలం వట్టిమర్తి తన సొంత ఊరు. ప్రస్తుతం నార్కట్ పల్లిలో ఉంటున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగులో పరిశోధన చేస్తున్నాడు. ఇతడు రాసిన 'పొత్తి' నవలకు అంపశయ్య నవీన్ సాహిత్య పురస్కారం, రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ సాహితీ పురస్కారం అందాయి.
నర్రా ప్రవీణ్ రెడ్డి | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | నార్కెట్‌పల్లి | 1996 నవంబరు 30
వృత్తి | సాహిత్య పరిశోధన |
భాష | తెలుగు |
జాతీయత | భారతదేశం |
పౌరసత్వం | భారతదేశం |
విద్య | ఎం.ఏ.(తెలుగు), పిహెచ్‌డి |
పూర్వవిద్యార్థి | నలందా విద్యాలయం ఉన్నత పాఠశాల, నార్కట్‌పల్లి (1 నుంచి 10) ప్రభుత్వ జూనియర్ కళాశాల, రామన్నపేట కాకతీయ డిగ్రీ కళాశాల, నల్లగొండ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ |
కాలం | 2008-ప్రస్తుతం |
రచనా రంగం | చిన్న కథలు, నవల, కవిత్వం, విమర్శ, పరిశోధన[1] |
విషయం | సాహిత్యం |
సాహిత్య ఉద్యమం | తెలంగాణ మలిదశ ఉద్యమం |
గుర్తింపునిచ్చిన రచనలు | పొత్తి నవల |
చురుకుగా పనిచేసిన సంవత్సరాలు | 2008-ప్రస్తుతం |
జననం-బాల్యం
మార్చు1996 నవంబర్ 30 న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నార్కెట్‌పల్లిలో జన్మించాడు. తల్లిదండ్రులు నర్రా వెంకటలక్ష్మీ రాంరెడ్డి గార్లు.
విద్యాభ్యాసం
మార్చు1 నుంచి 10వ తరగతి వరకు నార్కట్ పల్లిలోని నలంద విద్యాలయ ఉన్నత పాఠశాలలో పాఠశాల స్థాయి విద్యను అభ్యసించి, ఇంటర్ రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ నల్లగొండ లో, పీజీని ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పూర్తిచేశాడు. అక్కడే చదువుతుండగా పీజీ రెండవ సంవత్సరంలో జేఆర్ఎఫ్ సాధించి పి.హెచ్ డీని పొందాడు.
సాహిత్యగమనం
మార్చుతెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తన కళ్ల ముందు జరుగుతున్న సంఘటనలను తెలంగాణ పల్లె జీవన విధానాన్ని, చరిత్రను ఆనాటి సామాజిక రాజకీయ విద్యా సంస్కృతిని ప్రతిబింబిస్తూ పొత్తి నవల రచన చేసాడు."కాలం బంధించిన క్షణాలు" అనే కవితా సంకలనం కరోనా నేపథ్యంలో రాసాడు. పుల్వామా ఘటన దృష్ట్యా "ఎవరెస్టు కన్నా ఉన్నతం" కవితా సంకలనానికి సహాసంపాదకత్వం వహించాడు. పలు పత్రికల్లో సాహిత్య, సామాజిక అంశాలపై వ్యాసాలు రాసాడు. కవితలు ఎనిమిదవ తరగతి(2008) నుండే రాస్తూ వచ్చాడు. పానం, రేగివండ్లు, పార్ట్ టైం, మైల వడ్డ ఇళ్ళు కథలు రాసాడు. ఫ్లోరోసిస్ పై, హరితహారం పై, ఎన్ఎస్ఎస్ పై, నిరుద్యోగంపై డిగ్రీ పూర్తయ్యే నాటికే పాటలు రాసాడు.ఇతడు రాసిన "హరిత హారమే .. నీకు హరిత హారమే" అనే పాటను జిల్లా జాయింట్ కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ విడుదల చేసాడు. "నల్లగొండ జిల్లారా విప్లవాల ఖిల్లారా" పాటలో ఎడవెల్లి , నైబాయి వంటి గ్రామాల ప్రస్తావన , పాలకుల పట్టింపులేని తనం రాయబడినవి.
రచనలు
మార్చుకవిత్వం
మార్చు- కాలం బంధించిన క్షణాలు(2019)
- గాయం వెనకున్న పార్శ్వం
- కన్నుల పతంగి
కథలు
మార్చు- నిప్పారింది (2019)
- పానం
- పార్ట్ టైం
- మైల వడ్డ యిల్లు
నవలలు
మార్చువ్యాసాలు
మార్చు- తెలంగాణ తెలుగు శాసనాలు
- అమ్మంగి వేణుగోపాల్ కథా సాహిత్య పరామర్శ
- గంగుల శాయిరెడ్డి కాపుబిడ్డ: సామాజికాంశాల పరిశీలన
- పద్య శిఖరం డా. కూరెళ్ళ విఠలాచార్య
- తరతరాల తెలంగాణ చరిత్ర
- నందిని సిధారెడ్డి కవిత్వం : గ్రామీణ జీవన చిత్రణ
- తెలంగాణ రుబాయిలు : రూప స్థిరీకరణ
గుర్తింపు
మార్చుమూలాలు
మార్చు- ↑ Desk, News (13 August 2022). "India must be rebuilt in Gandhi's spirit: Sahitya Akademi chairman". The Siasat Daily. Retrieved 22 September 2023.
{{cite news}}
:|first1=
has generic name (help) - ↑ "తెలంగాణ గ్రామ జీవిత చిత్రణ". https://magazine.telangana.gov.in/. Retrieved 22 September 2023.
{{cite web}}
: External link in
(help)|website=
- ↑ Ltd, Nasadiya Tech Pvt. "Pothe novel samiksha - An online Telugu story written by Mamidala shailaja | Pratilipi.com". telugu.pratilipi.com.
- ↑ "నవలా సాహిత్యంలో నూతన ఒరవడి 'పొత్తి' | సోపతి | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 22 September 2023.
- ↑ "తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించిన నవల 'పొత్తి'". Andhrajyothy Telugu News. 15 September 2021.
- ↑ "నర్రా ప్రవీణ్ రెడ్డి పొత్తి నవలకు... ప్రతిష్టాత్మక అంపశయ్య నవీన్ 2021 పురస్కారం". Asianet News Network Pvt Ltd. Retrieved 22 September 2023.
- ↑ Telugu, TV9 (24 October 2021). "Hyderabad: వి.వి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా వాసిరెడ్డి ఫౌండేషన్ జాతీయ పురస్కార ప్రధానోత్సవం". TV9 Telugu. Retrieved 23 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ ""వట్టిమర్తి గట్టి పిడికిలి మట్టి రూపం" నర్రా ప్రవీణ్ రెడ్డి;-బూర్గు గోపికృష్ణ , వట్టిమర్తిసెల్ : 7995892410". 29 December 2021. Retrieved 23 September 2023.