నవీనా హేమంత్
నవీనా హేమంత్ చైల్డ్ సైకియాట్రిస్టు.[1]
జీవిత విశేషాలు
మార్చుఆమె రాజకీయ, సాంఘిక, తాత్విక రచయిత నరిశెట్టి ఇన్నయ్య, కోమల దంపతులకు గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు.[2] హైదరాబాదు లో కళాశాల విద్యనభ్యసించారు. బెంగుళూరు మెడికల్ కాలేజీలో మెడిసన్ చదివారు.[1] 1988 లో అమెరికా వెళ్ళి సైకియాట్రిలో స్పెషలైజేషన్ చేసారు. మానసిక వైద్య రంగంలో చాలా కొత్త విభాగమైన చైల్డ్ సైకియాట్రిలో అవిశ్రాంతంగా పరిశోధనలు చేసారు.[3] సూపర్ స్పెషాలిటీ అయిన పిల్ల సైకియాట్రి లో గణనీయమైన కృషి చేసారు.[4] ఇది ట్రిపుల్ ఎం.డితో సమానం. చైల్డ్ సైకియాట్రి అనేది కొత్తగా అభివృద్ధి చెందుతున్న అతి ముఖ్య వైద్య విభాగం కాగా ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలోనూ చైల్డ్ సైకియాట్రిస్ట్ ల సంఖ్య పరిమితంగానే ఉన్నది. వారిలోనూ ప్రాక్టీసు చేస్తున్నది 50 శాతం మంది మాత్రమే. 2002లో ఇండియన్ అకాడమీ ఆఫ్ చైల్డ్ సైకియాట్రీ అధ్వర్యంలో ప్రపంచ సదస్సు జరిగినపుడు ఈమె కూడా పాల్గొన్నారు. ఈ శాస్త్రం అభివృద్ధి చెంది, ప్రజలకు చేరువ కావడానికి ఈమె ఎంతో కృషి చేసారు. పిల్లలకు మానసిక సమస్యలు ఉంటాయని, వారికి చికిత్స ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం చేసారు. పలు జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో పరిశోధనా వ్యాసాలు వ్రాసారు. పిల్లల పెంపకంలో అతి ముఖ్యమైన మానసిక ఆరోగ్యం అందించడం పట్ల తల్లిదండ్రులకు ప్రేరణ, స్ఫూర్తి కలిగిస్తున్నారు.[5] ఆమె తమ్ముడు వాల్‌స్ట్రీట్ పత్రిక సంపాదకుడు.[2]
మూలాలు
మార్చు- ↑ 2.0 2.1 "BIO-DATA INNAIAH NARISETTI" (PDF). tana2013.org/. Archived from the original (PDF) on 3 జూన్ 2013. Retrieved 12 May 2016.
- ↑ "Dr. Naveena Hemanth MD బయాగ్రఫీ". Archived from the original on 2015-12-03. Retrieved 2016-05-13.
- ↑ Dr. Naveena Hemanth ( Child, Adolescent Psychiatry)
- ↑ ఆంధ్ర శాస్త్రవేత్తలు (krishanveni publishers,vijayawada ed.). vijayawada: శ్రీవాసవ్య. 1 August 2011. p. 205.