నల్లమోతు శ్రీధర్ 'కంప్యూటర్ ఎరా' తెలుగు పత్రికా సంపాదకుడు, సాంకేతిక గురు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు.

నల్లమోతు శ్రీధర్
Nallmothu Sridhar@Tewiki11.jpg
తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవ వేడుకలలో ప్రసంగిస్తున్న నల్లమోతు శ్రీధర్
జననంనల్లమోతు శ్రీధర్
నివాస ప్రాంతంహైదరాబాదు
ఇతర పేర్లునల్లమోతు శ్రీధర్
వృత్తిపత్రికా సంపాదకుడు
ప్రచురణకర్త
మతంహిందూ

వ్యక్తిగత జీవితంసవరించు

శ్రీధర్ యౌవ్వనంలో ఉన్నప్పుడు చదువు పూర్తిచేయకుండా ఆపేసి, మత్తుపదార్థాలు, డ్రగ్స్ వంటి దురలవాట్లకు బానిసయ్యాడు. ఈ పనుల వల్ల సొంతూరులో ముఖం చెల్లక ఊరికి దూరంగా ఉండేవాడు. ఆ సమయంలోనే శ్రీధర్ అమ్మమ్మ మరణించిన విషయం తెలిసింది. ఊరికి తిరిగివెళ్తే తన వ్యసనాల కారణంగా ఊరివారు చులకనగా చూస్తారని భయపడి ఊరికి వెళ్ళలేదు. ఆ సంఘటన అతనిపై తీవ్ర ప్రభావం చూపింది, వ్యసనాలను వదులుకుని క్రమశిక్షణతో జీవించడం ప్రారంభించాడు.[1]నల్లమోతు శ్రీధర్ 2005లో విపరీతమైన డిప్రెషన్ కి గురి అయ్యారు.ఒక సైకాలజిస్టుకు కలిసి తన ద్వారా కౌన్సెలింగ్ తీసుకున్నారు.ఇప్పుడు అయితే ఆయనతోనే కలిసి స్టేజ్ షేర్ చేసుకుని మోటివేషన్ స్పీచ్ కూడా ఇస్తున్నారు.[2]

వృత్తిసవరించు

నల్లమోతు శ్రీధర్ మొదట కర్నూలులో అకౌంటెంట్‌గా వృత్తి జీవితం ప్రారంభించాడు. తర్వాత చెన్నై నుండి వెలువడుతూ ఉన్న "క్రేజీ వరల్డ్" మాసపత్రికకు ఎగ్జిక్యూటివ్ సంపాదకుని హోదాలో చేరాడు. 1996 నవంబరులో క్రేజీ వరల్డ్ మాసపత్రికలో పనిచేస్తూనే అనుబంధ పత్రికగా "కంప్యూటర్ వరల్డ్" పేరుతో కంప్యూటర్ సంబంధిత అనుబంధ పత్రికను ప్రవేశపెట్టడం ద్వారా మొట్టమొదటిసారిగా కంప్యూటర్ సాహిత్యాన్ని తెలుగులో ప్రారంభించారు.సూపర్ హిట్ సినిమా పత్రిక నిర్వహించబడుతున్న సంస్థ నుండి ఈ క్రేజీ వరల్డ్ పత్రిక వెలువడుతూ ఉండేది. ఆ తర్వాత ఆగస్టు 1998 నుండి "కంప్యూటర్ విజ్ఞానం" అనే మరో కంప్యూటర్ సంబంధిత పత్రిక ప్రచురించబడుతూ వచ్చింది. 2001వ సంవత్సరం నుండి విజేత కాంపిటీషన్స్ ప్రచురణా సంస్థ నుండి వెలువడుతూ ఉన్న "కంప్యూటర్ ఎరా" తెలుగు మాసపత్రికకు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా కొనసాగుతున్నాడు. 2009 నుంచి టీవీ షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు టెక్నాలజీ వార్తలు చెప్పడం ప్రారంభించాడు. పోలీస్ అధికారులకు అప్పాలో కంప్యూటర్ టెక్నాలజీ బోధిస్తున్నాడు. వ్యక్తిత్వ వికాసం, టెక్నాలజీ ప్రభావం, ఆన్‌లైన్ భద్రత, సంబంధిత అంశాల గురించి పలు పత్రిక కార్యక్రమాలు, టీవీ షోలు, సోషల్ మీడియా వంటి వాటి ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు.

పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీసవరించు

పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీ అప్పా లో ఎస్సై, సీఐలకు కంప్యూటర్ పాఠాలు చెబుతూ సైబర్ క్రైం పై శ్రీధర్ రియల్ టైం సొల్యూషన్ అందిస్తున్నారు. ఇటీవల పెరిగిపోయిన సోషల్ సైట్ల వల్ల సైబర్ క్రైం పెరగడంతో దాన్ని సరైన పద్దతిలో పరిష్కారం చూపిస్తున్నారు. [1][3][4]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 పట్నాయక్, అశోక్ (14 March 2017). "తెలుగువారికి టెక్నాలజీ పాఠాలు చెబుతున్న శ్రీధర్ నల్లమోతు". యువర్ స్టోరీ తెలుగు. Retrieved 22 July 2018.
  2. patnaik, ashok (2016-03-25). "తెలుగువారికి టెక్నాలజీ పాఠాలు చెబుతున్న శ్రీధర్ నల్లమోతు". YourStory.com. Retrieved 2020-01-21.
  3. బళ్ళ, సతీశ్ (4 July 2018). "మీ వేలిముద్రలు ఎవరూ దొంగలించకుండా కాపాడుకోండి". BBC Telugu. BBC. Retrieved 22 July 2018.
  4. "నాలెడ్జిని పంచుతున్న నల్లమోతు శ్రీధర్ -" (ఆంగ్లం లో). 2019-04-09. Retrieved 2020-01-20. Cite web requires |website= (help)

బయటి లంకెలుసవరించు